»   » సంపూర్షేష్ బాబు కి సాయి ధరమ్ తేజ సాయిం

సంపూర్షేష్ బాబు కి సాయి ధరమ్ తేజ సాయిం

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : 'హృదయ కాలేయం' చిత్రంతో ప్రేక్షకులను నవ్వించి, కవ్వించిన నటుడు సంపూర్ణేష్‌ బాబు. ఆ తరువాత పలు చిత్రాల్లో కనిపించిన ఆయన ఇప్పుడు తాజాగా 'కొబ్బరి మట్ట' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ చిత్రం టీజర్ లాంచ్ ఈ రోజు జరుగుతోంది. ఈ లాంచింగ్ కు మెగా హీరో సాయి ధరమ్ తేజ రానున్నారు. ఈ విషయాన్ని కొబ్బరి మట్ట టీమ్, సంపూర్ణేష్ బాబు సోషల్ మీడియా ద్వారా తెలియచేసారు.

'కొబ్బరి మట్ట' సినిమా ఎడిటింగ్‌లో తన నటనను చూసి తానే పరవశం చెందానని బర్నింగ్‌స్టార్ సంపూర్ణేష్ బాబు పేర్కొన్నారు. తన నటనను ఎడిటింగ్‌లో చూసుకొని.. ఈ జన్మకు ఇది చాలనిపిస్తోందని, కొబ్బరి మట్ట తన జీవితానికి దొరికిన ఒక ఆణిముత్యమని సంపూ హర్షం వ్యక్తం చేశాడు.

'హృదయకాలేయం' ట్రైలర్‌ను తలదన్నేలా 'కొబ్బరి మట్ట' టీజర్‌ ఉంటుందనే ధీమా వ్యక్తం చేశాడు సంపూ. ఈ చిత్రంలో సంపూర్ణేష్ బాబు పాపారాయుడిగా నటిస్తున్నాడు. హృదయకాలేయం చిత్రంతో సంపూని పరిచయం చేసిన స్టీవెన్ శంకర్ ఈ చిత్రానికీ కథ, స్ర్కీన్‌ప్లే, మాటలు అందిస్తుండగా...రూపక్ రొనాల్డ్ సన్ దర్శకత్వం వహిస్తున్నాడు.

Sai Dharma Teja's Support To Sampoo

ఇదిలా ఉంటే.... సోషల్ మీడియాలో బర్నింగ్ స్టార్‌గా పేరు తెచ్చుకున్న సంపూ తన మొదటి చిత్రంతోనే టాలీవుడ్‌లో క్రేజ్ సొంతం చేసుకున్నాడు. స్టార్ హీరోల సినిమాల్లో స్పెషల్ క్యారెక్టర్లు చేస్తూ తన ఫామ్‌ను కొనసాగిస్తూ.. సింగం 123గా వచ్చాడు.

తాజాగా 'కొబ్బరి మట్ట' అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాను ఫిబ్రవరిలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు. ఈ సినిమాకు దర్శకత్వం రూపక్ రొనాల్డ్ రాస్, నిర్మాత ఆది కుంభగిరి, సాయిరాజేశ్ నీలం, కథ, స్క్రీన్‌ప్లే-మాటలు స్టీవెన్ శంకర్.

English summary
In a desperate bid to score a hit, Sampoo is now trying his luck with Kobbari Matta, a hilarious comedy entertainer from the makers of Hrudaya Kaleyam. To get the much needed boost for his film, the Burning Star has sought Supreme Hero Sai Dharam Tej's help.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu