»   » సాయి పల్లవి...పెళ్లి మీద చెప్పిన అభిప్రాయానికి అందరూ ఆశ్చర్యపోతున్నారు

సాయి పల్లవి...పెళ్లి మీద చెప్పిన అభిప్రాయానికి అందరూ ఆశ్చర్యపోతున్నారు

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  హైదరాబాద్ :పెళ్లి చేసుకోవడం వల్ల కలిగే అదనపు ప్రయోజనం ఏమి లేదని అందుకే నేను పెళ్లి చేసుకోవడం లేదని సంచలన ప్రకటన చేసింది మెగా హీరో వరుణ్ తేజ్ సరసన ఫిదా చిత్రంలో నటిస్తున్న సాయి పల్లవి .

  గతంలో నటి శ్రుతిహాసన్ పెళ్లి చేసుకోకుండానే పిల్లల్ని కంటాను అని ప్రకటించి ఒక్కసారిగా మీడియా అంతటినీ తన వైపుకు తిప్పుకుంది. ఇప్పుడు సాయిపల్లవి తాను పెళ్లే చేసుకోనంటూ వార్తల్లోకెక్కింది.

  సాయి పల్లవి.. ఒక్క సినిమాతో పాపులరైపోయిన హీరోయిన్. మలయాళం "ప్రేమమ్" సినిమాలో మలర్ అనే క్యారక్టర్ చేసి క్రేజీ హీరోయిన్ గా మారింది సాయి పల్లవి. ఈ సినిమాతో యువత హృదయాల్ని కొల్లగొట్టేసింది. ఈ సినిమా తర్వాత సాయికి చాలా ఆఫర్లు అందాయి. మణిరత్నం లాంటి దర్శకుడు కూడా ఆమెను సంప్రదించాడు. అయితే స్క్రిప్ట్ పరంగా తనకు ఏవో అభ్యంతరాలు వుండడంతో దానికి నో చెప్పింది సాయి.

  ఇక ఈ మళయాళ భామ రోజుకో వార్తలో మీడియాకు ఎక్కుతున్నారు. రీసెంట్ గా దర్శకులను ఇబ్బంది పెడుతోందని, రకరకాల కండీషన్స్ నిర్మాతలు పెడుతోందని వార్తలు వచ్చాయి. అలాగే గ్లామర్ రోల్స్ చేయనంటూ ఆమె చెప్పిందని వినపడింది. ఈ విషయాలపై సాయి పల్లవి రీసెంట్ గా ట్విట్టర్ చాట్ లో స్పందించింది. ఆమె ఏమంది..ఏమిటి అనేది క్రింద చూద్దాం.

  ఈ రూమర్ ఎలా పుట్టించారు

  ఈ రూమర్ ఎలా పుట్టించారు

  ఓ తమిళ సినిమాలో హాట్ సీన్ చేసేందుకు అమ్మడును సంప్రదించారని కానీ అందుకు ఆమె నో చెప్పిందని వార్తలొచ్చాయి. ఇవన్నీ వదంతులేనని పల్లవి కొట్టిపారేసింది. అసలు తనకు ఎలాంటి కోలీవుడ్ ఆఫర్ రాలేదని క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతానికి హ్యాపీడేస్ దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా చేస్తున్న ఫిదా మూవీలో హీరోయిన్‌గా నటిస్తున్నానని చెప్పింది

  రెమ్యునేషన్ కాదు

  రెమ్యునేషన్ కాదు

  సాయి పల్లవి మాట్లాడుతూ.. రెమ్యునరేషన్ అధికంగా ఇస్తామన్నా తనకు నచ్చిన రోల్సే చేస్తానని తేల్చి చెప్పేసింది. తన మనస్సుకు నచ్చని పాత్రలో తాను చెయ్యలేనని, అలాంటి పాత్రకు ప్రాణం పోయలేనని చెప్పింది.

  అయినా పట్టించుకోను

  అయినా పట్టించుకోను

  'నేను తమిళ ఇండస్ట్రీలో కనీసం వర్క్ చేయడం కూడా స్టార్ట్ చేయలేదు. అలాంటప్పుడు నా పై కంప్లెయింట్ చేసే ఛాన్స్ ఉండదు. ఇలాంటి ఫన్నీ రూమర్స్ ఎలా వస్తాయో కదా.. అయినా ఇలాంటి వాటిని నేను పట్టించుకోను. అసలు విషయం ఏంటంటే.. ఇప్పటివరకూ ఇలా డబుల్ మీనింగ్ డైలాగ్స్ చెప్పమని నన్ను ఎవరూ అడగలేదు. పైగా వేసుకునేందుకు నేను ఇబ్బందిపడే డ్రస్సులపై ఒత్తిడి కూడా చేయలేదు' అంటూ తేల్చేసింది సాయి పల్లవి.

  ఇవన్నీ నా ఇష్టాలు

  ఇవన్నీ నా ఇష్టాలు

  తమిళంలో మీకు నచ్చిన చిత్రం గురించి చెప్తూ... సూర్య నటించిన కాక్క కాక్క అని, నచ్చిన పాట... రెమో నీ కాదలన్ పాట అంటే చాలా ఇష్టం అని చెప్పుకొచ్చింది. ఆమె ఆహారపు అలవాట్లు గురించి చెప్తూ... మీకు చికెన్ బిరియానీ ఇష్టమా?మటన్ బిరియానీ ఇష్టమా? అంటే తాను కేవలం శాఖాహారిని అని తేల్చేసింది.

  ఎరేంజెడ్ మ్యారేజా లేక ...

  ఎరేంజెడ్ మ్యారేజా లేక ...

  ప్రేమ వివాహం చేసుకుంటారా? లేక పెద్దలు నిశ్చియించిన పెళ్లి చేసుకుంటారా? అని అడిగితే ... నేను అసలు పెళ్లే చేసుకోను అని చెప్పింది. కారణం చెప్తూ...జీవితాంతం నా తల్లిదండ్రులతోనే ఉంటూ వారిని కంటికి రెప్పలా చూసుకోవాలి అని వివరించింది.

  స్టార్ హీరోని కాదనుకుంది

  స్టార్ హీరోని కాదనుకుంది

  కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ సినిమాలో ఈ మలయాళీ ముద్దుగుమ్మను నటించాల్సిందిగా అడిగారు. అయితే.. ఈమె మొత్తం స్టోరీ అంతా విన్నాక తన పాత్రకు ప్రాధాన్యం లేదు కాబట్టి.. చేయనని తేల్చేసింది. అజిత్ లాంటి హీరో సరసన ఛాన్స్ వస్తే.. కెరీర్ స్టార్టింగ్ రేంజ్ లో ఉన్న హీరోయిన్ వద్దనడం షాకింగ్ గా మారింది.

  మణి సార్ కు కూడా నో

  మణి సార్ కు కూడా నో

  గతంలో కూడా ఇలాగే మణిరత్నం దర్శకత్వంలో కార్తి సినిమాని కూడా కాదనుకుంది సాయి పల్లవి. మణిరత్నం మూవీలో రొమాంటిక్ సీన్స్ ఎక్కువగా ఉన్నాయని అందుకే ఈ ఛాన్స్ ను వద్దను చెప్పిందనే టాక్ వినిపిస్తున్నా.. దీనికి అసలు కారణం ఓసారి తనే చెప్పింది సాయి పల్లవి.

  అందుకే మణిసార్ కి నో చెప్పా

  అందుకే మణిసార్ కి నో చెప్పా

  డాక్టర్ కోర్స్ చదువుతున్న తనకు కాలేజ్ ఎగ్జామ్స్ ఉన్నాయని.. అందుకే మణిరత్నం సినిమా చేయలేకపోతున్నానని సాయి పల్లవి చెప్పింది. అప్పుడు రీజన్ సరిగానే ఉన్నా.. ఇప్పుడు మాత్రం అజిత్ సినిమాకు నో చెప్పడంతో ఇండస్ట్రీ జనాలు ఆశ్చర్యపోతున్నారు. ఇలా అయితే కెరీర్ పట్టాలెక్కేదెలా అనుకుంటున్నారు.

  ప్రస్తుతం ఫిదా

  ప్రస్తుతం ఫిదా

  మలయాళం చిత్రం ప్రేమమ్‌తో ఒక్కసారిగా ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్ గా మారిన ఈ కేరళా కుట్టి అంతకు ముందు కంగనారనౌత్ నటించిన హిందీ చిత్రం ధామ్ ధూమ్‌లో చిన్న పాత్రలో మెరిశారన్నది గమనార్హం. ప్రస్తుతం తెలుగులో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వరుణ్ తేజ్‌కు జంటగా ఫిదా అనే చిత్రంలో నటిస్తున్నారు.

  వృత్తి రీత్యా

  వృత్తి రీత్యా

  సాయి పల్లవిని ఎక్కడికి వెళ్లినా మలార్ మిస్ అని పిలుస్తున్నారట మళయాళి ఆడియన్స్. సాయి పల్లవి వయస్సు ఇప్పుడు 25 ఏళ్లు మాత్రమే, మే 9, 1992లో జన్మించింది. ప్రేమమ్ లో ఆమె పాత్రకు జీవితానికి సరపడ పేరు వచ్చిందంటోంది సాయి పల్లవి నిజ జీవిత ఫ్రొఫెషన్ దృష్యా ఓ డాక్టర్.

  మంచి డాన్సర్

  మంచి డాన్సర్

  ఆమె తన డాక్టర్ కోర్స్ ని జార్జియాలో పూర్తి చేసింది. అంతేనా సాయి పల్లవి బ్రిలియంట్ డాన్సర్. ఆమె స్టెప్స్ మీరు ప్రేమమ్ లో చూడవచ్చు. రియాల్టి షోలో తొలి సినిమా చేయకముందు ఆమె చాలా రియాల్టి షోలలో పాల్గొందియ

  మొదట వద్దన్నపాత్రనే

  మొదట వద్దన్నపాత్రనే

  ప్రేమమ్ చిత్రం కు ముందు ఆమె జయం రవి హీరోగా వచ్చిన ధూమ్ ధామ్ చిత్రంలో ఓ చిన్న పాత్ర చేసింది. మొదట తన లుక్స్ మళయాళి సినిమాకు సెట్ అవ్వవని ప్రేమమ్ కు నో చెప్పిందిట దర్శకుడే కానీ దర్సకుడు పాత్ర తమిళ టీచర్ అని చెప్పి కన్వీన్స్ చేసి ఒప్పించాడు

  English summary
  Sai Pallavi, the actress-dancer made a mark in the industry with her roles in Premam and Kali. During a recent chat session in Twitter, Sai Pallavi shared her take on marriage with her fans. The actress revealed that she has decided to not get married, to the much shock of her fans. Sai Pallavi says that she wants to be with her parents and take good care of them.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more