»   »  చెల్లికి పెళ్లి....ఇప్పుడే వద్దంటూ స్టార్ హీరో లొల్లి!

చెల్లికి పెళ్లి....ఇప్పుడే వద్దంటూ స్టార్ హీరో లొల్లి!

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: బాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన సైఫ్ అలీ ఖాన్, నటి కరీనా కపూర్‌ను ప్రేమించి పెళ్లాడిన సంగతి తెలిసిందే. పెళ్లి ముందు నుంచే వీరు కొన్సి సంవత్సరాల పాటు సహజీవనం చేసారు. ఇపుడు ఇదే దారిలో ప్రయాణిస్తోంది సైఫ్ చెల్లెలు సోహా అలీ ఖాన్. సోహా గత కొంత కాలంగా బాలీవుడ్ నటుడు కునాల్ ఖేముతో సహజీవనం చేస్తోంది.

ఇటీవలే సోహా, కునాల్ కొత్త ఇంట్లోకి కొత్త ఇంట్లోకి వెళ్లారు. పెళ్లి కాకుండానే ఇద్దరూ ఒకే ఇంట్లో సహజీవనం చేస్తున్నారు. తల్లి షర్మిలా ఠాగూర్ త్వరగా పెళ్లి చేసుకుని జీవితంలో సెటి కావాలని ఆమెకు సూచిస్తుంటే.....ఆమె అన్నయ్య సైఫ్ మాత్రం 40 ఏళ్ల వయసు వచ్చాకే పెళ్లి కోసుకోమని అడ్వైజ్ ఇస్తున్నాడట. ఈ విషయాలను సోహానే స్వయంగా వెల్లడించారు.

'మా అమ్మ పెళ్లి చేసుకోమని ఎప్పటి నుండో గొడవ పెడుతోంది...ఆమె మాట విని పెళ్లి చేసుకుని ఉంటే నేను ఇప్పటికి 20 మంది పిల్లలకు తల్లినయ్యేదాన్ని. కానీ అన్నయ్య సైఫ్ అలా కాదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో పెళ్లంటే ఎంత సీరియస్ కమిట్ మెంటో ఆయనకు బాగా తెలుసు. జీవితంలో అర్థం చేసుకోవాల్సిన చాలా ఉంటాయి. అందుకే 40 ఏళ్ల వరకు పెళ్లి చేసుకోవద్దని సలహా ఇచ్చాడు' అని సోహా చెప్పుకొచ్చింది.

సోహా అలీ ఖాన్ వయసు ప్రస్తుతం 34 ఏళ్లు. 30 ఏళ్ల వయసున్న కునాల్ ఖేముతో సోహా సహజీవనం చేస్తోంది. కునాల్ గురించి ఎంతో గొప్పగా చెబుతోంది. కునాల్ తనకు అన్ని విషయాల్లో ఎంతో సపోర్టివ్‌గా ఉంటాడని, నన్ను ఎంతో సంతోషంగా ఉంచుతాడని చెబుతోంది సోహా.

English summary
Actress Soha Ali Khan, who has been in a relationship with actor Kunal Khemu from quite a some time, says though her mother keeps asking her to settle down. However, on the other side her brother Saif Ali Khan advises her to get married only at 40.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X