»   » బద్మాష్ బలిసిందారా.. హైబ్రిడ్ పిల్ల మళ్ళీ!

బద్మాష్ బలిసిందారా.. హైబ్రిడ్ పిల్ల మళ్ళీ!

Subscribe to Filmibeat Telugu

బద్మాష్.. బలిసిందారా.. ఈ భయంకరమైన తిట్లు కూడా సాయి పల్లవి నోటి నుంచి వస్తే ముద్దు ముద్దుగా మారిపోతాయి కదూ. ఫిదా చిత్రంలో సాయిపల్లవి తెలంగాణ యాసలో చెలరేగి నటించింది. సాయి పల్లవి తెలంగాణ యువతి కాకపోయినా ఆ ఛాయలేవీ సినిమాలో కనిపించలేదు. ఫిదా చిత్రంలో హైలైట్ అయిన అంశం సాయి పలలవి తెలంగాణ స్లాంగ్ లో పలికిన డైలాగులే. ప్రేమమ్ చిత్రంతో సౌత్ లో పాపులర్ అయిన సాయి పల్లవి.. ఫిదా చిత్రంతో తెలుగు యువతని ఒక ఊపు ఊపింది.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం సాయి పల్లవి మరో మారు తెలంగాణ పిల్లగా అలరించడానికి సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. నీదీ నాదీ ఒకే కథ చిత్రం ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ చిత్రానికి వేణు ఊడుగుల దర్శకుడు. వేణు సాయి పల్లవితో ఓ చిత్రాన్ని చేయడానికి సిద్ధం అవుతున్నాడని అందులో సాయి పల్లవి తెలంగాణ అమ్మాయిగా నటించబోతోందని అంటున్నారు. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Sai Pallavi to play Telangana Girl again.
English summary
Sai Pallavi to play Telangana Girl again. Venu Vudugula will direct this movie
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X