»   » తెలుగు తెరకు కొత్త సౌందర్యం.. రకుల్, లావణ్య, పూజాలకు సాయి పల్లవి చెక్..

తెలుగు తెరకు కొత్త సౌందర్యం.. రకుల్, లావణ్య, పూజాలకు సాయి పల్లవి చెక్..

Posted By:
Subscribe to Filmibeat Telugu

భాషాభేదం లేకుండా ప్రేమమ్ సినిమాతో సాయి పల్లవి వెండితెర మీదకు ఒక్కసారిగా దూసుకొచ్చారు. ముఖం మీద మొటిమలు.. చెదరని చిరునవ్వు.. పక్కింటి అమ్మాయిలా చూడగానే ఆకట్టుకొనే రూపం లాంటి అంశాలు సాయి పల్లవికి కలిసి వచ్చాయి. ఫిదా రాకముందే ప్రేమమ్ చిత్రంతోనే పాయి పల్లవి ఆకట్టుకొన్నది. తెలుగులో చాలా అవకాశాలే వచ్చినా ఎదురుపడి ఒప్పేసుకోకుండా తగిన పాత్ర కోసం వేచి చూసింది. దాని ఫలితమే ఫిదాలో ఆమె భానుమతి పాత్ర.

ఫిదాతో సాయి పల్లవి అలజడి..

ఫిదాతో సాయి పల్లవి అలజడి..

ఫిదాలో భానుమతి పాత్రతో యువత గుండెల్లో సాయి పల్లవి చేసిన అలజడి ప్రభావం ఇప్పడేం చెప్పలేం. కానీ దాని ప్రభావం భారీ రేంజ్‌లోనే ఉండే అవకాశం ఉంది. ఫిదా రెండో ఆట టికెట్ తెగకముందే భానుమతి వెంట నిర్మాతలు పడటానికి పరుగులు పట్టడంలో ఆశ్చర్యం లేకపోలేదు. ఫిదా చిత్రం చూసిన తర్వాత పుష్కలంగా ప్రతిభ ఉన్న సాయి పల్లవి టాలెంట్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల చేతిలో పడటం ద్వారా నటనపరంగా రాటుదేలిందనే మాట వినిస్తున్నది.

తెలుగు సినిమాకు కొత్త నక్షత్రం

తెలుగు సినిమాకు కొత్త నక్షత్రం

ఎన్నాళ్ల నుంచి సావిత్రి, జయసుధ, సుహాసిని, సౌందర్య లాంటి హీరోయిన్ల కోసం టాలీవుడ్ ఎదురుచూస్తున్నది. కొందరు వచ్చిన ఆకాశంలో నక్షత్రంలా మెరిసి కనుమరుగయ్యారు. ఇప్పుడిప్పుడే నివేదా థామస్ రెండు సినిమాలతో ప్రేక్షకులను కట్టిపడేసుకున్నారు. మూడో సినిమా జై లవకుశతో సుస్థిర స్థానం సంపాదించుకొన్నేందుకు ప్రయత్నిస్తున్నారు.

నివేదా వర్సెస్ సాయి పల్లవి

నివేదా వర్సెస్ సాయి పల్లవి

నివేదా థామస్‌పై అందరూ మనసు పడేందుకు ప్రయత్నిస్తుండగానే సాయి పల్లవి అనూహ్యంగా దూసుకొచ్చింది. నివేదా థామస్ నటనపరంగా ఓకే. కానీ అందం విషయంలోనే కొంచెం అనుమానాలున్నాయి. ఈ నేపథ్యంలో ఆమెకు సాయి పల్లవి గట్టిపోటీగా మారే అవకాశం కనిపిస్తున్నది.

రకుల్, లావణ్య, పూజాలకు చెక్

రకుల్, లావణ్య, పూజాలకు చెక్

ప్రస్తుతం టాలీవుడ్‌లో రకుల్, లావణ్య త్రిపాఠి, పూజా హెగ్డే అగ్రహీరోలతో జతకడుతున్నారు. రకుల్ ఇప్పటికే పలువురు టాప్ హీరోలతో కలిసి నటించడమే కాకుండా హిట్లను కూడా ఖాతాలో చేర్చుకొన్నది. లావణ్య త్రిపాఠికి భలే భలే మొగాడివోయ్, సోగ్గాడే చిన్నినాయన చిత్రాలతో సక్సెస్ చేజిక్కించుకొన్నది. తాజాగా డీజే చిత్రంలో అందాల ఆరబోతతో పూజా హెగ్డే పర్వాలేదనిపించుకొన్నది.

సాయి పల్లవి జోరు కొనసాగేనా..

సాయి పల్లవి జోరు కొనసాగేనా..

రకుల్, లావణ్య, పూజాలకు ప్రస్తుతం చేతిలో సరిపడే సినిమాలు ఉన్నాయి. తమ కెరీర్ ఫర్వాలేదనే భరోసాలుండగానే ఇద్దరు మలయాళ ముద్దుగుమ్మలు ఊహించని విధంగా ఎంట్రీ ఇచ్చారు. నివేదా థామస్, సాయి పల్లవి జోరు చూస్తుంటే ఇక వారు జాగ్రత్త పడాల్సిందే అనే మాట ఫిలింనగర్‌లో వినిపిస్తున్నది.

English summary
Actor Sai Pallavi is the new star for Tollwood. Present situation Sai Pallavi becomes hot figure in south industry. With Fidaa she got tremoundous success. Now Sai pallavi will becomes toughest for Rakul Preet Singh, Lavanya Tripathi, Pooja Hegde.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu