»   » ఎన్ని అబద్ధాలాడినా తప్పు లేదంటారు

ఎన్ని అబద్ధాలాడినా తప్పు లేదంటారు

Posted By:
Subscribe to Filmibeat Telugu
హైదరాబాద్ : సాయిరామ్‌ శంకర్‌ హీరోగా నటించిన చిత్రం 'వెయ్యి అబద్ధాలు'. ఎస్తేర్‌ నాయిక. తేజ దర్శకుడు. పాలడుగు సునీత నిర్మాత. రమణ గోగుల స్వరాలు సమకూర్చారు. ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. ఇదే వారంలో పాటల్ని విడుదల చేయబోతున్నారు.

సాయిరామ్ శంకర్ మాట్లాడుతూ... మంచి పని కోసం ఎన్ని అబద్ధాలాడినా తప్పు లేదంటారు. ఓ జంట మాత్రం ఏకంగా వెయ్యి అబద్ధాలు ఆడేసింది. ఇంతకీ వాళ్లు తలపెట్టిన పనేమిటి? అసలు ఎవరా జంట? అబద్ధాలు చెప్పాక... వారి జీవితంలో ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వచ్చింది? తదితర విషయాల్ని మా చిత్రంలో చూడొచ్చంటున్నారు

తేజ మాట్లాడుతూ-''పెళ్లంటే నూరేళ్ల పంట. ఈ మూడు ముళ్ల బంధం వెయ్యేళ్లు సాఫీగా సాగాలన్న ఉద్ధేశంతోనే వెయ్యి అబద్ధాలు చెప్పి పెళ్లి చేయమన్నారుపెద్దలు. ఈ విషయాన్ని ఒకరు గట్టిగా పట్టుకున్నారు. ఆ పనిలో ఉండాలని నిర్ణయించుకున్నారు. ఇంతకీ ఆ నిర్ణయ కర్త ఎవరు? మా హీరోనా? హీరోయిన్ ? అసలు ఎందుకు అంతటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది? అనేది సస్పెన్స్‌.

దర్శకుడు మాట్లాడుతూ ''వినోదాత్మకమైన ప్రేమకథ ఇది. యువతతో పాటు కుటుంబ ప్రేక్షకుల్నీ ఈ చిత్రం ఆకట్టుకుంటుంది. రమణ గోగుల అందించిన స్వరాలు అందరికీ నచ్చుతాయి. ఒక అబద్ధం చెప్పాక... దాన్ని కప్పిపుచ్చుకోవడానికి మరెన్నో అబద్ధాలు ఆడాల్సి వస్తుంది. మరి వెయ్యి అబద్ధాలు ఆడాక ఓ జంటకి ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయన్నది ఆసక్తికరం. కథ, కథనాలు వైవిధ్యంగా సాగుతాయి''అన్నారు.

రాజేంద్రప్రసాద్‌తో 'సినిమాకెళ్దాం రండి' చిత్రాన్ని నిర్మించిన శ్రీ ప్రొడక్షన్స్ సంస్థ ఈ 'వెయ్యి అబద్ధాలు'సినిమాను నిర్మిస్తోంది. అలాగే ఈ చిత్రం కథాంసం ఓ మాట్రమోనీ బ్యూరో చుట్టూ తిరగనుంది. ఎస్తర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో నాగబాబు, నరేష్, చలపతిరావు, బాబూమోహన్, గౌతంరాజు, తిరుపతి ప్రకాష్, కొండవలస, హేమ తదితరులు ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి మాటలు: మరుధూరి రాజా, సంగీతం: రమణగోగుల, కెమెరా: రసూల్ ఎల్లోర్, కళ: నరసింహవర్మ, ఎడిటింగ్: శంకర్, పాటలు: అరిశెట్టి సాయి, పోతుల రవికిరణ్. సమర్పణ: చిత్రం మూవీస్, నిర్మాణం: శ్రీప్రొడక్షన్స్.

English summary
Senior director Teja who is advertising his new film 1000 Abaddalu as 'A Film Not By Teja'. Call it attention grabbing or clever tactic, this is truly intriguing and evokes our interest.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more