For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  నానిని లైట్ తీసుకొన్న సాయి పల్లవి.. నువ్వెంత.. నువ్వెంత గొడవ ఎఫెక్టేనా?

  By Rajababu
  |
  MCA : నానిని లైట్ తీసుకున్న సాయి పల్లవి కానీ ఇరగదీసింది !

  టాలీవుడ్‌లో నాని అంటే వివాదాలకు దూరం. వరుస సక్సెస్‌లతో దూసుకెళ్తున్న నాని గురించి ఇటీవల ఓ వివాదం వెలుగులోకి వచ్చింది. అది ఏమిటంటే ఫిదా చిత్రంతో ప్రేక్షకులను ఆకట్టుకొన్న సాయి పల్లవితో గొడవపడ్డారు అనే వార్తలు ఫిలింనగర్‌లో అప్పట్లో ఓ వార్త చక్కర్లు కొట్టాయి. అసలేం జరిగిందంటే ..

   నానితో సాయి పల్లవి గొడవ

  నానితో సాయి పల్లవి గొడవ

  ఎంసీఏ చిత్రంలో నాని, సాయి పల్లవి కలిసి నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ సందర్భంగా గొడవ పడ్డారు. షూటింగ్‌లో నువ్వెంత అంటే నువ్వెంత అని తిట్టుకొన్నారు. షూటింగ్ స్పాట్ నుంచి నాని వెళ్లిపోయారు అనే వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆ వార్త అనేక రూమర్లు దారి తీసింది.

   నానిని మరచిపోయిన సాయిపల్లవి

  నానిని మరచిపోయిన సాయిపల్లవి

  ఇలాంటి పరిస్థితిలో ఎంసీఏ ప్రీరిలీజ్ ఫంక్షన్ వరంగల్‌లో జరిగింది. వారి మధ్య గొడవ నెలకొందని వస్తున్న వార్త నేపథ్యంలో ఎంసీఏ ఫంక్షన్‌లో ఓ ఆసక్తికరమైన సంఘటన జరిగింది. ఈ సందర్భంగా అందరి పేర్లను గుర్తు చూస్తే మాట్లాడిన సాయి పల్లవి.. నాని గురించి చెప్పడం మరిచిపోయింది. అంతలోనే తప్పులో కాలేసానని తెలుసుకొన్న ఆమె నాని గురించి ఇలా చెప్పింది.

   నాని గురించి ఏం చెప్పాలి

  నాని గురించి ఏం చెప్పాలి

  ఫిదా చిత్రంలో కూడా వరుణ్ గురించి మాట్లాడటం మరిచిపోయాను. ఇప్పుడు కూడా నాని గురించి చెప్పడం మరిచిపోయాను. నాని గురించి ఏం చెప్పాలి. ఆయన చాలా హార్డ్ వర్కర్. ప్రతీ సీన్ ముందు దాని గురించి బాగా ఆలోచిస్తారు.

   నాని డైరెక్టర్ కావాలి

  నాని డైరెక్టర్ కావాలి

  ప్రతీ సీన్ ఎలా విభిన్నంగా చేయాలనే విషయంపై బాగా ప్రిపేర్ అవుతారు. నాని నుంచి చాలా నేర్చుకొన్నాను. ఆయనకు దర్శకత్వంపై బాగా పట్టు ఉన్నది. త్వరలోనే ఆయన దర్శకుడిగా మారితే చూడాలి అని సాయి పల్లవి అన్నారు.

  నాని ముసిముసి నవ్వులు

  నాని ముసిముసి నవ్వులు

  సాయిపల్లవి మాట్లాడుతూ ఉన్నంత సేపు నాని వెనుక నిల్చొని ముసిముసి నవ్వులు నవ్వుతూ కనిపించారు. నానిని పొగడ్తలతో ముంచెత్తుండగా ఆనందంతో మురిసిపోయాడు. వారిద్దరి మధ్య వేదికపై కెమిస్ట్రీ చూసిన తర్వాత గొడవలు లేవని తేలిపోయాయి.

   డీఎస్పీతో డ్యాన్స్

  డీఎస్పీతో డ్యాన్స్

  ఆ తర్వాత ఇట్స్ ఏ ఫ్యామిలీ పార్టీకి దేవీ శ్రీ ప్రసాద్.. నాని, సాయిపల్లవి వేదికపై లైవ్ ప్రదర్శన ఇచ్చారు. నాని, దేవీశ్రీతో కలిసి చేసిన డ్యాన్స్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది.

   వేణుకు పెద్ద సక్సెస్

  వేణుకు పెద్ద సక్సెస్

  ఇంకా ఎంసీఏ ఫంక్షన్‌లో సాయి పల్లవి మాట్లాడుతూ.. మా కోసం ఇక్కడికి వచ్చిన అందరికీ ధన్యవాదాలు. దర్శకుడు వేణు శ్రీరాం చాలా కష్టపడి ఓ మంచి సినిమా తీశారు. వేణుగారికి మరో పెద్ద సక్సెస్ లభిస్తుంది అని కొనుకొంటున్నాను.

  భూమిక ఓ మంచి నటి

  భూమిక ఓ మంచి నటి

  భూమిక గారు ఈ ఫంక్షన్ రాలేదు. ఆమె గురించి ప్రత్యేకంగా చెప్పాలి. తన వద్ద నుంచి చాలా విషయాలు నేర్చుకొన్నాను. భూమిక ఓ మంచి నటి. ఆమె ఎన్నో మంచి సినిమాలు చేయాలి అని భూమికకు రిక్వెస్ట్ చేస్తున్నాను.

   దేవీ శ్రీ ప్రసాద్ గురించి

  దేవీ శ్రీ ప్రసాద్ గురించి

  ఎంసీఏ చిత్రానికి దర్శకత్వం వహించిన దేవీ శ్రీ ప్రసాద్ మంచి పాటలు ఇచ్చారు. ఆయన అందించిన పాటలు హృదయానికి హత్తుకున్నాయి. సమీర్ రెడ్డి గారు అద్భుతంగా మమల్ని చూపించారు. అందుకు ఆయనకు థ్యాంక్స్.

   దిల్‌రాజు బాగా చూసుకొన్నారు..

  దిల్‌రాజు బాగా చూసుకొన్నారు..

  దిల్ రాజు వరుసగా రెండో చిత్రం ఎంసీఏలో నటిస్తున్నాను. షూటింగ్ సమయంలో రాజుగారు, శిరీష్, లక్ష్మణ్ మమ్మల్ని బాగా చూసుకొన్నారు. అందుకు చాలా థ్యాంక్స్.

  English summary
  Natural Star Nani starrer latest romantic and family entertainer movie ‘MCA’ (Middle Class Abbayi). Film is gearing up for grand release on 21st December. The film directed by Venu Sriram has already created lot of buzz. The film has Sai Pallavi as the female lead and this will be her second film in Tollywood after Sekhar Kammula’s Fidaa. Sai Pallavi speaks about nani at pre release function.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more