»   » మెగాహీరో ఫస్ట్‌లుక్ అదుర్స్.. స్టన్నింగ్ స్టిల్స్ (ఫొటోలు)

మెగాహీరో ఫస్ట్‌లుక్ అదుర్స్.. స్టన్నింగ్ స్టిల్స్ (ఫొటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

విన్నర్ తర్వాత మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న చిత్రం నక్షత్రం. ఈ చిత్రంలో సాయి స్పెషల్ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్నాడు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన స్టిల్స్‌ను సాయి ధరమ్ ఫేస్‌బుక్‌లో షేర్ చేశారు. డిఫరెంట్ లుక్స్‌తో ఉన్న ఫొటోలు మెగా ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.

పవర్ ఫుల్ పోలీస్ పాత్రలో

పవర్ ఫుల్ పోలీస్ పాత్రలో

నక్షత్రం సినిమాకు సంబంధించిన కొన్ని ఫొటోలను ఇటీవల చిత్ర నిర్వాహకులు కొన్ని ఫొటోలను విడుదల చేశారు. వాటిని తేజూ తన ఫేస్‌బుక్ ఖాతాలో అభిమానులతో పంచుకొన్నారు. ఈ చిత్రంలో తేజూ పాత్ర పేరు అలెగ్జాండర్ అని తెలుస్తున్నది. తేజూ ఫొటోలను చూస్తే పవర్ ఫుల్ పాత్ర పోషిస్తున్నట్టు అర్ధమవుతున్నది.

జవానుగా..

జవానుగా..

విన్నర్ తర్వాత ఈ చిత్రం కాకుండా బీవీఎస్ రవి దర్శకత్వంలో ఓ సినిమాను చేస్తున్నారు. ఆ చిత్రానికి జవాన్ అని పేరుపెట్టారు. విన్నర్‌తో నిరాశపరిచిన సాయి ధరమ్ తేజ్ ఈ రెండు సినిమాలతో నిలదొక్కుకోవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.

క్రేజీ ప్రాజెక్ట్‌గా నక్షత్రం

క్రేజీ ప్రాజెక్ట్‌గా నక్షత్రం

నక్షత్రం సినిమాకు క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్వకత్వం వహిస్తున్నారు. మెగా హీరో రాంచరణ్‌తో తీసిన గోవిందుడు అందరివాడేలే చిత్రం తర్వాత కృష్ణవంశీ ఈ క్రేజీ ప్రాజెక్ట్‌పై దృష్టిపెట్టారు. ఈ చిత్రంలో సాయిధరమ్ తేజ్, సందీప్ కిషన్, రెజీనా, ప్రగ్యా జైస్వాల్, ప్రకాశ్ రాజ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

పాటలు మినహా సినిమా పూర్తి..

పాటలు మినహా సినిమా పూర్తి..

నక్షత్రం సినిమా మూడు పాటలు మినహా షూటింగ్ దాదాపు పూర్తి కావొచ్చింది. త్వరలోనే పాటల చిత్రీకరణ కోసం చిత్ర యూనిట్ బ్యాంకాక్ వెళ్లనున్నది. పవర్ ఫుల్ కథతో తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి భీమ్స్ సంగీతం అందిస్తున్నారు.

English summary
After Winner, Actor Sai Dharam Tej is doing Nakshtram movie. This crazy project under direction of creative director Krishna Vamshi. Recently Sai Dharam Tej shared this movies Photos.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu