రవితేజ ఇడియట్ ఐతే పూరి తమ్ముడు ఇడియట్ నెం.2
వాస్తవానికి 'బుజ్జిగాడు' తర్వాత ఫ్లాపుల్లో ఉన్న పూరీ తమ్ముడు సాయిరామ్ శంకర్ కి బ్రేక్ ఇవ్వటానికి 'బంపర్ ఆఫర్' పూరీ శిష్యుడు రవి దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం అతనికి మంచి రెస్పాన్స్ రాకపోవడంతో నెక్ట్స్ పూరీ సాయిరామ్ శంకర్ తో 'ఇడియట్ 2" అనే మరో మాస్ చిత్రాన్ని చేయనున్నాడని సమాచారం.
రవితేజ హీరోగా పూరీజగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన 'ఇడియట్" ఎంతటి ఘనవిజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పక్కరలేదు. తాజాగా ఈ చిత్రానికి సీక్వెల్ చేయడానికి పూరీ ప్రయత్నాలు చేస్తున్నాడట. కానీ ఈ సినిమాలో రవితేజ హీరోగా కాకుండా పూరీ తమ్ముడు సాయిరామ్ శంకర్ ఈ సినిమాలో హీరోగా నటించనున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఈ సినిమాని నట్టి కుమార్ నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నాడట. ప్రస్తుతం స్క్రిప్ట్ కి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయని సమాచారం.


Click it and Unblock the Notifications











