»   » సైఫ్‌ అలీ ఖాన్‌తో ప్రభుదేవా మసాలా ఎంటర్టెనర్

సైఫ్‌ అలీ ఖాన్‌తో ప్రభుదేవా మసాలా ఎంటర్టెనర్

Posted By:
Subscribe to Filmibeat Telugu
ముంబై : వాంటెడ్, రౌడీ రాథోడ్, రామయ్యా వస్తావయ్యా చిత్రాలకు దర్శకత్వం వహించి బాలీవుడ్లో హిట్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న ప్రభుదేవా....మరో మసాలా ఎంటర్టెనర్‌తో బాలీవుడ్ ప్రేక్షకులను మెప్పించడానికి సిద్ధం అవుతున్నాడు. బాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన సైఫ్ అలీ ఖాన్‌తో త్వరలో సినిమా చేయబోతున్నాడు.

బాలీవుడ్లో ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ రిలయన్స్ ఎంటర్టెన్మెంట్స్ నిర్మించే ఈ చిత్రం 2015లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. జనవరి 23, 2015గా రిలీజ్ డేట్ ఫిక్స్ చేసారు. ఈ లోగా సినిమాను కంప్లీట్ చేసేందుకు పర్ ఫెక్ట్‌గా ప్లానింగ్ చేస్తున్నారు. పూర్తి వివరాలు త్వరలో ప్రకటించనున్నారు.

ప్రస్తుతం ప్రభుదేవా హిందీలో అజయ్ దేవగన్, సోనాక్షి సిన్హా, యామీ గౌతమిలతో ఓ సినిమా చేయడానికి సిద్ధం అవుతున్నాడు. టైటల్ ఇంకా ఖరారు కాని ఈచిత్రం ఇంకా ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది. పూర్తి వినోదాత్మకంగా, కమర్షియల్ ఎంటర్టెనర్‌గా ఈచిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు టాక్.

తెలుగులో సూపర్ హిట్ అయిన పోకిరి చిత్రాన్ని హిందీలో 'వాంటెడ్'గా రీమేక్ చేసిన ప్రభుదేవా తొలి సినిమాతోనే బాలీవుడ్లో హిట్ కొట్టారు. ఆ తర్వాత ఆయన 2012లో అక్షయ్ కుమార్‌తో చేసిన 'రౌడీ రాథోడ్' భారీ బ్లాక్ బస్టర్ హిట్టయింది. ఇది తెలుగులో హిట్టయిన 'విక్రమార్కుడు' చిత్రానికి రీమేక్. ఈ రెండు హిట్లతో బాలీవుడ్లో స్టార్ దర్శకుడిగా మారిపోయాడు ప్రభుదేవా.

English summary
Bollywood actor Saif Ali Khan has now teamed up with Prabhudeva for a masala entertainer film. The rest of the details of the movie are still to be finalised, the movie will be produced by Reliance Entertainment Pvt. Ltd.
 The release date has been set to January 23, 2015.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu