»   » ఏపీ రాజధానికి ‘బాహుబలి’ బెనిఫిట్ షో డొనేషన్ ఎంతంటే?

ఏపీ రాజధానికి ‘బాహుబలి’ బెనిఫిట్ షో డొనేషన్ ఎంతంటే?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని నిర్మాణంలో వారాహి చలనచిత్రం భాగం కావాలనుకుని కృష్ణాజిల్లాలో ‘బాహుబలి' బెనిఫిట్ షోను ఏర్పాటు చేసి తద్వారా వచ్చిన మొత్తాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకి అందజేయాలని నిర్ణయించుకున్న విషయం తెలిసిందే.

అందులో భాగంగా నిర్వహించిన ఈ బెనిఫిట్ షోస్ ద్వారా 24, 24, 999 రూపాయల ఆదాయం వచ్చింది. ఈ మొత్తాన్ని వారాహి చలనచిత్రం అధినేత సాయికొర్రపాటి ఆంధ్రప్రదేశ్ నూతన నిర్మాణ రాజధానికి విరాళంగా అందజేయనున్నారు.


Sai Korrapati donates 24.25 lacs to AP Capital

ఎన్నో ఉత్తమ చిత్రమ చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించిన నిర్మాత సాయికొర్రపాటి సినిమా రంగంతో పాటు, సేవారంగంలోనూ ముందుంటున్నారు. గతంలో హుదూద్ బాధితులకు ఆర్ధిక సహాయంతో పాటు వంద టన్నుల బియ్యం కూడా అందించారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణంలో పాలుపంచుకుని సహృదయతను చాటుకున్నారు.

English summary
Sai Korrapati donates 24.25 lacs to AP Capital construction from the proceedings of Baahubali benefit shows
Please Wait while comments are loading...