»   » ‌ఇంకో ‘పటాస్ ‌’...: సాయిధరమ్ తేజ‘సుప్రీమ్‌’ ట్రైలర్ (వీడియో)

‌ఇంకో ‘పటాస్ ‌’...: సాయిధరమ్ తేజ‘సుప్రీమ్‌’ ట్రైలర్ (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: సాయిధరమ్‌తేజ్‌, రాశీఖన్నా జంటగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న 'సుప్రీమ్‌' ఆడియో విడుదలైంది. సాయికార్తీక్‌ స్వరాలు సమకూర్చిన ఈ చిత్రం ఆడియో విడుదల వేడుక హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో జరిగింది. ఈ సందర్బంగా చిత్రం ధియేటర్ ట్రైలర్ ని విడుదల చేసారు.


చిరంజీవి తల్లి అంజనాదేవి, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌, హీరో నాని ముఖ్య అతిథులుగా హాజరై సీడీని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో చిత్రం యూనిట్ తో పాటు హీరోలు వరుణ్‌తేజ్‌, దర్శకులు వంశీ పైడిపల్లి, హరీశ్‌ శంకర్‌, గోపీచంద్‌ మలినేని తదితరులు హాజరయ్యారు.


Sai Dharma teja's Supreme Theatrical Trailer

పటాస్ సినిమాలో అరె వో సాంబ సాంగ్ ని రీమిక్స్ చేసినట్లుగానే,సుప్రీమ్ సినిమాలో కూడా చిరంజీవి నటించిన యముడుకు మొగడు చిత్రంలోని అందం హిందోళం, అధరం తాంబూళం అనే పాటను రీమిక్స్ చేసారు. ఈ పాటలో కోరస్ సుప్రీమ్ హీరో అని వస్తుంది కాబట్టి టైటిట్ కు తగినట్లు పాట ఉండాలని రీమిక్స్ చేసినట్లు తెలుస్తోంది.


సాయి ధరమ్ తేజ్ ఈ చిత్రంలో ఆటో డ్రైవర్‌గా కనిపించనుండగా, రాశీఖన్నా పోలీస్ ఆఫీసర్‌గా అలరించనుంది. సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ హిట్‌తో తేజు జోష్‌లో ఉండగా, పటాస్ సక్సెస్‌తో అనీల్ మంచి ఊపు మీదున్నారు. మరి వీరిద్దరి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సుప్రీమ్ చిత్రం ఏ రేంజ్ అంచనాలను అందుకుంటుందో చూడాలి.

English summary
Sai Dharma teja's latest movie Supreme Theatrical Trailer released.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu