twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    డబ్బింగ్‌లో హయ్యెస్ట్ రెమ్యూనరేషన్ అదే.. ఆ సినిమాకే ఎక్కువ మొత్తంలో.. సాయి కుమార్ కామెంట్స్

    |

    సాయి కుమార్ అంటే గొప్ప పాత్రలే కాదు గంభీరమైన గొంతు కూడా వినిపిస్తుంది. ఎంతో మంది హీరోలకు గొంతును అరువిచ్చి బ్లాక్ బస్టర్ హిట్స్‌లో భాగస్వామి అయ్యాడు. డబ్బింగ్ చెప్పడంలో సాయి కుమార్‌కు సాటి ఎవ్వరూ లేరు. సాయి కుమార్ గొంతు ఇచ్చాడంటే ఆ పాత్ర ఓ రేంజ్‌లొ పండాల్సిందే. హీరో రాజశేఖర్‌కు రెగ్యులర్‌గా సాయి కుమార్ వాయిస్ అందిస్తుంటాడు. అయితే సాయి కుమార్ మాత్రం తన కెరీర్‌లో రజినీకాంత్‌కు డబ్బింగ్ చెప్పడంపై ఎప్పుడూ ఓ అద్భుతంగా ఫీల్ అవుతాడు.

    ఎన్నో విషయాలు..

    ఎన్నో విషయాలు..

    తాజాగా సాయి కుమార్ అలీతో సరదాగా ప్రోగ్రాంలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా సాయి కుమార్ తన జీవితంలో జరిగిన ఎన్నో సంఘటనల గురించి వివరించాడు. డబ్బింగ్ కెరీర్ ఎలా స్టార్ట్ అయింది? మొదటి రెమ్యూనరేషన్ ఎంత? మొత్తంగా హయ్యస్ట్ రెమ్యూనరేషన్ ఎంత అనే విషయాలను చెప్పుకొచ్చాడు.

    మొదటి రెమ్యూనరేషన్..

    మొదటి రెమ్యూనరేషన్..

    సాయి కుమార్ డబ్బింగ్ చెప్పి మొదటగా సంపాదించిన మొత్తం రూ. 250. అది తీసుకెళ్లి ఇంట్లో ఇవ్వగానే అమ్మ ఎంతో సంతోషపడిందని సాయి కుమార్ చెప్పాడు. అయితే ఆపై వచ్చిన సినిమాకు కాస్త రెమ్యూనరేషన్ పెంచాను. ఇంట్లో వారికి ఎవ్వరికీ చెప్పలేదని, రూ750 అడిగానని దాంతో వారు తిరిగి వెళ్లిపోయారని తెలిపాడు. ఆ సినిమా ఫ్లాప్ అవ్వడంతో తరువాతి చిత్రానికి రూ. 1116 ఇచ్చి మరీ తీసుకెళ్లారని పేర్కొన్నాడు.

    కొంచెం కొంచెంగా..

    కొంచెం కొంచెంగా..

    అలా తన డబ్బింగ్ కెరీర్ సాగుతూ వచ్చిందని తెలిపాడు. 1116 నుంచి పుంజుకున్న కెరీర్.. రెండు వేలు, ఐదు వేలు, పది వేలు, 25 వేలు ఇలా పెరుగుతూనే వచ్చిందని తెలిపాడు. అయితే తాను ఎక్కువగా తీసుకున్నది ఇరవై వేలు, ఇరవై ఐదు వేలే ఉంటుందని తెలిపాడు.

     ఆ చిత్రాలకే ఎక్కువగా...

    ఆ చిత్రాలకే ఎక్కువగా...

    డబ్బింగ్ కెరీర్ మొత్తంలో హయ్యస్ట్ రెమ్యూనరేషన్ అంటే పది లక్షలు తీసుకున్నానని తెలిపాడు. అది కూడా ఈ మధ్య వచ్చిన చిత్రాలేనని, ఎవడైతే నాకేంటి, గరుడ వేగ వంటి చిత్రాలకు పది లక్షలు తీసుకున్నానని అన్నీ సీక్రెట్లను బయట పెట్టేశాడు.

    Recommended Video

    Shakeela To Release Her Film In OTT Platform
    నంది అవార్డు మాత్రం..

    నంది అవార్డు మాత్రం..

    డబ్బింగ్ కేటగిరీలో మాత్రం నంది అవార్డు తీసుకోకపోవడంతో అసంతృప్తి ఉందని తెలిపాడు. తాను డబ్బింగ్ చెప్పినంత కాలం.. ఆ కేటగిరీలో నంది అవార్డులు ఇవ్వలేదని పేర్కొన్నాడు. డబ్బింగ్‌కి నంది అవార్డులు ప్రకటించడం ప్రారంభించినప్పటి నుంచి తాను ఆ వృత్తిని వదిలేసినట్టు తెలిపాడు.

    English summary
    Sai Kumar About His Remuneration In Dubbing. he Hot Highest Remunreation In Dubbing For Rajasekhar Movies Like Yevadiathe Nakenti, Garudavega.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X