For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  హిజ్రా పాత్రకి సాయికుమార్ నే...

  By Srikanya
  |

  బెంగుళూరు : త్వరలో హిజ్రాగా సాయికుమార్ తన విశ్వరూపం చూపించనున్నారు. తెలుగులో హిట్టైన 'కాంచన'కన్నడ రీమేక్ కల్పన లో ఈ పాత్రను పోషిస్తున్నారు. తమిళ,తెలుగులో ఈ పాత్రను శరత్ కుమార్ చేసి మెప్పించారు. దాంతో సాయికుమార్ వెంటనే ఓకే చేసారు. ఇక కన్నడ వెర్షన్ లో హీరోయిన్ గా లక్ష్మి రాయ్ చేస్తోంది. ఉపేంద్ర..లారెన్స్ చేసిన పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రం షూటింగ్ దాదాపు పూర్తి కావొచ్చింది. కన్నడంలోనూ మంచి క్రేజ్ తెచ్చుకుందీ చిత్రం.

  'ముని' చిత్రానికి సీక్వెల్‌గా రాఘవ లారెన్స్ దర్శకత్వంలో రూపొంది తెలుగు, తమిళ భాషల్లో విడుదలైన చిత్రం 'కాంచన'. రాఘవ లారెన్స్ హీరోగా నటించిన ఈ చిత్రాన్ని తమిళంలో దర్శకుడు రామనారాయణ నిర్మించారు. కాగా ఇదే పేరుతో ఈ చిత్రాన్ని బెల్లంకొండ సురేష్ తెలుగులో అందించారు. తెలుగులో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్ళు సాధించి ట్రేడ్ వర్గాలను విస్మయపరిచింది. రెండు భాషల్లోనూ 'కాంచన' భారీ విజయాన్ని సాధించడంతో ఈ చిత్రాన్ని కన్నడంలో రీమేక్ చేయాలని దర్శక నిర్మాత రామనారాయణ నిర్ణయించుకున్నారు.

  ఇప్పటికే రెండు భాషల్లోనూ విమర్శకులని మెప్పించిన ఈ చిత్రంలో 'కాంచన' పాత్రలో నటించడం కోసం కన్నడ హీరోలు పోటీపడ్డారు. కానీ ఆ పాత్రకు ఉపేంద్ర అయితేనే వంద శాతం న్యాయం జరుగుతుందని నిర్మాత రామనారాయణ భావించి కన్నడ 'కాంచన'కి ఉపేంద్రని ఎంపిక చేసుకున్నారు. మరో ప్రక్క 'కాంచన' ను 3D లోకి కన్వర్షన్ చేస్తున్నారు. ఈ కన్వర్షన్ కోసం ఐదు కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నట్లు సమాచారం.

  రజనీ కాంత్ శివాజీ కన్వర్షన్ కి 11 కోట్లు ఖర్చు పెడుతూంటే, కాంచన కూడా మంచి క్వాలిటీ ఇవ్వాలనే ఈ రేంజి ఖర్చు పెడుతున్నట్లు సమాచారం. ఈ విషయమై బెల్లంకొండ సురేష్ ని సంప్రదించగా.." డబ్బు విషయం అనేది ప్రక్కన పెడితే, కొన్ని సెలిక్టివ్ సినిమాలను మాత్రమే 3డి వెర్షన్ లో చూడగలుగుతాం, కాంచన అటువంటి సినిమానే,ఈ సినిమా పూర్తిగా పొటిన్షియల్ కలిగి ఉంది. 3డిలో ప్రేక్షకులు ధ్రిల్ అయ్యి పూర్తిగా ఎంజాయ్ చెయ్యగలుగుతారని చెప్పగలను.. ఒరిజనల్ బ్లాక్ బస్టర్ అయినా 3డిలో కన్వర్ట్ చేయటానికి కారణం అదే. డబ్బు అనేది ఇలాంటి ప్రయత్నాలకు ఎప్పుడూ సెకండరీనే," అన్నారు.

  క్రితం సంవత్సరం రాఘవ లారెన్స్ డైరక్ట్ చేసిన హిట్ సినిమా కాంచన. ఈ చిత్రం ఇప్పుడు బెల్లంకొండ సురేష్ ఈ విషయం మీడియాకు తెలియచేసారు. త్రిడీలోకి కన్వర్ట్ చేసి రీరిలీజ్ చేయాలనే ప్లాన్ చేస్తున్నట్లు చెప్తున్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ... మేము ఇప్పటికే ఈ కన్వర్షన్ ప్రాసెస్ ని ప్రారంభించాం. ఇక ఈ 3D వెర్షన్ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ గా లారెన్స్ పై ఓ పాటను చిత్రీకరించి కలుపుతున్నాం..ఈ సినిమా గ్యారెంటీగా అందరినీ అలరిస్తుందనే నమ్మకం ఉంది అన్నారు. శరత్‌కుమార్ ప్రధాన పాత్రలో రాఘవలాన్స్ దర్శకత్వంలో బెల్లంకొండ సురేష్ నిర్మించిన చిత్రం 'కాంచన'.

  English summary
  Raghava Lawrence’s super hit “Kanchana” is being remade now in both Hindi and in Kannada. Upendra will reprise the role of Lawrence and Lakshmi Rai will return to play her part again in this version too. The latest news emerging on this project is that the role of the transgender, powerfully played by Sarath Kumar, has gone to another powerful actor, Sai Kumar.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more