»   » ఇద్దరు భార్యల గొడవ అంతా ఉత్తుత్తిదేనట.., కరీనా పై అసలు నిజం చెప్పేసింది

ఇద్దరు భార్యల గొడవ అంతా ఉత్తుత్తిదేనట.., కరీనా పై అసలు నిజం చెప్పేసింది

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాలీవుడ్ హాట్ కపుల్ సైఫ్ అలీఖాన్, కరీనా కపూర్ ఈమధ్య తరచూ వార్తల్లోకి వస్తూనే ఉన్నారు అదేమిటో గానీ మీడియా కూదా వీల్ల మీద ప్రత్యేక శ్రద్ద పెట్టింది. అక్కడి వరకూ బానే ఉంది గానీ మరీ ఉన్నవీ లేనివీ కల్పించి రాస్తేనే వాళ్ళకి మండేది. ఇప్పుడు అలాగే అయ్యింది. సైఫ్ భార్య అమృతా సింగ్ తో విడిపోయిన 8 ఏళ్ల తర్వాత కరీనాను పెళ్లాడాడు ఈ ఖాన్. సైఫ్-కరీనాలు పెళ్లి చేసుకుని కూడా 4 ఏళ్లు గడిచిపోయింది.

అంటే అమృతాతో సైఫ్ విడిపోయి పుష్కరం గడిచిందన్న మాట. ఇక ఇన్ని సంవత్సరాల తరవాత అమృతా సింగ్ కి ప్రత్యేకించి కరీనా అంటే కోపం ఏముంటుంది? కానీ ఇప్పుడు వచ్చిన తాజా వార్తలు మాత్రం ఈ ఇద్దరి మధ్యా పచ్చగడ్డి వేసినా భగ్గుమంటుందీ అన్న రేంజ్ లో ఫోన్ లు చేసుకొని మరీ తిటుకుంటున్నారని అన్నట్టుగా ఉన్నాయి. అదీ సైఫ్ అమృతాల కూతురైన సారా అలి ఖాన్ గురించట.

సైఫ్- అమృతాల కూతురు సారా ఆలీ ఖాన్ విషయంలో.. బెబోకి అమృత చీవాట్లు పెట్టిందని.. కరీనా కపూర్ కూడా ఏం తగ్గలేదనే న్యూస్ వచ్చింది.ఇద్దరూ ఓక్రి మీద ఒకరు కారాలూ మిరియాలూ నూరుకుంటున్నారు అన్నట్టు వచ్చిన వార్తలకు తాను ఆశ్చర్య పోయానంటూ చెప్పింది అమృతా సింగ్. ఓ ఈవెంట్లో అందాలు ఆరబోస్తూ సారా డ్రసింగ్ చేసుకోవడానికి కారణం కరీనానే అని భావించి.. అమృత గొడవ పడినట్లుగా న్యూస్ హల్ చల్ చేశాయి.

Saif's Ex Wife Amrita Singh breaks silence

కరీనా నే సారా కీ అలాంటి అరకొర డ్రెస్ వేసి చిన్న పిల్లని చెడగొదుతిఓంది అంటూ అమృతా తిట్టిందనీ, కరీనా కూడా గట్టిగా నీకనవసరం అన్న రేంజ్ లో సమధానం చెప్పిందనీ కొన్ని వార్తలను ఎవరు సృష్టించారో ఏమో తెలియదు కానీ ఈ వార్తలు బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారి అమృతా చెవిని కూదా చేరాయట. ఈ వార్తల పై షాక్ తిన్న అమృతా విస్తుపోయి అసలు నేను అలా ఎందుకంటాను అనుకొని భాదపడిందట.

అందుకే ఆ విషయమంతా ఈ మధ్యనే వచ్చిన ఓ ఇంటర్వ్యూలో చెప్పేసింది ఈ సైఫ్ మాజీ వైఫ్. 'ఈ మధ్య కాలంలో చాలామంది నా పేరును అనవసరంగా వాడుతున్నారు. ఈ కాలం పిల్లలకు వారి సొంత మైండ్ సెట్ ఉంది. నా కూతురు సారా.. కొడుకు ఇబ్రహీంలు.. నా మాదిరిగా కాకుండా వాళ్లను వాళ్లే లీడ్ చేసుకోవాలన్నది నా ఆలోచన కరీనా చెప్పటం వల్లో లేదా ఇంకెవరో ప్రోత్సహించటం వలననో వాళ్ల నిర్ణయాన్ని మార్చుకొని ఒక అభిప్రాయానికి వస్తారని నేననుకోవటం లేదు. సారా ఎలాంటి దుస్తులు వేసుకోవాలన్నది ఆమె మాత్రమే నిర్ణయించుకోగలదు.' అని చెప్పింది అమృతా సింగ్.

'యాక్టింగ్ నేర్చుకునే ముందు చదువు పూర్తి చేయాలని సారా నిర్ణయించుకుంది. కొలంబియా యూనివర్సిటీలో స్టడీస్ పూర్తయ్యాకే బాలీవుడ్ పై దృష్టి పెట్టింది. కాలేజ్ వెళ్లకూడదని అనుకుంటే నేనేం చేయగలిగేదాన్ని' అంటూ అమృతా సింగ్ అనడంతో.. బెబో-అమృతల మధ్య వివాదం అంతా కేవలం రూమర్ మాత్రమే అనే సంగతి తేలిపోయింది.

English summary
Amrita Singh breaks silence on reports of fight with Kareena Kapoor over daughter Sara
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu