»   » ఆ డైరెక్టర్ నన్ను యాక్ట్ చేయనివ్వలేదు.. ఎందుకో నాకు అర్థమైంది.. సాయిపల్లవి

ఆ డైరెక్టర్ నన్ను యాక్ట్ చేయనివ్వలేదు.. ఎందుకో నాకు అర్థమైంది.. సాయిపల్లవి

Posted By:
Subscribe to Filmibeat Telugu

'ఛలో'తో సూపర్‌హిట్‌ కొట్టిన నాగశౌర్య, 'ఫిదా', 'ఎంసిఎ' వంటి సూపర్‌హిట్స్‌ ఇచ్చిన సాయిపల్లవి కలిసి ఎన్‌.వి.ఆర్‌. సినిమా సమర్పణలో లైౖకా ప్రొడక్షన్స్‌ పతాకంపై విజయ్‌ దర్శకత్వంలో నిర్మిస్తున్న 'కణం' చిత్రంలో జంటగా నటిస్తున్నారు. షూటింగ్‌ పూర్తయిన 'కణం' చిత్రం ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌ మార్చి 5న హైదరాబాద్‌లో జరగనుంది. ఈ ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌లో సినిమా విడుదల తేదీని ప్రకటిస్తామని ఎన్‌విఆర్‌ సినిమా అధినేత చెప్పారు.

 కణం భావోద్వేగమైన కథ..

కణం భావోద్వేగమైన కథ..

ఈ సందర్భంగా సాయిపల్లవి మాట్లాడుతూ ''ఫిదా', 'ఎంసిఎ' చిత్రాల్ని అపూర్వంగా ఆదరించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు. 'కణం' చిత్రం తల్లి, కూతురికి మధ్య ఉండే భావోద్వేగాల ఆధారంగా ఉంటుంది. నేను ఏదైనా సినిమా చేస్తున్నప్పుడు అందులో నా పాత్రకి ఎలా న్యాయం చేయగలను అనేది చూసుకుంటాను.

సాయి పల్లవి అందగత్తెనా ? అయితే దూకి చచ్చిపోతా..!
 చేయగలనా అనే డౌట్

చేయగలనా అనే డౌట్

దర్శకుడు విజయ్‌ ఈ కథ చెప్పి, ఇందులో నేను తల్లి పాత్ర చేయాలి అని అడిగినప్పుడు ఈ పాత్రలోని ఎమోషన్స్‌ని పండించగలనా అనుకున్నాను. ఎందుకంటే ఇలాంటి పాత్ర ఇది వరకు నేను చేయలేదు. విజయ్‌ గారు, నేను సినిమా గురించి చాలా చర్చించుకున్నాం అని సాయి పల్లవి తెలిపారు.

కూతురితో చాలా సమయం

కూతురితో చాలా సమయం

కణం చిత్రంలో నా కూతురిగా కనిపించే వెరోనికాతో చాలా సమయం గడిపాను. తాను నేను నిజంగానే తల్లీకూతుళ్ల లాగ కలిసిపోయాం. అందువల్ల సినిమాలో కనిపించే ఎమోషన్స్‌ అన్ని చాలా సహజంగా ఉంటాయి. దర్శకుడు విజయ్‌ ఎంతో సహకారం అందించారు అని సాయి పల్లవి చెప్పారు.

 దర్శకుడు విజయ్ అలా అనేవారు

దర్శకుడు విజయ్ అలా అనేవారు

తనకి ఏమి కావాలో స్పష్టంగా తెలిసిన దర్శకుడు ఉన్నప్పుడు మన పని సులువు అయిపోతుంది. విజయ్‌కి ఏ సీన్‌కి ఎలాంటి ఎమోషన్‌ ఉంటే బావుంటుందో బాగా తెలుసు. తల్లి-కూతురి మధ్య సన్నివేశాలు కొంచెం లౌడ్‌గా ఉంటే బాగా పండుతాయి అని అనుకునేదాన్ని. కానీ విజయ్‌గారు సహజంగా ఉండాలనేవారు అని ఆమె పేర్కొన్నారు.

దర్శకుడిపై అలా కామెంట్

దర్శకుడిపై అలా కామెంట్

నన్ను నాలా చేయనివ్వడం లేదు. నన్ను మీరు యాక్ట్‌ చేయనివ్వట్లేదు అని విజయ్‌తో కూడా అనేదాన్ని. కానీ డబ్బింగ్‌ సమయంలో సినిమా చూస్తున్నప్పుడు అర్థమైంది ఆయన ఎందుకలా అనేవారో. నటిగా ఈ సినిమా నాకు చాలా ప్రత్యేకమైంది. పాత్రని ఎంతో ఇష్టపడి చేసాను.'' అన్నారు.

నటీనటులు, సాంకేతిక నిపుణులు

నటీనటులు, సాంకేతిక నిపుణులు

ఈ చిత్రానికి నిరవ్‌షా, శ్యామ్‌ సి.ఎస్‌., ఎల్‌.జయశ్రీ, స్టంట్‌ సిల్వ, ఆంటోని, విజయ్‌, సత్య, పట్టణం రషీద్‌, ఎం.ఆర్‌.రాజకృష్ణన్‌, కె.మణివర్మ, రామసుబ్బు, సప్న షా, వినయదేవ్‌, మోడేపల్లి రమణ, కె.భార్గవి, ప్రత్యూష, ఎస్‌.ఎం.రాజ్‌కుమార్‌, ఎస్‌.శివశరవణన్‌, షియామ్‌ పనిచేస్తున్న సాంకేతికవర్గం. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: ఎస్‌.ప్రేమ్‌, సమర్పణ: ఎన్‌.వి.ఆర్‌. సినిమా, నిర్మాణం: లైకా ప్రొడక్షన్స్‌, దర్శకత్వం: విజయ్‌.

English summary
Leading south heroine, Sai Pallavi shared that her upcoming horror drama, ‘Kanam’ will be an emotional drama. The movie will provide an amazing experience for moviegoers, added the actress while speaking at the release of its audio album recently. Sai Pallavi plays the role of mother of four-year-old girl in the movie, which has Tollywood star, Naga Shaurya essaying the male lead.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu