»   »  రామ్ చరణ్ తో ఛాలెంజ్ చేసా

రామ్ చరణ్ తో ఛాలెంజ్ చేసా

Posted By:
Subscribe to Filmibeat Telugu
హైదరాబాద్ : చిరంజీవితో అప్పట్లో ఛాలెంజ్ సినిమా చేసాను. ఆ సినిమాలో నా పాత్ర చిరంజివి అబిమానులు మరిచిపోలేని పాత్ర. ఆయన ఛాలెంజ్ గెలవటానికి ఐదువందలు ఇచ్చి ఆయన గెలునకు కారణమైన పాత్ర అది. ఎవడు లోనూ రామ్ చరణ్ కి ఛాలెంజ్ విసిరే పాత్ర చేసాను అన్నారు సాయికుమార్.

చిత్రంలో తన పాత్ర గురించి చెప్తూ... ధర్మాగా నా పాత్ర చూసిన వారందరూ కొత్త సాయిని చూశామంటారు. ఈ సినిమాలో నా గొంతుతో పాటు కళ్ళు కూడా మాట్లాడతాయి. నా కళ్ళ మీదే ఎక్కువ షాట్లు తీస్తున్నప్పుడు ఎందుకా అనుకున్నాను. ఇప్పుడు రషెష్ చూస్తే తెలుస్తోంది. అన్నారు సాయికుమార్.

చిత్రం గురించి దర్శకుడు మాట్లాడుతూ....'ఎవడు పూర్తిగా వాణిజ్య అంశాలతో మేళవించిన సినిమా. పూర్తిగా రామ్‌చరణ్‌ శైలి, ఇమేజ్‌ని దృష్టిలో పెట్టుకొని తయారు చేశాం. చరణ్‌ ఇమేజ్‌ ఈ కథకు ప్రధాన బలం.కథ, కథనాలు పూర్తిగా కొత్తగా ఉంటాయి. చిరంజీవి, రామ్‌చరణ్‌ ఇద్దరినీ కూర్చోబెట్టి ఒకేసారి ఈ కథ చెప్పా. వినగానే నచ్చేసింది. సినిమా చూసిన తరవాత పూర్తిస్థాయిలో సంతృప్తి వ్యక్తం చేశారు. 'చెప్పిన దానికంటే బాగా తీశావ్‌' అని చిరు మెచ్చుకొన్నారు. ఇది 'ఫేస్‌ ఆఫ్‌' అనే హాలీవుడ్‌ సినిమాకి స్ఫూర్తి అని చెప్పుకొంటున్నారు. కానీ ఆ సినిమాకీ 'ఎవడు'కీ సంబంధం లేదు'' అన్నారు.

రామ్‌చరణ్‌ హీరోగా నటిస్తున్న చిత్రం 'ఎవడు'. శ్రుతిహాసన్‌, అమీ జాక్సన్‌ హీరోయిన్స్. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం జూలై 31 న విడుదల చేయాలని మొదట అనుకున్నారు. కానీ ఇప్పుడు ఆగస్టు 21 కి మారింది. ఈ విషయాన్ని నిర్మాతలు ఖరారు చేసారు. చిరంజీవి పుట్టిన రోజు కి ఓ రోజు ముందున విడుదల అవుతుంది.

కోట శ్రీనివాసరావు, జయసుధ, సాయికుమార్‌, రాహుల్‌దేవ్‌, అజయ్‌, ఎల్‌.బి.శ్రీరాం, సుప్రీత్‌, వెన్నెల కిషోర్‌ తదితరులు ఇతర పాత్రధారులు. సహ నిర్మాతలు: శిరీష్‌-లక్ష్మణ్‌, కూర్పు: మార్తాండ్‌.కె.వెంకటేష్‌, కళ: ఆనంద్‌ సాయి, సంగీతం: దేవిశ్రీప్రసాద్‌

English summary

 
 Ram Charan’s ‘Yevadu’ has been shifted to August 21st. The movie was originally scheduled for a release on July 31st. Disturbances in the state political climate have reportedly influenced the makers. Not a day or a week. Yevadu now releases on August 21st, a day before megastar Chiranjeevi's birthday. Yevadu starring Ram Charan and Sruthi Haasan is directed by Vamsi Paidipalli.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu