»   » అంత చెత్త రికార్డా.. అజ్ఞాతవాసినే మించిపోయిందిగా, పరువు గోవిందా..!

అంత చెత్త రికార్డా.. అజ్ఞాతవాసినే మించిపోయిందిగా, పరువు గోవిందా..!

Subscribe to Filmibeat Telugu
Intelligent Bigger Flop Than Agnyaathavaasi

అజ్ఞాతవాసి వంటి ఘోరమైన పరాజయంతో ఈ సంవత్సరం సినిమా ఏడాది ప్రారంభం అయింది. మెగా ఫాన్స్ బోలెడన్ని ఆశలు పెట్టుకున్న అజ్ఞాతవాసి చిత్రం వారిని పూర్తిగా నిరాశ పరిచింది. అజ్ఞాతవాసి చిత్రం తరువాత మెగా ఫ్యామిలీ నుంచి మరో రెండు చిత్రాలు విడుదలయ్యాయి. వారిలో ఒకటి సాయిధరమ్ తేజ్ ఇంటెలిజెంట్ చిత్రం కాగా మరొకటి వరుణ్ తేజ్ నటించిన తొలిప్రేమ చిత్రం.

వరుణ్ తేజ్ తొలిప్రేమ చిత్రం మెగా ఫాన్స్ ఆశలు నిలబెట్టే విధంగా ఉంటూ వసూళ్ల వర్షంతో దూసుకుపోతోంది. కానీ సాయిధరమ్ తేజ్ ఇంటెలిజెంట్ చిత్రం మాత్రం పూర్తిగా నిరాశ పరిచింది. దర్శకుడు వినాయక్ పై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. మరో వైపు ఈ చిత్రం అజ్ఞాతవాసి కన్నా భారీ డిజాస్టర్ అని ట్రెండ్ పండితులు తేల్చేస్తున్నారు.

అంచనాలు లేకుండా

అంచనాలు లేకుండా

ఇంటెలిజెంట్ చిత్రం అంచనాలు లేకుండా విడుదలైంది. కనీసం సరైన ప్రచార పద్ధతులని అవలంభించని చిత్ర యూనిట్ ఓపెనింగ్స్ విషయంలో దారుణంగా నష్టపోయింది. ఇంటెలిజెంట్ చిత్రానికి ఓపెనింగ్స్ అంతంత మాత్రంగానే వచ్చాయి.


 డిజాస్టర్ టాక్, పైగా వరుణ్ దెబ్బ

డిజాస్టర్ టాక్, పైగా వరుణ్ దెబ్బ

ఇంటెలిజెంట్ చిత్రం మొదటి షో నుంచే డిజాస్టర్ టాక్ మూటగట్టుకుంది. దీనితో వసూళ్లు పడకేశాయి. కనీసం వివి వినాయక్ మ్యాజిక్ కూడా పనిచేయలేదు. మరుసటి రోజే వరుణ్ తేజ్ తొలిప్రేమ చిత్రం విడుదల కావడంతో ఇంటెలిజెంట్ పరిస్థితి దయనీయంగా మారింది.


 నష్టం ఎంతంటే

నష్టం ఎంతంటే

వివి వినాయక్, సాయిధరమ్ తేజ్ చిత్రం కావడంతో ఈ చిత్రానికి మంచి ప్రి రిలీజ్ బిజినెస్ జరిగింది. దాదాపు 27 కోట్ల వరకు ఈచిత్రాన్ని అమ్ముకున్నారట. ఇందులో 70 శాతంమేరకు బయ్యర్లు నష్టపోయే అవకాశం ఉందని ట్రేడ్ అనలిస్టులు అంచనా వేస్తున్నారు. అజ్ఞాతవాసి చిత్రం దాదాపు 60 శాతం నష్టాల్ని మిగిల్చింది.


వివి వినాయక్, తేజుపై విమర్శలు

వివి వినాయక్, తేజుపై విమర్శలు


వినాయక్ సినిమా అంటే ప్రేక్షకుల్లో కొన్ని అంచనాలు ఉండేవి. ఈ చిత్రంతో ఆ అంచనాలు పూర్తిగా సన్నగిల్లిపోయాయని అభిమానులు అంటున్నారు. ఇకనైనా సీనియర్ దర్శకుడిగా వి వి వినాయక్ తన పరిణితి కనబరచాలని సూచిస్తున్నారు. అలాగే సాయిధరమ్ తేజ్ కూడా కథల ఎంపికలో స్మార్ట్ గా వ్యవహరించాలని కోరుతున్నారు. వరుసగా 5 ప్లాపులని మూటగట్టుకున్న తేజు ఇకపై జాగ్రత్త వహించకపోతే కెరీర్ ప్రమాదంలో పడే అవకాశం ఉంది.


 వరుసగా రీమిక్స్ లు ఏంటి

వరుసగా రీమిక్స్ లు ఏంటి

సాయిధరమ్ తేజ్ వరుసగా తన చిత్రల్లో చిరు పాటలని రీమిక్స్ చేయడంపై కూడా కామెంట్లు వినిపిస్తున్నాయి. మావయ్య పాటల రీమిక్స్ లు ఆపి మంచి కథలాలని ఎంచుకోవడంపై దృష్టి పెట్టాలని మెగా ఫాన్స్ కోరుకుంటున్నారు.


English summary
Saidharam Tej's Intteligent movie bigger plop than Agnyaathavaasi movie. This is the fifth failure for Saidahram Tej in a row. He should care about his new projects.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu