»   » ఆ గాసిప్‌ వార్త నిజం కాదు.. సాయిధరమ్ తేజ్ క్లారిటీ..

ఆ గాసిప్‌ వార్త నిజం కాదు.. సాయిధరమ్ తేజ్ క్లారిటీ..

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఇంటెలిజెంట్ సినిమా తర్వాత డైరెక్టర్ కరుణాకరన్ దర్శకత్వంలో మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ గురించి ఓ రూమర్ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతున్నది. ఈ నేపథ్యంలో సాయిధరమ్ తేజ్ స్పందించారు.

నా తదుపరి చిత్రానికి సంబంధించిన సినిమా టైటిల్ దేవుడు వరమందిస్తే అని ప్రచారం జరుగుతున్నది. కానీ నా సినిమాకు ఇంకా టైటిల్ ఖరారు కాలేదు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వినిపిస్తున్న టైటిల్‌కు మా సినిమాకు ఎలాంటి సంబంధం లేదు అని సాయిధరమ్ తేజ్ చెప్పారు.

ప్రముఖ నిర్మాత కేఎస్ రామారావు రూపొందిస్తున్న ఈ చిత్రంలో సాయిధరమ్ తేజ్ సరసన అనుపమ పరమేశ్వరన్ నటిస్తున్నది. ఈ చిత్రం తర్వాత దర్శకుడు చంద్రశేఖర్ ఏలేటితో, గోపీచంద్ మలినేనితో మరో సినిమా చేస్తున్నట్టు సమాచారం.

English summary
Tollywood young star, Sai Dharam Tej’s upcoming project has been titled, Devudu Varamandisthe, say reports.Sai Dharam Tej’s next titled, Devudu Varamandisthe? This movie said to be a romantic entertainer, it will be directed by Karunakaran. But Hero Sai Dharam Tej was clarified about title. He said our movie title still not finalised. We will let fans very soon.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu