మెగాస్టార్ చిరు పోలికలతో వస్తున్నాడు ‘రేయ్’..??
ఇపుడు ఇండస్ట్రీ అంతా ఇదే మాట అంటోంది. చిరంజీవి కుమారుడు రామ్ చరణ్ తేజ కంటే ఆయన మేనల్లుడు సాయి ధరమ్ తేజ అచ్చు చిరంజీవిలా ఉన్నాడంటూ ఫిలిమ్ నగర్ జనం చెప్పుకుంటున్నారు. అంతేకాదండోయ్, చిరు తనయుడు రామ్ చరణ్ తేజ్ కన్నా ఈ మేనల్లుడిలోనే చిరు పోలికలు బాగా ఉన్నాయి చిరంజీవి నట వారసత్వాన్ని పూర్తిస్థాయిలో అందిపుచ్చుకోగల సత్తా సాయి ధరమ్ తేజకే ఉన్నాయనిపిస్తోందన్న వాదనలను కూడా తీసుకవస్తున్నారు. ఏదైనా మేనమామ పోలికలు వస్తే అదష్టవంతులవుతారంటారు. మరి తన మేనమామలా సాయి ధరమ్ తేజ కూడా స్టార్ అవుతాడో లేదో వేచి చూడాల్సిందే...
ఎవరేమన్నా మెగాస్టార్ మాత్రం తమ కుటుంబం నుంచి వెండితెరకు పరిచయమవుతున్న తమ బిడ్డల్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు శిరసు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నానంటున్నారు. దేవదాసుతో సంచలన విజయం నమోదు చేసిన వైవిఎస్ చౌదరి సాయిధరమ్ తేజతో ఎటువంటి హిట్ ఇస్తారో చూడాలి.


Click it and Unblock the Notifications











