For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  పవన్ కల్యాణ్ క్రేజ్ చూసి షాక్.. నా బ్లడ్‌లో సూర్య ఉన్నాడు.. సాయి పల్లవి.

  By Rajababu
  |

  టాలీవుడ్‌లో ఫిదా చిత్రం కలెక్షన్ల ప్రకంపనలు సృష్టిస్తున్నది. ఫిదాలో నటించిన ప్రతీ ఒక్కరిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. సినిమాను చూసిన ప్రతీ ఒక్కరూ భానుమతి పాత్రలో నటించిన సాయి పల్లవిని ప్రత్యేకంగా అభినందిస్తున్నారు. ఫిదా చిత్రం విజయంలో సాయి పల్లవి కీలకంగా మారింది. తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు కూడా ఈ చిత్రాన్ని ప్రశంసించారు. మహిళా సాధికారితకు భానుమతి చిహ్నంగా నిలిచింది. ఈ నేపథ్యంలో 'ఫిదా భానుమతి సాయి పల్లవి ఫిల్మీబీట్‌తో ప్రత్యేకంగా మాట్లాడింది. ఫిదా గురించి, చిత్ర విజయం గురించి సాయి పల్లవి వెల్లడించిన స్పందన ఆమె మాటల్లోనే..

  ఆ మాటలకు అర్థం తెలియదు..

  ఆ మాటలకు అర్థం తెలియదు..

  బాడకావో.. బద్మాష్.. బొక్కలిరుగ కొడుతా అనే డైలాగ్స్ అర్థం ముందు నాకు తెలియదు. ఆ తర్వాత తెలిసింది. సెన్సార్ వల్ల ఇబ్బందులు వస్తాయనే కారణంతో ముందు మార్చాలనుకొన్నారు. శేఖర్ కమ్ముల అలాగే ఉండాలని పట్టుబట్టారు. సెన్సార్ వల్ల ఇబ్బందులు రాకుండా చూసుకొంటాను. ఒకవేళ వారు అభ్యంతరం చెపితే మార్చుదాం అని చెప్పారు. అయితే సెన్సార్ వాళ్లకు కూడా సమస్య లేకపోవడంతో చాలా ఆనందం కలిగింది. ఎందుకంటే నేను చెప్పిన ఫస్ట్ డైలాగ్‌కు ప్రాబ్లం వస్తుందోననే ఆందోళన కలిగింది.

  Mega Hero Varun Tej About Sai Pallavi
  డబ్బింగ్ చెప్పడంలో మజా

  డబ్బింగ్ చెప్పడంలో మజా

  డబ్బింగ్ చెప్పడంలో మజా అనిపించింది. షూటింగ్‌లో చెప్పిన డైలాగ్స్‌కు డబ్బింగ్‌లో లిప్ సింక్ అవుతుందా అనే భయం ఉండేది. అందుకోసం చాలా కష్టపడ్డాను. డైలాగ్స్‌ను బాగా ప్రాక్టీస్ చేశాను. తెరమీద సొంత గొంతుతో డైలాగ్స్ వింటూ ఉంటే మంచి ఫీల్ కలుగుతుంది.

  ట్రాక్టర్ నడపడం కష్టం కాలేదు..

  ట్రాక్టర్ నడపడం కష్టం కాలేదు..

  ట్రాక్టర్ నడపడాన్ని ప్రత్యేకంగా నేర్చుకోలేదు. డ్రైవింగ్ ముందే వచ్చు కాబట్టి ఇబ్బంది కాలేదు. కానీ ట్రాక్టర్ నడపడం చాలా కష్టమే. మిగితా వాళ్లు ఎంత కష్టపడుతారో నాకు అప్పుడు అర్థమైంది. ఈ చిత్రం నాకు చాలా నేర్పించింది. ఫిదా నాకు ఓ గొప్ప అనుభవంగా మారింది.

  నా బ్లడ్‌లో సూర్య ఉన్నాడు..

  నా బ్లడ్‌లో సూర్య ఉన్నాడు..

  ఫిదా చిత్రంలో ఓ సన్నివేశంలో వరుణ్ తేజ్‌తో మాట్లాడుతూ.. బ్లడ్‌లో పవన్ కల్యాణ్, మహేశ్‌బాబు ఉంటే ఆ కిక్కు వేరుగా ఉంటుంది అని అంటుంది. అదే విషయాన్ని ప్రస్తావించగా నా బ్లడ్‌లో సూర్య ఉన్నాడు. తమిళంలో కాకా కాకా చిత్రం చూసిన తర్వాత సూర్య అభిమానిగా మారిపోయాను. సూర్య అంటే నాకు చాలా ఇష్టం. ఆయనతో నటించే అవకాశం ఉంటే నేను నటిస్తాను.

  ఫిదా రీమేక్ చేస్తే నటిస్తాను.

  ఫిదా రీమేక్ చేస్తే నటిస్తాను.

  ఫిదా రీమేక్ గురించి చర్చ జరుగుతుంది. కానీ నా వరకు ఆ ప్రస్తావనను ఎవరూ తీసుకురాలేదు. నా వార్త నా చెవిన పడింది. అయితే ఇంకా క్లారిటీ లేదు. నేను రీమేక్స్ వ్యతిరేకం కాదు. ఫిదా రీమేక్‌లో నటించే ఆఫర్ వస్తే తప్పకుండా నటిస్తాను. ప్రేమమ్ తర్వాత అంత మ్యాజిక్ వస్తుందనే ఊహించలేదు.

  చాలా సింపుల్‌గా ఉంటాను.

  చాలా సింపుల్‌గా ఉంటాను.

  ఫిదాలో దూకుడుతనం ఉన్న అమ్మాయిగా కనిపించాను. కానీ నిజజీవితంలో నేను అలాంటి దానిని కాదు. చాలా కామ్‌గా ఉంటాను. కుటుంబ సభ్యులతో బాగా మాట్లాడుతాను. బూతులు మాట్లాడటం రాదు. నాకు సింపుల్‌గా ఉండటం ఇష్టం. మేకప్ చేస్తే నేను మరో రకంగా కనిపిస్తాను. ప్రేమమ్‌ చిత్రం తర్వాత మొటిమలు ఉన్న అమ్మాయిల్లో కూడా కాన్ఫిడెన్స్ పెరిగింది. ఆ విషయం నాకు చాలా ఆనందం కలిగించింది.

  నాకు లభించిన గొప్ప ప్రశంస ఇదే.

  నాకు లభించిన గొప్ప ప్రశంస ఇదే.

  ఫిదా ముందు తెలంగాణ యాస మాట్లాడాలంటే భయమేసేది. ఈ సినిమా చూసిన తర్వాత నా పిల్లలను తెలంగాణ యాసలో మాట్లాడాలని నా కూతుళ్లకు చెప్పాను అని ఓ వ్యక్తి చెప్పడం సంతోషం కలిగించింది. ప్రేక్షకుల మీద నా పాత్ర అంత ప్రభావం చూపించినందుకు చాలా ఆనందంగా ఉంది. నటికి ఇంతకంటే ఏమి కావాలి. ఫిదా తర్వాత నేను అందుకొన్న మంచి ప్రశంసల్లో ఇది ఒకటి.

  పవన్ క్రేజ్ చూసి షాక్ తిన్నా..

  పవన్ క్రేజ్ చూసి షాక్ తిన్నా..

  థియేటర్లలో పవన్ కల్యాణ్ కనిపించినప్పుడు వచ్చి రెస్సాన్స్ చూసి కంగు తిన్నాను. ఓ దశలో నా డైలాగ్స్‌కు చప్పట్లు కొడుతున్నారా లేదా పవన్ చూసి క్లాప్స్ కొడుతున్నారా అర్థం కాలేదు. ఆ చప్పట్లతో నా డైలాగ్స్ మిస్ అవుతాయోమోనని భయపడ్డా. కానీ ప్రేక్షకులు బాగానే రిసీవ్ చేసుకొన్నారని అర్థమైంది. అప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఆడియో ఫంక్షన్‌లో పవన్ పేరు చెపితే.. హాలంతా చప్పట్లతో మారిమోగిపోయింది. ఆయనకు ఉన్న క్రేజ్ చూసి షాక్ తిన్నాను.

  English summary
  Actor Sai Pallavi get emotional on success of Fidaa. Fidaa running with collections in worldwide. After big success, She speak to Filmibeat Telugu specially. Sai Pallavi said that I was shocked looking at Pawan Kalyans craze.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X