For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఆశ్చర్యం... ఇంకోటి మొదలెట్టాడు

  By Srikanya
  |

  హైదరాబాద్ : సాయిరామ్ శంకర్ స్పీడు చూసి సినీ వర్గాలు ఆశ్చర్యపోతున్నాయి. చేతిలో ఒక్క హిట్ లేదు..బయిట శాటిలైట్ మార్కెట్ లేదు. అయినా వరసగా సినిమాలు మొదలెడుతున్నాడేంటి అని ఆసక్తిగా చర్చించుకుంటన్నారు. తాజా చిత్రం వివరాల్లోకి వస్తే... చైత్ర మూవీ మేకర్స్ రూపొందిస్తున్న సినిమా 'జగదాంబ'. (ఎపి 31జి 1122) అనేది ఉపశీర్షిక. అడ్డాల శ్రీలత సమర్పిస్తోంది. సురేష్ కృష్ణ, జయంత్.సి.పరాన్జీ, సురేష్ ప్రొడక్షన్స్‌లో పలు చిత్రాలకి దర్శకత్వ శాఖలో పనిచేసిన పి.ఎస్.వాసుదేవ్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. అడ్డాల పెద్దిరాజు నిర్మాత.

  నిర్మాత మాట్లాడుతూ "పి.యస్.వాసుదేవ్ చెప్పిన కథ చాలా బావుంది. 'జగదాంబ' పూర్తిగా యాక్షన్ కామెడీ థ్రిల్లర్‌గా రూపొందిస్తున్నాం. మా టైటిల్ అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుంది. ఆగస్ట్ నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలుపెడతాం'' అని అన్నారు. ఈ సినిమాకు కెమెరా: సర్వేష్ మురారి, సంగీతం: రాహుల్‌రాజ్, ఎడిటింగ్: మార్తాండ్.కె.వెంకటేష్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: అల్లూరు రామ్మోహన్.

  Sai Ram Shankar’s next is Jagadamba AP 31 G 1122

  ఇక సాయిరామ్ శంకర్ కి హిట్ వచ్చి చాలా కాలం అయ్యింది. తన అన్న కలగ చేసుకున్నా హిట్ అనేది అతని దరిదాపులకు రావటం లేదు. కెరీర్ మొదలయ్యి చాలా కాలం అయినా నటనలో కొంచెం కూడా ఇంప్రూవ్ మెంట్ లేకపోవటం,అతని వాయిస్ మైనస్ అంటున్నారు. దానికి తోడు కథలు సైతం అతనికి సహకరించటం లేదు. ఈ నేపధ్యంలో అతని కొత్త చిత్రం మొదలైంది. అందులో కీలకపాత్రలో శరత్ కుమార్ ని తీసుకున్నారు. శరత్ కుమార్ సాయింతో అయినా సాయిరామ్ శంకర్ హిట్ కొట్టాలని అతని అభిమానులు కోరుకుంటున్నారు.

  సాయిరామ్‌ శంకర్‌ హీరోగా విభా ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తోంది. శరత్‌కుమార్‌ ముఖ్య పాత్రధారి. సుదర్శన్‌ సలేంద్ర దర్శకుడు. దేపా శ్రీకాంత్‌రెడ్డి నిర్మాత. హైదరాబాద్‌లో లాంఛనంగా ప్రారంభమైంది. తొలి సన్నివేశానికి కాశీ విశ్వనాథ్‌ క్లాప్‌నిచ్చారు. శ్రీకాంత్‌రెడ్డి కెమెరా స్విచ్చాన్‌ చేశారు.

  దర్శకుడు మాట్లాడుతూ ''వినోదాత్మకంగా సాగే ఈ కథలో అన్ని వాణిజ్య అంశాల్నీ మేళవించాం. సాయిరామ్‌కి కెరీర్‌లోనే చెప్పుకోదగిన పాత్ర ఇది. సాయికుమార్‌ నటన ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ. హీరోయిన్ ఎవరనేది త్వరలో చెబుతామ''న్నారు. ''స్క్రిప్ట్‌ బాగా వచ్చింది. ప్రతిభగల సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారు. మహత్‌ సంగీతం ఆకట్టుకొంటుంది''అన్నారు నిర్మాత.

  ఎమ్మెస్‌ నారాయణ, కాశీ విశ్వనాథ్‌, పృథ్వీ, సప్తగిరి, తాగుబోతు రమేష్‌, శంకర్‌, ధన్‌రాజ్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కూర్పు: త్యాగరాజన్‌, ఛాయాగ్రహణం: మార్టిన్‌ జో, సమర్పణ: యర్రం వంశీధర్‌రెడ్డి.

  English summary
  Sai Ram Shankar, has now signed yet another new film titled Jagadamba AP31 G 1122. P S Vasudev, who had earlier assisted Suresh Krishna and Jayanth C Paranji in the past will be making his debut as director.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X