»   » తైమూరు పేరుమారుస్తాం. కరీనా ఒప్పుకోవడం లేదు.. జిహాదీ అని ముద్ర..

తైమూరు పేరుమారుస్తాం. కరీనా ఒప్పుకోవడం లేదు.. జిహాదీ అని ముద్ర..

Posted By:
Subscribe to Filmibeat Telugu

తన కుమారుడి పేరును మార్చాలనుకుంటున్నానని బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ వెల్లడించారు. ఆ పేరుతో తన కొడుకు అపఖ్యాతిని మూటగట్టుకోవడం ఇష్టం లేదని పేర్కొన్నారు. కరీనా కపూర్, సైఫ్ దంపతులు తమ కుమారుడికి తైమూర్ అని పేరుపెట్టడం వివాదాస్పదమైంది.

 సైఫ్, కరీనా జిహాదీలు

సైఫ్, కరీనా జిహాదీలు


చరిత్రలో దండయాత్రలు చేస్తూ క్రూరమైన రాజు పేరొందిన తైమూర్ పేరును పెట్టడంపై సోషల్ మీడియాలో పలువురు దుమ్మెత్తిపోశారు. సైఫ్ దంపతులను జిహాదిస్టులు అని ఆరోపించేవారకు పరిస్థితి దారి తీసింది.

 తైమూర్ పేరు మార్చాలనుకొంటున్నాం

తైమూర్ పేరు మార్చాలనుకొంటున్నాం


రెండు నెలల వయస్సు ఉన్న తమ కుమారుడి పేరు వివాదాస్పదమవ్వడంపై ఇటీవల సైఫ్ అలీఖాన్, కరీనా కపూర్ పెదవి విప్పారు. ఆ పేరు పెట్టడం వెనుక ఆ రాజును గుర్తు చేయడం తమ ఉద్దేశం కాదని వివరణ ఇచ్చారు. ఇటీవల ఓ ఆంగ్ల దినపత్రికతో మాట్లాడుతూ కొద్ది వారాల క్రితం కుమారుడి పేరు మార్చాలని అనుకొన్నాను. కానీ కరీనా అందుకు ఒప్పుకోలేదు అని తెలిపారు.

 అపఖ్యాతి మూటగట్టుకోవడం ఇష్టం లేదు

అపఖ్యాతి మూటగట్టుకోవడం ఇష్టం లేదు


ప్రజలను సంతృప్తి పరుచడం కోసం పేరు మార్చడం లేదని, భవిష్యత్‌లో తైమూరు అపఖ్యాతిని మూటగట్టుకోవద్దనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకొన్నానని వెల్లడించారు. అయితే రానున్న రోజుల్లో పేరు మార్చడంపై మరింత దృష్టిపెడుతామని ఆయన అన్నారు.

 స్కూల్‌లో తైమూర్‌కు ఇబ్బంది కలుగొచ్చు

స్కూల్‌లో తైమూర్‌కు ఇబ్బంది కలుగొచ్చు


తైమూర్‌కు స్కూల్‌లో ఇబ్బందులు కలుగుతాయేమోనని భయం వెంటాడుతున్నది. అందుకే ఆ పేరును మార్చాలనే కోరిక రోజురోజుకు బలంగా మారుతున్నది. ఆ నిర్ణయం తీసుకొనే విషయంలో ఆలస్యం అవుతున్న కొద్ది ఆందోళన ఎక్కువ అవుతున్నది అని సైఫ్ తెలిపారు. ఈ వ్యవహారంపై మున్ముందు ఏమవుతుందో అనే బెంగ కూడా ఉందని ఆయన చెప్పారు.

English summary
Saif Ali Khan revealed how he almost went through with changing his son's name, but Kareena was against it.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu