»   » పర్శనల్ టాక్ :అంతా పవన్ కల్యాణ్‌ చూసుకొన్నారు

పర్శనల్ టాక్ :అంతా పవన్ కల్యాణ్‌ చూసుకొన్నారు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్:''సినిమాల్లోకి రావాలనుకొన్నాక అంతా కల్యాణ్‌ మావయ్య చూసుకొన్నారు. డ్యాన్స్‌ ఎక్కడ నేర్చుకోవాలి? నటన ఎక్కడ నేర్చుకోవాలి? అనే విషయాలపై కల్యాణ్‌ మావయ్యే సలహాలిచ్చారు. ఇప్పటికీ నాకేదైనా కథ నచ్చిందంటే కల్యాణ్‌ మావయ్యకి వినిపించే ప్రయత్నం చేస్తుంటా'' అంటున్నారు సాయి ధరమ్ తేజ.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

రెండో ప్రయత్నంగా చేసిన 'పిల్లా నువ్వు లేని జీవితం'తో ప్రేక్షకుల ముందుకొచ్చి గుర్తింపు తెచ్చుకున్నాడు. తొలి చిత్రం 'రేయ్‌' ఈ నెల 27న విడుదలవుతోంది. ఈ సందర్భంగా సాయిధరమ్‌ తేజ్‌ మీడియాతో మాట్లాడుతూ ఇలా స్పందించారు.

అలాగే... నాపైన ముగ్గురు మావయ్యల ప్రభావం చాలానే ఉంది. చెన్నైలో చదువుకొంటున్నప్పుడు నా ఆసక్తి దేనిపైన ఉందో గమనించి ప్రోత్సహించేవారు నాగబాబు మావయ్య. హైదరాబాద్‌కి వచ్చాక చిరంజీవి మావయ్య మార్గనిర్దేశం చేశారు. డిగ్రీ ఎలా చదువుతున్నాను? ఎన్ని మార్కులొస్తున్నాయి? ఇవన్నీ ఆయన ఆరా తీసేవారు అని చెప్పుకొచ్చారు.

ఇంకా సాయిధరమ్ తేజ ఏమన్నాడు స్లైడ్ షోలో..

పోటీ గురించి..

పోటీ గురించి..

మా ఇంట్లోనే చాలా మంది హీరోలు ఉన్నారు. ఇంటి నుంచే పోటీ ఎదురవుతోందా అంటే లేదనే చెప్పాలి. ఒక చెట్టుకి ఎన్నో పూలు పూస్తుంటాయి. అలా చిరంజీవి అనే చెట్టుకి కాసిన పూవులమే మేమంతా. ఎవరికి ఎవ్వరం పోటీగా భావించం. ఎవరి శైలిలో వాళ్లు సినిమాలు చేస్తూ వెళుతుంటామంతే.

చూడకండానే కంగ్రాట్స్

చూడకండానే కంగ్రాట్స్

'పిల్లా నువ్వు లేని జీవితం' సినిమా చూడకుండానే అందరూ వచ్చి 'కంగ్రాట్స్‌..' చెప్పారు. నీ సినిమా విడుదల కావడమే నీకో పెద్ద విజయం అన్నారు. నాకు నవ్వొచ్చింది. ఆ తర్వాత సినిమా చూసి మెచ్చుకొన్నారు.

అది నచ్చలేదు

అది నచ్చలేదు

'పిల్లా నువ్వు లేని జీవితం' లో నా హెయిర్‌ స్త్టెల్‌ ఒక్కటే వాళ్లకు నచ్చలేదు. మిగతా అన్ని విషయాల్లో సూపర్బ్‌ అన్నారు.

డ్యాన్సుల కోసం ప్రత్యేకంగా

డ్యాన్సుల కోసం ప్రత్యేకంగా

సినిమాలో సంగీతంతో పాటు, డ్యాన్స్‌కూ ప్రాధాన్యముంటుందని ముందే చెప్పారు. దీంతో బాగా ప్రాక్టీస్‌ చేశా.

మా అమ్మగారి...

మా అమ్మగారి...

మా అమ్మగారు క్లాసికల్‌ డ్యాన్సర్‌. ఆవిడ ప్రదర్శనల్ని డీవీడీల్లో చూస్తూ చెన్నైలో ఉన్నప్పుడే డ్యాన్స్‌ నేర్చుకొన్నా. అదంతా ఈ సినిమాకు పనికొచ్చింది.

రిహార్సల్ చేయించినా

రిహార్సల్ చేయించినా

పాటల షూటింగ్ కు నాలుగైదు రోజులు ముందే సెట్స్‌లో రిహార్సల్‌ చేయించేవారు. తీరా సెట్‌కు వెళ్లాక ఆ స్టెప్పులన్నీ మార్చేసి కొత్త స్టెప్పులిచ్చేవారు.

ఇంట్లో చెప్పకుండా..

ఇంట్లో చెప్పకుండా..

క్లైమాక్స్ సన్నివేశాల్లో సిక్స్‌ప్యాక్‌తో కనిపిస్తే బాగుంటుందని దర్శకుడు చెప్పారు. ఇంట్లో కూడా ఎవ్వరికీ చెప్పకుండా సిక్స్‌ప్యాక్‌ చేశా. ఆ సన్నివేశాలు ప్రేక్షకులకు కొత్త కిక్‌నిచ్చేలా ఉంటాయి.

 పరిశీలించి... కసరత్తులు

పరిశీలించి... కసరత్తులు

వైవీయస్‌ చౌదరిగారు కథ చెప్పాక... ఈ సినిమా కోసం ఏం చేయడానికైనా సిద్ధమే అని చెప్పా. వెస్టిండీస్‌ కుర్రాళ్ల బాడీ లాంగ్వేజ్‌ ఎలా ఉంటుందో పరిశీలించి అందుకు తగ్గట్టుగా నన్ను నేను తీర్చిదిద్దుకొన్నా. డ్యాన్స్‌, ఫైట్లు ప్రత్యేకంగా ఉండేలా చేశా.

 'రేయ్‌' ఎలా ఉండబోతోంది?

'రేయ్‌' ఎలా ఉండబోతోంది?

సంగీత పోటీ ప్రధానంగా సాగే చిత్రమిది. ఒక పెద్ద హీరో సినిమా ఎలా ఉంటుందో ఇదీ అలాగే ఉంటుంది.

నిరుత్సాహానికి ...

నిరుత్సాహానికి ...

ఆ విషయంలో కుటుంబం, స్నేహితులు అండగా నిలబడ్డారు. మరింత పరిణతితో ఆలోచించేలా చేశారు. అందుకే 'రేయ్‌' చిత్రాన్ని ఒక విలువైన అనుభవంలా భావించా. ఆ సినిమాతో ఏం నేర్చుకొన్నానో దాని గురించే ఆలోచించేవాణ్ని. అంతే కానీ విడుదల కాలేదే అని నిరాశ, నిస్పృహలకు గురికాలేదు.

మావయ్యలు సలహాలు?

మావయ్యలు సలహాలు?

సినిమాలు ఆలస్యమైనా, వాటి ఫలితాలు అటు ఇటైనా... నమ్మకం కోల్పోవద్దని ధైర్యం చెప్పేవాళ్లు. నీ ప్రతిభపై నువ్వు విశ్వాసం ఉంచుకో అని చెప్పేవారు. వారి సలహాలు పాటిస్తున్నా.

ఆనందం, ఆత్రుత

ఆనందం, ఆత్రుత

నాలుగేళ్ల ప్రయాణం ఈ సినిమా. ఎన్నో ఆశలు, మరెంతో కష్టం ఈ సినిమా వెనక ఉన్నాయి. నేననే కాదు... చిత్రబృందమంతా శక్తికి మించి కష్టపడింది. దర్శకనిర్మాత వైవీయస్‌ చౌదరిగారయితే సినిమా బాగా రావాలని ఎంత తపన పడ్డారో మాటల్లో చెప్పలేను. ఎంతో ప్రేమించి చేసిన ఇలాంటి సినిమా ప్రేక్షకుల ముందుకు రాకపోతే ఎంత బాధగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఎట్టకేలకు మా కష్టాలన్నీ తొలగిపోయి సినిమా విడుదలవుతుండడం ఒకపక్క ఆనందంగా, మరో పక్క ఆత్రుతగా ఉంది.

English summary
Sai Dharam Tej second film 'Pilla Nuvvu Leni Jeevitham' got released and that film minted money at the box-office. Now, his first film 'Rey' is scheduled to hit the theatres on March 27, 2015.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu