»   » గడ్డిపోచ కాదు గడ్డపారే: బన్ని, చెర్రీ, చిరు, ఇప్పుడు స్కీమ్ తో సాయి ధరమ్ తేజ

గడ్డిపోచ కాదు గడ్డపారే: బన్ని, చెర్రీ, చిరు, ఇప్పుడు స్కీమ్ తో సాయి ధరమ్ తేజ

Posted By:
Subscribe to Filmibeat Telugu
హైదరాబాద్: సాయి ధరమ్ తేజ్, రకుల్ ప్రీత్ సింగ్ హీరో హీరోయిన్లుగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'విన్నర్'. త్వరలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురాబోతోంది. షూటింగ్ తో సహా అన్ని పనులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రమోషన్ల వేగం పెంచేసింది.

అలాగే ప్రస్తుతం మెగా కాంపౌండ్ లో ట్రెండ్ గా మారిన ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ను కూడా ధరమ్ తేజ్ అనౌన్స్ చేశారు. గతంలో బన్నీ 'సరైనోడు', చరణ్ 'ధృవ', చిరు 'ఖైదీ నెం 150' సినిమాలు ఇలాగే ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసుకుని ఘన విజయాలు సాధించడంతో మెగా హీరోలకి ఇదొక ఆనవాయితీగా మారి ఇప్పుడు ధరమ్ తేజ్ కూడా ఫాలో అవుతున్నాడు.


ఈ ఈవెంట్ ఆదివారం 19న గ్రాండ్ గా హైదరాబాద్లో జరగనుంది. అనంతరం 24న సినిమా రిలీజ్ కానుంది. ఆడియో రిలీజ్ లేదు కాబట్టే....ఒక్కో పాటను ఒక్కో స్టార్ చేత విడుదల చేయిస్తూ రోజూ సోషల్ మీడియాలో చర్చకు వస్తూ అనుకున్న స్పందనను రాబట్టుకుంటోంది.


రీసెంట్ గా ఈ చిత్రానికి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేసారు. మాస్ యాక్షన్ తో పాటు కామెడీ పంచ్ లతో కట్ చేసిన ట్రైలర్ సినిమా మీద అంచనాలను పెంచేస్తోంది.ట్రైలర్ కు యూట్యూబ్ లో అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఆదివారం ఉదయం ట్రైలర్ రిలీజ్ కాగా... సోమవారం 1 మిలియన్ వ్యూస్ క్రాస్ అయింది. మెగా ఫ్యామిలీలోని మెగాస్టార్, పవర్ స్టార్, మెగా పవర్ స్టార్, స్టైలిష్ స్టార్స్ నటించిన సినిమాల ట్రైలర్లు ఒక రోజులో ఇలాంటి రెస్పాన్స్ సొంతం చేసుకోవడం మామూలేగానీ.... ఇప్పుడిప్పుడే మెగా ఫ్యామిలీ నుండి వస్తున్న సాయి ధరమ్ తేజ్ 1 మిలియన్ మార్క్ అందుకోవడం సంచలనమే అంటున్నారు.


Sai Dharam Tej's 'Winner' pre-release event & release dates confirmed

సాయిధ‌ర‌మ్ తేజ్ మాట్లాడుతూ ....సినిమా కోసం చాలా క‌ష్ట‌ప‌డ్డాం. హార్స్ రేసుల కాన్సెప్ట్ మూవీ. ఈ సినిమా షూటింగ్ టైంలో గోపీచంద్‌, ఛోటాగారు తీసుకున్న కేరింగ్ మ‌ర‌చిపోలేను. ఈ సినిమాకు ప‌నిచేయ‌డం బ్యూటీఫుల్ ఎక్స్‌పీరియెన్స్‌. జ‌గ‌ప‌తిబాబుగారితో నేను చేస్తున్న సెకండ్ మూవీ. ర‌కుల్ కంటే ఈసినిమాలో జెబిగారితో మంచి అనుబంధం ఏర్ప‌డింది. థ‌మ‌న్ బ్యూటీఫుల్ ఆల్బ‌మ్ ఇచ్చాడు. అన్నీ పాట‌లు మంచి రెస్పాన్స్‌ను రాబ‌ట్టుకున్నాయి.


గోపీచంద్‌గారు నాలోని స్పీడ్‌ను కంట్రోల్ చేసి నాలోని బెస్ట్ అవుట్‌పుట్‌ను రాబ‌ట్టుకున్నారు. ఛోటాగారితో నేను చేసిన ఐదో సినిమా విన్న‌ర్‌. బుజ్జిగారు, మ‌ధుగారు ఖ‌ర్చుకు వెనుకాడ‌లేదు. ఎందుకంటే క‌థ బ్యాక్‌డ్రాప్ అలాంటిది. కానీ వారు ఏం మాత్రం వెనుకాడ‌లేదు. త‌ప్ప‌కుండా అంద‌రికీ న‌చ్చే చిత్ర‌మ‌వుతుంది అన్నారు.ఈ సినిమాలో సింగం 3 ఫేం థాకూర్ అనూప్ సింగ్ విలన్ గా నటిస్తున్నాడు. జగపతిబాబు, ముఖేష్ రుషి, 30 ఇయర్స్ పృథ్వీ ఇలా భారీ తారగణంతో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫిబ్రవరి 24న రిలీజ్ కు రెడీ అవుతోంది. 'విన్నర్' చిత్రాన్ని ఠాగూర్ మధు, నల్లమలుపు శ్రీనివాస్(బుజ్జి) కలిసి లక్ష్మీ నరసింమా ప్రొడక్షన్స్ బేనర్లో నిర్మిస్తున్నారు.
అనసూయ ఈ చిత్రంలో ఐటం సాంగ్ చేసింది. సూయ సూయ అంటూ సాంగే ఈ స్పెషల్ సాంగును ప్రముఖ యాంకర్ సుమ కనకాల పాడటం విశేషం.


ఈ సినిమాకి సంబంధించిన ప్రతి విషయంలోను దర్శకుడు గోపీచంద్ మలినేని ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాడు. గోపీచంద్ మలినేని తీసిన సినిమాలకు మినిమమ్ గ్యారంటీ అనే పేరుంది. విన్న చిత్రంపై కూడా అంచనాలు బావున్నాయి. ఫిబ్రవరి 24న సినిమాను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

English summary
'Winner' will hit the screens on Feb 24. The makers are planning to hold a grand pre-release event on Feb 19, keeping with the tradition set by 'Sarrainodu', 'Dhruva' and 'Khaidi No. 150'.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu