»   » చిరంజీవి అభిలాష మాదిరిగానే తేజ్ ఐ లవ్ యు.. సాయిధరమ్ తేజ్!

చిరంజీవి అభిలాష మాదిరిగానే తేజ్ ఐ లవ్ యు.. సాయిధరమ్ తేజ్!

By Rajababu
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  సుప్రీమ్‌ హీరో సాయిధరమ్‌ తేజ్‌ కథానాయకుడిగా, అనుపమ పరమేశ్వరన్‌ హీరోయిన్‌గా క్రియేటివ్‌ కమర్షియల్స్‌ మూవీ మేకర్స్‌ పతాకంపై ఏ కరుణాకరన్‌ దర్శకత్వంలో క్రియేటివ్‌ ప్రొడ్యూసర్‌ కె.ఎస్‌.రామారావు నిర్మిస్తున్న చిత్రం 'తేజ్‌'. ఐ లవ్‌ యు అనేది ఉపశీర్షిక. ఈ సినిమా జూలై 6న విడుద‌ల‌వుతుంది. సోమ‌వారం ఈ చిత్ర ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు. ఈ ట్రైల‌ర్ విడుద‌ల కార్య‌క్ర‌మం మూవీ పీఆర్వోలు బీఏ రాజు, వంశీ కాక‌, నాయుడు, ఫ‌ణి, ఏలూరు శ్రీను, జిల్లా సురేశ్, ఆనంద్‌, దుడ్డి శీను అంద‌రి స‌మక్షంలో సాయిధ‌ర‌మ్ తేజ్‌, డిస్ట్రిబ్యూట‌ర్ దిలీప్ టాండ‌న్ ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు.

  జర్నలిస్టుల సమక్షంలోనే

  జర్నలిస్టుల సమక్షంలోనే

  క్రియేటివ్ కమర్సియల్స్ మొదటి చిత్రం 'అభిలాష' జర్నలిస్టుల సమక్షంలోనే ప్రారంభమైంది. సీనియర్ జర్నలిస్ట్ మిక్కిలినేని జగదీష్ బాబు క్లాప్ తో, మరో సీనియర్ జర్నలిస్ట్ ఐ.అర్జునరావు కెమెరా స్విచ్ ఆన్ తో 'అభిలాష' ప్రారంభమైంది. అప్పటి నుంచి నిర్మాత కె.ఎస్.రామారావు కి జర్నలిస్టులతో మంచి అనుబంధం ఉంది. ఇప్పుడు 'తేజ్ ఐ లవ్ యు' చిత్రం ట్రైలర్ ని పి.ఆర్.ఓ.ల సమక్షంలో విడుదల చేయడం విశేషం. ఈ కార్యక్రమంలో `తేజ్ ఐ ల‌వ్ యు` కాంటెస్ట్ విజేత‌ల‌కు హీరో సాయిధ‌ర‌మ్ తేజ్‌, నిర్మాత కె.ఎస్‌.రామారావు బ‌హుమ‌తుల‌ను అందించారు.

  చిరంజీవి సినిమా కూడా

  చిరంజీవి సినిమా కూడా

  హీరో సాయిధ‌ర‌మ్ తేజ్ మాట్లాడుతూ చిరంజీవితో క్రియేటివ్ కమర్సియల్స్ మొదటి సినిమా అభిలాష‌ జర్నలిస్టుల క్లాప్, స్విచ్ ఆన్ లతో ప్రారంభమైందని విన్నాను. ఇప్పుడు పీఆర్వోల స‌మ‌క్షంలో ట్రైల‌ర్ విడుద‌ల కావ‌డం ఆనందంగా ఉంది. క‌రుణాక‌ర‌ణ్‌ మంచి అవ‌కాశం ఇచ్చారు. మంచి పాత్ర ఇచ్చారు. కె.ఎస్‌.రామారావు క‌థ న‌చ్చాకే ఈ సినిమా చేశాం. మంచి సినిమా తీశామ‌నే ఫీలింగ్ క‌లిగింది. గోపీసుంద‌ర్‌గారి సంగీతం, సాహిసురేశ్ ఆర్ట్‌డైరెక్ష‌న్‌, అండ్రూ కెమెరావ‌ర్క్‌, డార్లింగ్ స్వామి మాట‌లు సినిమాకు పెద్ద ఎసెట్ అవుతాయి. స‌హ‌కారం అందించిన ప్ర‌తి ఒక్క‌రికీ థాంక్స్‌. అంద‌రికీ సినిమా న‌చ్చుతుందనే న‌మ్మ‌కంతో ఉన్నాను`` అన్నారు.

  క్రెడిట్ అంతా సాయిధరమ్‌ తేజ్‌కే

  క్రెడిట్ అంతా సాయిధరమ్‌ తేజ్‌కే

  నిర్మాత కె.ఎస్‌.రామారావు మాట్లాడుతూ - ``ఈ సినిమా టోట‌ల్ క్రెడిట్ అంతా సాయిధ‌ర‌మ్‌కే చెందుతుంది. అలాగే క‌రుణాక‌ర‌ణ్‌, అండ్రూ, గోపీసుంద‌ర్‌, డార్లింగ్ స్వామిల‌కు కూడా ద‌క్కుతుంది. నాకు తేజ్ డేట్స్ ఇచ్చి ఏడాదిన్న‌ర స‌మ‌యం వ‌ర‌కు మంచి క‌థ‌లు దొర‌క‌లేదు. ఆ స‌మ‌యంలో సాయిధ‌ర‌మ్ నాకు ఫోన్ చేసి నేనొక క‌థ విన్నాను. నాకు న‌చ్చింది. మీరు కూడా వినండి.. మీకు న‌చ్చితే సినిమా చేద్దాం అన్నారు. క‌రుణాక‌రన్ వ‌చ్చి క‌థ చెప్పాడు. నాకు న‌చ్చ‌డంతో ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యింది. క‌థ‌లో మంచి ఫీల్ ఉంది. యూత్‌ను బాగా ఆక‌ట్టుకుంటుంద‌ని అనుకున్నాను అని తెలిపారు.

  తేజ్‌లో మంచి ఫీల్

  తేజ్‌లో మంచి ఫీల్

  సినిమా నేను ఎక్స్‌పెక్ట్ చేసిన దానిక‌న్నా బాగా వ‌చ్చింది. సినిమాలో మంచి ఫీల్ క‌న‌ప‌డుతుంది. నా బ్యాన‌ర్‌లో ఎన్నో హిట్ సినిమాలు చేశాను. వాటికి ఏ మాత్రం త‌గ్గ‌కుండా మా బ్యాన‌ర్‌లో వ‌న్ ఆఫ్ ది బెస్ట్ మూవీ అవుతుంది. డార్లింగ్‌స్వామి డైలాగ్స్ చాలా బాగా రాశాడు. అండ్రూ సినిమాటోగ్ర‌ఫీ హైలైట్ అవుతుంది. గోపీసుంద‌ర్ మంచి మ్యూజిక్ ఇచ్చాడు. త‌న‌కు థాంక్స్‌. ఒక మంచి సినిమా తీయ‌డానికి స‌హాయ‌ప‌డిన నా న‌టీన‌టుల‌కు, సాంకేతిక నిపుణుల‌కు థాంక్స్‌`` అన్నారు.

  తేజ్ ట్రైలర్ అద్భుతంగా

  రైట‌ర్ డార్లింగ్ స్వామి మాట్లాడుతూ.. ట్రైల‌ర్ అద్భుతంగా ఉంది. సినిమాలో ల‌వ్‌ఫీల్ ఉంది. క‌రుణాక‌ర‌న్‌గారికి మంచి హిట్ కావాలి. కె.ఎస్‌.రామారావుగారికి ఈ సినిమాతో బాగా డ‌బ్బులు రావాలి. నాకు డైలాగ్స్ రాసే అవ‌కాశం ఇచ్చిన రామారావుగారికి థాంక్స్‌. తేజ్ ఎక్స్‌ట్రార్డిన‌రీ పెర్‌ఫార్మెన్స్ చేశాడు. కెమెరామెన్ అండ్రూ విజువ‌ల్స్ బ్యూటీఫుల్‌గా ఉన్నాయి. గోపీసుంద‌ర్ చాలా మంచి సంగీతాన్ని అందించాడు. ఆల్ రెడీ పాట‌లు చాలా పెద్ద హిట్ అయ్యాయి. సాంగ్స్ అన్ని హంటింగ్‌గా ఉన్నాయి. మా టీంకు చాలా మంచి పేరు తెచ్చే సినిమా అవుతుంద‌ని ఆశిస్తున్నాను అని అన్నారు.

  తేజ్ చిత్రం పెద్ద హిట్..

  తేజ్ చిత్రం పెద్ద హిట్..

  కెమెరామెన్ అండ్రూ మాట్లాడుతూ - ``మూవీ చాలా బాగా వ‌చ్చింది. త‌ప్ప‌కుండా పెద్ద హిట్ అవుతుంది`` అన్నారు. ఇంద్ర ఫిలింస్ డిస్ట్రిబ్యూట‌ర్ దిలీప్ టాండ‌న్ మాట్లాడుతూ - ``ట్రైల‌ర్ ఎక్స్‌టార్డిన‌రీగా ఉంది. సాయిధ‌ర‌మ్‌, క‌రుణాక‌ర‌ణ్‌క ఆంబినేష‌న్‌లో వ‌స్తోన్న ఈ సినిమా త‌ప్ప‌కుండా సూప‌ర్‌హిట్ అవుతుంది`` అన్నారు.

  నటీనటులు, సాంకేతిక నిపుణులు వీరే..

  నటీనటులు, సాంకేతిక నిపుణులు వీరే..

  సాయిధరమ్‌ తేజ్‌, అనుపమ పరమేశ్వరన్‌, జయప్రకాశ్‌, పవిత్రా లోకేశ్‌, ప థ్వీ, సురేఖా వాణి, వైవా హర్ష, జోష్‌ రవి, అరుణ్‌ కుమార్‌ తదితరులు నటిస్తోన్న ఈ చిత్రానికి లిరిక్స్‌: చంద్రబోస్‌, రామజోగయ్యశాస్త్రి, పోతుల రవికిరణ్‌, గోశాల రాంబాబు, స్టంట్స్‌: వెంకట్‌, ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్‌: సతీశ్‌, ప్రొడక్షన్‌ కంట్రోలర్‌: మోహన్‌, చీఫ్‌ కో డైరెక్టర్‌: చలసాని రామారావు, ఎడిటర్‌: ఎస్‌.ఆర్‌.శేఖర్‌, ఆర్ట్‌: సాహి సురేశ్‌, సంగీతం: గోపీ సుందర్‌, సినిమాటోగ్రఫీ: అండ్రూ.ఐ, మాటలు: డార్లింగ్‌ స్వామి, సహ నిర్మాత: వల్లభ, నిర్మాత: కె.ఎస్‌.రామారావు, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఎ.కరుణాకరన్‌.

  English summary
  Supreme Hero Sai Dharam Tej's latest is a breezy romantic entertainer 'Tej' (I Love You) with Anupama Parameswaran as his leading lady. Creative Producer K.S. Rama Rao is producing this film under his Creative Commercials Movie Makers banner in Karunakaran's Direction. The film is releasing.worldwide on July 6th. FIlm's Theatrical Trailer was released on Monday Evening in a special event. The trailer was unveiled by Sai Dharam Tej along with Distributor Dileep Tandon in the presence of Tollywood PRO's, BA Raju, Vamsi Kaka, Nayudu, Phani, Eluru Srinu, Jilla Suresh, Aanad, Duddi Srinu. 'Creative Commercials' first film 'Abhilasha' was launched in the presence of Journalists. Senior Journalist Mikkilijeni Jagadeesh Babu Clapped while another Senior Journalist I.Arjuna Rao switched on the camera for 'Abhilasha' back then. Since then, Producer KS Rama Rao is having good relationships with journalists.. Trailer of 'Tej I Love You' too released in the presence of PRO's. Hero Sai Dharam Tej, Producer KS Rama Rao Presented prizes for the winners of 'Tej I Love You' contest.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more