twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అమ్మ డ్రగ్స్ తీసుకున్నానని భయపడింది: సాయి ధరమ్ తేజ్, ఛీ దుర్మార్గుడా అంటూ తమ్మారెడ్డి..

    By Bojja Kumar
    |

    మెగా ఫ్యామిలీ నుండి హీరోగా పరిచయమై వరుస సినిమాలు చేసుకుంటూ వెలుతున్న సాయి ధరమ్ తేజ్ తాజాగా 'జవాన్' మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఈ సందర్భంగా ఆయన తమ్మారెడ్డి భరద్వాజ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.

    ఈ ఇంటర్వ్యూలో ఆయన తన కెరీర్ గురించి ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. అసలు తాను ఇండస్ట్రీకి వద్దామనుకోలేదని, అనుకోకుండా ఇటు వైపు వచ్చానని తెలిపారు.

    సినిమాల్లోకి రావాలనుకోలేదు

    సినిమాల్లోకి రావాలనుకోలేదు

    సినిమాల్లోకి రావడం అనుకోకుండా జరిగిందని సాయి ధరమ్ తేజ్ తెలిపారు. నేను ఎంబీఏ చేశాను. ఆఫీస్ వాతావరణం ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి ఓసారి మా ఫ్రెండ్ ఆఫీసుకు రెండ్రోలు వెళ్లాను. 9 టు 5 జాబ్ మనకు సరిపడదని అర్థమైందని సాయి ధరమ్ తేజ్ తెలిపారు.

    అమ్మ డ్రగ్స్ తీసుకున్నానని భయపడింది

    అమ్మ డ్రగ్స్ తీసుకున్నానని భయపడింది

    మా ఫ్రెండ్ ఆఫీసులో ఎదురైన పరిస్థితులతో జాబ్ మనకు సెట్ కాదనుకున్నాను. ఏం చేయాలో అర్థం కాక డైలమాలో డిపోయాను. ఒక రెండ్రోజులు ఫీవర్. రూమ్ లో నుండి బయటకు రాలేదు. మా అమ్మ కంగారు పడింది. ఈడేమైనా డ్రగ్స్ తీసుకున్నాడా? ఏంటి ఇలా అయిపోయాడు? మందు కొడుతున్నాడా? సిగరెట్ కొడుతున్నాడా? అని భయపడిపోయింది అని సాయి ధరమ్ తేజ్ తెలిపారు.

    అపుడే డిసైడ్ అయ్యాను

    అపుడే డిసైడ్ అయ్యాను

    ఏది ఏమైనా డిఫరెంటుగా చేయాలని డిసైడ్ అయ్యాను. అందుకే సినిమాల్లోకి రావాలనుకున్నాను. మనకు ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ ఉంది కదా అని సినిమాలు ఎవరూ చూడరు. టాలెంట్ ఎవరికైనా ఉంటుంది. జనాలు యాక్సెప్ట్ చేస్తే బిగ్గెస్ట్ విక్టరీ. దేశం మొత్తం మీద 200 మంది హీరోలు ఉంటారు. అందులో నేను ఒకడిని అయితే అదృష్టం అనే ఆలోచనలో ఈ రంగంలోకి వచ్చాను అని సాయి ధరమ్ తేజ్ తెలిపారు.

    దురదృష్టవంతుడిని అన్నారు

    దురదృష్టవంతుడిని అన్నారు

    నేను హీరోగా మొదలైన తొలి సినిమా(రేయ్) మధ్యలోనే ఆగిపోయింది. తర్వాత సినిమా మొదలైంది. మరో 10 రోజుల్లో షూటింగ్ పూర్తవుతుంది అనగా కీలకమైన పాత్ర పోషించిన శ్రీహరి చనిపోయారు. అపుడు అంతా నన్ను ఐరన్ లెగ్, దురదృష్ట వంతుడు అన్నారు. లైఫ్ మళ్లీ మొదటికి వచ్చినట్లు అనిపించింది అని..... సాయి ధరమ్ తేజ్ తెలిపారు.

    సాయి ధరమ్ తేజ్ సమాధానం విని ఛీ దుర్మార్గుడా అన్న తమ్మారెడ్డి

    సాయి ధరమ్ తేజ్ సమాధానం విని ఛీ దుర్మార్గుడా అన్న తమ్మారెడ్డి

    ఆ మధ్య ఓ ఎంపీ సినిమా ఇండస్ట్రీపై దారుణమైన కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. సినిమా ఇండస్ట్రీకి చెందిన ఆడవారు రోజూ భర్తలను మారుస్తారు అని కామెంట్ చేశారు. దీనిపై స్పందించాలని తమ్మారెడ్డి కోరగా....సాయి ధరమ్ తేజ్ ఆసక్తికరంగా స్పందించారు. ఐ ఫీల్ సో హ్యాపీ. మా ఇండస్ట్రీ గురించి, మా పీపుల్ గురించి మాట్లాడుతున్నారు. ఏదో ఒకటి మాట్లాడుతున్నారుగా... అంటూ సమాధానం ఇచ్చారు. దీనికి తమ్మారెడ్డి స్పందిస్తూ... చీ దుర్మార్గుడా, దుష్టుడా(నవ్వుతూ) మీ లాంటి వారు ఉన్న ఇండస్ట్రీ నుండి నేను విరమిస్తున్నా... అంటూ జోక్ చేశారు.

    సాయి ధరమ్ తేజ్ అలా ఎందుకన్నారంటే...

    సాయి ధరమ్ తేజ్ అలా ఎందుకన్నారంటే...

    సార్ ఆయనేదో కాంట్రవర్సీ కోసం అన్నారని మనం కూడా కాంట్రవర్సీగా అనడం సరికాదు. అతడు మాట్లాడిన దానికి విలువ లేదు. మనం ఎందుకు రియాక్ట్ అవ్వాలి. మా అమ్మ చెప్పింది... అద్దాల మేడమీదే రాళ్లు ఎక్కువ పడతాయని, మనం అద్దాలను ఎంత స్ట్రాంగ్ గా బిల్డ్ చేయాలనేదే ముఖ్యం, అందుకే నేను అలా రియాక్ట్ అయ్యాను అని సాయి ధరమ్ తేజ్ తెలిపారు.

    చిరు మామయ్య చాలా కేర్ తీసుకున్నారు

    చిరు మామయ్య చాలా కేర్ తీసుకున్నారు

    చిరంజీవి మామయ్య నా కెరీర్ గురించి చాలా కేర్ తీసుకున్నారు. నా స్టడీ విషయంలో ఆయన ఎప్పుడూ సజెషన్స్ ఇస్తుండే వారు. నా చదువు విషయంలో ఆయన తీసుకున్నంత కేర్ నా జీవితంలో చాలా కీలకమైందని తెలిపారు.

    పవన్ మామయ్యకే చెప్పాను

    పవన్ మామయ్యకే చెప్పాను

    సినిమాల్లోకి వస్తాననే విషయం మొదట పవన్ మామయ్యకే చెప్పాను. అప్పుడు ఆయన ఎక్కడ యాక్టింగ్ ట్రైనింగ్ తీసుకోవాలి, ఏ ఇనిస్టిట్యూట్ అయితే బావుంటుంది అనే సలహాలు ఇచ్చారు అని సాయి ధరమ్ తేజ్ తెలిపారు.

    English summary
    Tammareddy Bharadwaj FACE to FACE Interview With Sai Dharam Tej. In This Video, Sai Dharam Tej Reveals how Chiranjeevi, Pawan Kalyan and Naga Babu Played a Major Part In his Life. He Also Talks about The Theme Of his Recent Release JAWAAN. Do Share your views in the comments section below.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X