For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఫంక్షన్‌కు పిలిచి మరీ అంతలా అవమానించారా?.. స్టార్ హీరో, బడా నిర్మాతపై సాయి కుమార్ కామెంట్స్

  |

  సాయి కుమార్ అంటే తెలుగు వాళ్లకు వెంటనే ఓ డైలాగ్ గుర్తుకువస్తుంది. పోలీస్ స్టోరి చిత్రంలో అగ్ని పాత్ర చెప్పే మూడు సింహాల డైలాగ్. ఇప్పటికీ, ఎప్పటికీ ఈ చిత్రం, ఆ డైలాగ్, ఆ పాత్ర ఓ చరిత్రే. డైలాగ్ కింగ్ సాయి కుమార్ తన కెరీర్‌లో పడ్డ కష్టాలు, కుటుంబ భారం, బాధ్యతల గురించి తాజాగా చెప్పుకొచ్చాడు. అలీ హోస్ట్‌గా నిర్వహించే షోలో సాయి కుమార్ తాజాగా తన జీవితంలో పడిన కష్టాలను ప్రేక్షకులకు తెలియజేశాడు. అందులో భాగంగా ఓ సినిమా ఫంక్షన్‌కు పిలిచి మరీ అక్కడ అవమానించిన ఘటనను గుర్తు చేసుకున్నాడు.

  ఎంతో సంతోషంగా..

  ఎంతో సంతోషంగా..

  ఓ స్టార్ సినిమా సూపర్ హిట్ అయిందని, తిరుపతిలో పెద్ద ఫంక్షన్ నిర్వహిస్తున్నారని, దానికి మా తండ్రి(పీజే శర్మ)ను కూడా పిలిచారని సంబరపడిపోయినట్టు సాయి కుమార్ తెలిపాడు. ఇంటికి వచ్చి చిన్న పిల్లాడిలా మారిపోయి.. సినిమా హిట్, అందులో నేను కూడా నటించాను.. తిరుపతిలో సినిమా ఫంక్షన్, మనల్ని కూడా రమ్మన్నారు, చార్టెడ్ ఫ్లైట్‌లో తిరుపతికి వెళ్తున్నాం, అంటూ పీజే శర్మ ఆనందపడ్డాడట.

   తీరా వెళ్లే సరికి..

  తీరా వెళ్లే సరికి..

  అప్పట్లో చార్టెట్ ఫ్లైట్ అంటే గొప్పే కదా అని, అయితే తాము వెళ్లేసరికి అక్కడ బస్ మాత్రమే ఉందని తెలిపాడు. అప్పటికే చార్టెట్ ఫ్లైట్‌లో వారంతా వెళ్లిపోయారని, టెక్నికల్ టీమ్ కోసం ఓ బస్ ఉందని, వారితో పాటు మమ్మల్ని వెళ్లమని చెప్పారట. అది చూసి పీజే శర్మ షాక్ అయ్యారట. ఎంతో కష్టపడి తన తండ్రిని బస్ ఎక్కించానని సాయి కుమార్ తెలిపాడు. కానీ మనసులో మరో బాధ మొదలైందట.

  అదే హోటల్..

  అదే హోటల్..

  పెద్ద వారికి ఏర్పాటు చేసినట్టుగానే తమకు కూడా అదే హోటల్‌లో ఇస్తారో లేదొ మరో కంగారు ఏర్పడిందట. అయితే స్టార్ హీరోకు ఇచ్చిన హోటల్‌ వద్దే తమ బస్సు ఆగిందని, మా ఇద్దర్నీ అక్కడే దిగమనడంతో ఊపిరి పీల్చుకున్నట్టు తెలిపారు. అలా హోటల్‌లో దిగామని, సాయంత్రం వేదిక దగ్గరకు వచ్చేటప్పుడే లగేజ్ వెంట పెట్టుకుని రమ్మన్నారని తెలిపాడు.

  ఫంక్షన్ క్యాన్సల్..

  ఫంక్షన్ క్యాన్సల్..

  అక్కడ గుమిగూడిన జనానికి, తోపులాటకు ఫంక్షన్ క్యాన్సిల్ అయిందట. దీంతో అందరూ తిరుగు ప్రయాణమయ్యారట. వీరందరి కోసం ఓ బస్ ఏర్పాటు చేశారట. అందులో వీరు ఎక్కి వెళ్తుండగా.. చిత్ర యూనిట్ వారు మధ్యలో ఓ గ్రాండ్ ఫంక్షన్ నిర్వహించారట. అందులోకి తమ బస్ వెళ్తుండగా.. అక్కడి వారు ఆపారని తెలిపాడు.

  అలా అవమానించారు..

  అలా అవమానించారు..

  అయితే తమ బస్‌ను లోనికి అనుమతించకపోవడంతో స్టార్ హీరోకు కావాల్సిన స్టార్ ప్రొడ్యూసర్ వచ్చి.. మీరంతా చెన్నైకి వెళ్లిపోండని ఆదేశించాడట. బస్‌లో ఉన్న వారందరికీ ఓ బిర్యానీ పొట్లం, చీప్ మందు ఇచ్చారట. దీంతో పండుగ చేసుకోండని చెప్పారట. మా నాన్న గారిని అయినా లోనికి అనుమతించడని తాను వేడుకున్నానని కానీ వారు వినిపించుకోలేదని తెలిపాడు.

  Shakeela To Release Her Film In OTT Platform
  స్కాచ్ తాగే అర్హత లేదా?

  స్కాచ్ తాగే అర్హత లేదా?

  ఆ సమయంలో విపరీతమైన కోపం వచ్చిందని, వారు ఇచ్చిన చీప్ లిక్కర్ బాటిల్‌ను విసిరి కొట్టాడని, తనకు స్కాచ్ తాగే అర్హత లేదా? అని నాన్న బాధపడ్డారని సాయి కుమార్ వివరించాడు. ఆపై తండ్రికి ఓ స్కాచ్ బాటిల్ కొనివ్వాలని ఆ రోజు ఫిక్స్ అయ్యానని సాయి కుమార్ తెలిపాడు. ఆ తరువాతి కాలంలో అమెరికా నుంచి ఓ స్కాచ్ బాటిల్‌ను బర్త్ డే గిఫ్ట్‌గా ఇచ్చానని, అదే తన దృష్టిలో గొప్ప బహుమతి అని సాయి కుమార్ తన కథ అంతా వివరించాడు.

  English summary
  Sai Kumar About Humiliation In Cinema Function. PJ sharma ANd Sai Kumar Was Called To Movie Success Function. but later They Humiliates By Treating cheap Facilities.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X