»   »  బాహుబలి-2: ఊహించని రేటు చెల్లించిన నిర్మాత

బాహుబలి-2: ఊహించని రేటు చెల్లించిన నిర్మాత

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ‘ఈగ', ‘అందాల రాక్షసి', ‘లెజెండ్', ‘ఉహలు గుసగుసలాడే', ‘దిక్కులు చూడకు రామయ్యా', ‘తుంగభద్ర' వంటి సక్సెస్ ఫుల్ చిత్రాలను అందించిన వారాహి చలన చిత్రం అధినేత, స్టార్ ప్రొడ్యూసర్ సాయికొర్రపాటి. నిర్మాతగానే కాకుండా డిస్ట్రిబ్యూటర్ గా కూడా ఎన్నో విజయవంతమైన చిత్రాలను ప్రేక్షకులకు అందించారు.

Sai Korrapati bought Baahubali 2 Karnataka rights

ఇటీవల దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన సూపర్ డూపర్ హిట్ మూవీ 'బాహుబలి- ది బిగినింగ్' నికూడా ఆయన డిస్ట్రిబ్యూట్ చేశారు. ఈ సినిమా రెండో పార్ట్ త్వరలోనే ప్రారంభం కానుంది. 'బాహుబలి' పార్ట్ 1 సాధించిన సక్సెస్ తో 'బాహుబలి' పార్ట్ 2 పై హై ఎక్సెపెక్టేషన్స్ నెలకొని ఉన్నాయి.


చాలా మంది డిస్ట్రిబ్యూటర్స్ ఈ సినిమా హక్కులను కైవసం చేసుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా కర్ణాటక రాష్ట్రానికి చెందిన బాహుబలి పార్ట్ 2 హక్కులను ఎవరూ ఎక్స్ పెక్ట్ చేయనంత ఫ్యాన్సీ రేటును చెల్లించి సాయికొర్రపాటి కైవసం చేసుకున్నారు. ఈ సినిమాతో మరో సూపర్ హిట్ మూవీని అందించే ప్రయత్నం చేస్తున్నారు వారాహిచలన చిత్రం అధినేత సాయికొర్రపాటి. అలాగే తెలుగు ప్రేక్షకులకు 69వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలను తెలియజేశారు.

English summary
According to the latest update, renowned producer Sai Korrapati has bought the Karnataka rights of Baahubali 2 for a mind blowing price.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu