»   » సాయి ధరమ్ 'పిల్లా నువ్వు లేని జీవితం'' ఫస్ట్ లుక్ (ఫోటోలు)

సాయి ధరమ్ 'పిల్లా నువ్వు లేని జీవితం'' ఫస్ట్ లుక్ (ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  హైదరాబాద్‌: సాయిధరమ్‌తేజ్‌, రెజీనా జంటగా తెరకెక్కుతున్న చిత్రం 'పిల్లా నువ్వులేని జీవితం'. ఎ.ఎస్‌.రవికుమార్‌చౌదరి దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రానికి అల్లు అరవింద్‌, దిల్‌రాజు సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. హర్షిత్‌, బన్నీవాసులు నిర్మిస్తున్నారు. ఈ చిత్రం టైటిల్ లోగో, ప్రచార చిత్రాలని దీపావళి పర్వ దినాన్ని పురస్కరించుకుని ఆవిష్కరించారు.

  దర్శకుడు రవికుమార్ చౌదరి మాట్లాడుతూ...''ఏం పిల్లో.. తరవాత కొంత విరామం తీసుకొన్నా. కాకపోతే చాలా కథలు రాసుకొన్నా. నేను బతకడానికైతే విరామం లేకుండా సినిమాలు చేసేవాడిని. కానీ నా స్నేహితులు మంచి కథతో సినిమా తీయమని సూచించారు. అందుకే ఈ ఆలస్యం. '' అన్నారు.

  అలాగే .. మొదటి దిల్ రాజు గారికి కథ చెప్పాను. ఆయన నచ్చి అరవింద్ గారి దగ్గరకి తీసుకు వెళ్లారు. ఆయనకు కూడా నచ్చి వెంటనే ఓకే అన్నారు. ఇద్దరు పెద్ద నిర్మాతలతో చేసే అవకాసం రావటం చాలా ఆనందంగా ఉంది అన్నారు.

  ప్రచార చిత్రాలతో కూడిన స్లైడ్ షో ...

  క్రేజ్ తో..

  క్రేజ్ తో..

  చిరంజీవి మేనల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా ఎ.ఎస్.రవికుమార్ దర్శకుడిగా గీతా ఆర్స్ట్, ఎస్.వి.యస్ సినిమా సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమాకు 'పిల్లా నువ్వు లేని జీవితం'' అనే టైటిల్ ను ఖరారు చేశారు. అల్లు అరవింద్ సమర్పణలో బన్నివాసుహర్షిత్ లు నిర్మిస్తున్న ఈ సినిమా టైటిల్ ఫస్ట్ లుక్ ను ప్రసాద్ ల్యాబ్ లో ఆవిష్కరించారు. ఈ ప్రచార చిత్రాలు రిలీజ్ కావటంతోటే మంచి క్రేజ్ తెచ్చుకున్నాయి.

  దిల్ రాజు గారే...

  దిల్ రాజు గారే...

  దర్శకుడు కె.యస్.రవికుమార్ మాట్లాడుతూ ఈ సినిమా టైటిల్ పెట్టమని దిల్ రాజు గారు మాకు సూచించారు. ఈ టైటిల్ గురించి టీవీ లో ఆడియన్స్ పోల్ నిర్వహించి మరీ ఈ టైటిల్ పెట్టడం జరిగింది. నేను చేస్తున్న ఈ సినిమాకు ఇంత మంచి నిర్మాతలు దొరికినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది అన్నారు.

  బన్నీ వాసు మాట్లాడుతూ...

  బన్నీ వాసు మాట్లాడుతూ...

  అల్లు అరవింద్ గారి నుండి సినిమా ఎలా తీయాలో నేర్చుకున్నాను. అలాగే దిల్ రాజు గారి వద్దనుండి ఒక దర్శకుడి నుండి మంచి సినిమా ఎలా రాబట్టుకోవాలో నేర్చుకున్నాను. వారిద్దరికీ ఈ సందర్భంగా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. హర్షిత్ సినిమాను తన భుజాల మీద వేసుకుని నడిపించారు అన్నాడు.

  దిల్ రాజు మాట్లాడుతూ...

  దిల్ రాజు మాట్లాడుతూ...

  ఈ సినిమా చాలా విచిత్రంగా ప్రారంభమైంది. నా అన్న కొడుకు హర్షిత్ ను ఈ సినిమా ద్వరా నిర్మాతగా పరిచయం చేయడం ఆనందంగా ఉంది. బన్నీ వాసు తో కలిసి సినిమా నిర్మాణానికి సంబందించిన విషయాలను తెలుసుకుంటాడని విశ్వసిస్తున్నాను.

  దిల్ రాజు కంటిన్యూ చేస్తూ...

  దిల్ రాజు కంటిన్యూ చేస్తూ...


  దర్శకుడు రవికుమార్ ఈ సినిమాకు ఎంచుకున్న కథనం బాగుంది. గబ్బర్ సింగ్ సినిమా విడుదలైన సమయంలో దేవిశ్రీప్రసాద్ నాకు ఈ టైటిల్ చెప్పి రిజిస్టర్ చేసి పెట్టమన్నాడు. అప్పుడు చేసిన ఈ టైటిల్ ఇలా ఉపయోగపడటం ఆనందంగా ఉంది. ఈ సినిమాలో జగపతిబాబు, ప్రకాష్ రాజ్ లు కీలకపాత్ర పోషిస్తున్నారు. వీలైనంత తొందరలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తాము అన్నారు.

  అల్లు అరవింద్ మాట్లాడుతూ...

  అల్లు అరవింద్ మాట్లాడుతూ...

  సాయిధరమ్ తేజ్ లో నాకు ఒక మాస్ హీరో కనిపిస్తున్నాడు. అతడు తప్పకుండా మంచి హీరో అవుతాడు ఈ సినిమాలో కథానాయికగా నటించిన రెజీనా మంచి నటి+మంచి వ్యక్తిత్వం కలది అందుకే ఆమెను మా కొత్త జంట సినిమాలో కూడా ఎంపిక చేసుకున్నాము.

  అల్లు అరవింద్ కంటిన్యూ చేస్తూ...

  అల్లు అరవింద్ కంటిన్యూ చేస్తూ...

  దిల్ రాజుకు నాకు పది సంవత్సరాలకు పైగా సినిమాల పరంగా మంచి సాన్నిహిత్యం కుదిరింది. అందుకే ఇద్దరం కలసి ఈ సినిమాను రూపొందిస్తున్నాము. అన్నీ బాగా కుదిరితే భవిష్యత్తులో మరిన్ని సినిమాలు మా ఇద్దరి కాంబినేషన్ లో రానున్నాయి అన్నారు.

  సాయిధరమ్ తేజ్ మాట్లాడుతూ...

  సాయిధరమ్ తేజ్ మాట్లాడుతూ...

  ఇది నా రెండో సినిమా ఈ సినిమాకు కళ్యాణ్ మామయ్య నటించిన గబ్బర్ సింగ్ లో విజయవంతం అయిన పిల్లా నువ్వు లేని జీవితం అనే పాట పల్లవిని టైటిల్ గా పెట్టడం సంతోషంగా ఉంది. ఇంత మంచి టీమ్ తో పనిచేయడం ఆనందంగా ఉంది అన్నారు.

  ఎంతవరకూ వచ్చింది...

  ఎంతవరకూ వచ్చింది...

  ఈ చిత్రం షూటింగ్ ఇప్పటి వరకు సినిమా దాదాపు 80 శాతం పూర్తయింది. త్వరలోనే మొత్తం ఫినిష్ చేస్తారు..ట్రేడ్ లోనూ ఈ చిత్రానికి మంచి క్రేజ్ వచ్చింది. దాంతో బిజినెస్ పరంగా,ఓపినింగ్స్ పరంగా బాగుంటుందని భావిస్తున్నారు.

  శ్రీహరి ప్లేస్ లోకి జగపతిబాబు

  శ్రీహరి ప్లేస్ లోకి జగపతిబాబు

  శ్రీహరి హఠాత్ మరణంతో ఈ చిత్రం రీషూట్ కి వెళ్లాల్సి వచ్చిందని తెలుస్తోంది. శ్రీహరి పై తీసిన సన్నివేశాలు అన్నీ జగపతిబాబుకి మార్చి తీస్తున్నట్లు చెప్పుకుంటున్నారు.

  ఆర్టిస్ట్ లు ఎవరెవరు

  ఆర్టిస్ట్ లు ఎవరెవరు

  హీరో,హీరోయిన్స్ కాక ఈ సినిమాలోని ఇతర పాత్రల్లో జగపతిబాబు, ప్రకాష్ రాజ్, సత్యకృష్ణన్, చంద్రమోహన్, ధర్మవరపు, రఘుబాబు, దువ్వాసి మోహన్, రజిత, సత్యకృష్ణ, సురేఖావాణి తదితరులు నటిస్తున్నారు.

  టెక్నికల్ టీమ్..., స్క్రీన్ ప్లే బేసెడ్...

  టెక్నికల్ టీమ్..., స్క్రీన్ ప్లే బేసెడ్...

  ఈ చిత్రానికి మాటలుః మరుధూరి రాజా, పాటలుః చంద్రబోస్, అశోక్ తేజ, సంగీతంః అనూప్ రూబెన్స్, సినిమాటోగ్రఫిః దాశరధిశివేంద్ర, కథ, మాటలు, దర్శకత్వం ఎ.ఎస్.రవికుమార్.

  ఈ చిత్రంలో స్క్రీన్ ప్లే లో కొత్తదనం ఉంటుంది. ఇది స్క్రీన్‌ప్లేలో కొత్త ఒరవడి సృష్టిస్తుందనే నమ్మకం ఉంది. చాలా భాగం రామోజీ ఫిల్మ్‌సిటీలోనే తెరకెక్కించాం అని దర్శక,నిర్మాతలు థీమాగా చెప్తున్నారు.

  English summary
  
 Sai Dharam Tej has readied his second film, which is titled Pilla Nuvvu Leni Jeevitham. The title is taken from the super hit song from Gabbar Singh. On the occasion of the Deepavali festival, the film's title logo unveiled at Prasad Labs preview theatre in Hyderabad. A S Ravi Kumar Chowdhary is directing this romantic entertainer that has Regina as heroine. Bunny Vaas and Harshith Reddy are producing this movie and it is presented by Geeta Arts and Dil Raju's banner. Anup Rubens has scored the music.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more