»   » 'పవన్ కళ్యాణ్ జోక్యం కొంతవరకే...'

'పవన్ కళ్యాణ్ జోక్యం కొంతవరకే...'

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : 'నా సినిమాల వ్యవహారాల్ని పవన్‌కల్యాణ్‌ చూసుకోవడం అంటే... నేను సినిమాల్లోకి వస్తానని చెప్పాక - ఎక్కడ డ్యాన్స్‌ నేర్చుకోవాలి? ఎక్కడ నటన నేర్చుకోవాలి? ఎలాంటి కథల్ని ఎంచుకోవాలి? ఇలాంటి విషయాలపై కల్యాణ్‌ మావయ్యే మార్గనిర్దేశనం చేశారు. ఇప్పటికీ ఏదైనా కొత్త కథ వస్తే మావయ్యకి ఖాళీ ఉందో లేదో తెలుసుకొని... వెళ్లి కథ వినిపిస్తుంటా. ఎలా ఉందో చెబుతుంటారు. అంతే తప్ప మిగతా విషయాల్లో జోక్యం చేసుకోరు. చిరంజీవి, నాగబాబు మావయ్యలకి కూడా నేను చేస్తున్న సినిమాల గురించి చెబుతుంటా.' అంటూ సాయిధరమ్ తేజ చెప్పుకొచ్చారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

చిరంజీవి మేనల్లుడు సాయిధరమ్‌ తేజ్‌ కూడా డ్యాన్సుల్లోనూ, ఫైట్లలోనూ మామకి తగ్గ అల్లుడు అనిపించుకొంటున్నాడు. 'పిల్లా నువ్వు లేని జీవితం'తో తెరకు పరిచయమయ్యాడు. ప్రస్తుతం 'రేయ్‌'తో సందడి చేస్తున్నాడు. ఈ చిత్రంలో డాన్స్ లకు మంచి పేరు వచ్చింది. ఈ విషయమై సాయి ధరమ్ తేజ ఇలా స్పందించారు.

Sai Dharm Teja about Pawan Kalyan interference in his movies

సాయిదరమ్ తేజ మాట్లాడుతూ...హీరో కావాలని నిర్ణయించుకొన్న తొలి రోజు నుంచే డ్యాన్సులపై ప్రత్యేకంగానే దృష్టిపెట్టా. స్వతహాగా మా అమ్మ మంచి డ్యాన్సర్‌. అమ్మ వేదికలపై ఇచ్చిన ప్రదర్శనల్ని చూసి నేను డ్యాన్స్‌ నేర్చుకొన్నా. 'రేయ్‌' సంగీతానికీ, డ్యాన్స్‌కీ ప్రాధాన్యమున్న చిత్రం అని చెప్పడంతో నేను మరింతగా ప్రాక్టీస్‌ చేశా. పాటల చిత్రీకరణకి నాలుగైదు రోజుల ముందు నుంచే డ్యాన్స్‌ రిహార్సల్స్‌ మొదలయ్యేవి.

రోజూ కొన్ని స్టెప్పులిచ్చేసి ప్రాక్టీస్‌ చేయమనేవారు నృత్యదర్శకులు. కొశ్చెన్‌ పేపర్‌ లీకైనంత ఆనందంతో ఆ స్టెప్పుల్ని బాగా ప్రాక్టీస్‌ చేసుకొని కెమెరా ముందుకెళ్లేవాణ్ని. తీరా అక్కడికి వెళ్లాక మళ్లీ స్టెప్పులు మార్చేవారు. ఇదేంటండీ అని దర్శకుడిని అడిగితే.. 'లొకేషన్‌కి తగ్గట్టు స్టెప్పులు ఉండాలి కదా...' అనేవారు. దీంతో మళ్లీ ఆ కొత్త స్టెప్పుల్ని ప్రాక్టీస్‌ చేసేవాణ్ని. అలా డ్యాన్స్‌ చేయడమే పనిగా పెట్టుకొని 'రేయ్‌'లో నటించా. అందుకే తెరపై అంత బాగా వచ్చాయి పాటలు అన్నారు.

English summary
Sai Dharm Teja said that his uncle Pawan Klaynan's interference in his movies is very low.
Please Wait while comments are loading...