»   »  నాకే నచ్చలేదు...ఎలా హిట్టవుతుంది?

నాకే నచ్చలేదు...ఎలా హిట్టవుతుంది?

Posted By:
Subscribe to Filmibeat Telugu
Thoda Pyaar Thoda Magic
కరీనా కపూర్‌ తాజా ప్రియుడు... బాలీవుడ్‌ నటుడు... యశ్‌రాజ్‌ ఫిలిమ్స్‌ ఆస్థాన కథానాయకుడు... వెరసి సైఫ్‌ అలీఖాన్‌. ఆయన ఈ ఏడాది 'రేస్‌' చిత్ర విజయంతో ఉత్సాహంగా ఉన్నారు. ప్రస్తుతం ఇంకా పేరు ఖరారు చేయని చిత్రంలో ఇంతియాజ్‌ అలీ దర్శకత్వంలో ఆయన హీరోగా నటిస్తున్నారు. ఇందులో దీపికా పదుకొణే కథానాయిక. ఈ చిత్ర షూటింగ్‌ ప్రస్తుతం శాన్‌ ఫ్రాన్సిస్కోలో సాగుతోంది. అక్కడే సైఫ్‌ అలీఖాన్‌ ఓ వార్తా సంస్థతో మాట్లాడారు. ఈ మధ్యనే వచ్చిన 'తషాన్‌', 'తోడా ప్యార్‌ తోడా మ్యాజిక్‌' చిత్రాల పరాజయం పాలయ్యాయి ఏంటి సంగతి అంటే...

ఆయన మాటల్లో అవి నన్ను పెద్దగా పెద్దగా ఇబ్బందిపెట్టలేదు అని తేల్చేసాడు. అయినా 'తోడా ప్యార్‌ తోడా మ్యాజిక్‌' నాకే నచ్చలేదు. ఇక ప్రేక్షకులకు ఎందుకు నచ్చుతుంది? నేను సాధారణంగా అమెరికన్‌ సినిమాల్ని ఇష్టపడతాను. హిందీ చిత్రాల్ని చాలా తక్కువగా చూస్తాను. అదీ బాగున్న చిత్రాల్నే! ఇదే ఫార్ములాని ప్రేక్షకులు కూడా పాటించవచ్చేమో కదా!అయినా కాస్త మన నేటివిటీని పాటిస్తూ సినిమాలు తీయాలని తీర్మానించాడు.

అలాగే ఆయనకు దీపికా పదుకోణె కీ మధ్యం ఎఫైర్ నడుస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి కదా అని ప్రస్తావిస్తే... అదంతా ఒట్టి పుకారే. ఇలా ఎవరు ఎందుకు మాట్లాడుతున్నారో నాకేమీ అర్థం కావట్లేదు. ఇందులో నమ్మడానికి ఏమీ లేదు. వృత్తిపరంగా ఇద్దరం ఒక చిత్రంలో నటిస్తున్నామంతే! ఆమె ఎంతో కష్టపడి నటించే యువతి. తన పని మీదే దృష్టి నిలుపుతుంది. అది తప్ప తన గురించి నాకు ఇంకేమీ తెలియదు...అని చెప్పుకొచ్చారుట.

ఇక కరీనా తల్లితండ్రులు మిమ్మల్ని అల్లుడిగా అంగీకరించలేదట ...నిజమేనా అంటే...కోపంగా ఎవరన్నారు ఆ మాట! కరీనా కుటుంబంతో నాకు సత్సంబంధాలే ఉన్నాయి. ఆంటీకి రోజూ ఎస్సెమ్మెస్‌లు పంపిస్తుంటాను. అంకుల్‌ని కూడా పలు సందర్భాల్లో కలిసి మాట్లాడాను. వాళ్లింట్లో జరిగే కార్యక్రమాలకు నాకు ఆహ్వానం వస్తుంది. ఇప్పటికే అలా చాలా వేడుకల్లో పాలుపంచుకున్నాను.అని కన్ఫర్మ్ గా చెప్పాడు. అదీ సంగతి.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X