»   » నేను కాజోల్‌కి అభిమానిని అంటూ ట్వీట్

నేను కాజోల్‌కి అభిమానిని అంటూ ట్వీట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ తన అభిమాన నటి కాజోల్ ను కలిసింది. ఆమెతో దిగిన ఫోటోను తన ట్విట్టర్లో పోస్టు చేయడంతో పాటు కాజోల్ కు నేను పెద్ద ఫ్యాన్ అంటూ కామెంట్ చేసింది.

సైనా నెహ్వాల్ ఇప్పటి వరకు మనకు కేవలం వరల్డ్ ఫేమస్ క్రీడాకారిణిగానే మనకు తెలుసు. తర్వాత పలు యాడ్ ఫిల్మ్స్ లో కూడా నటించింది. అయితే త్వరలో ఆమెను మనం నటిగా కూడా చూడబోతున్నాం. ప్రస్తుతం మంచి ఫాంలో ఉన్న ఆమె ఉన్నట్టుండి ఇదేంటని అనుకుంటున్నారా?...ఈ విషయం చెప్పింది స్వయంగా సైనా నెహ్వాలే.

Saina met actress Kajol

ఓ హిందీ సీరియల్‌లో సైనా నెహ్వాల్ నటిస్తున్నట్లు సైనానే స్వయంగా ట్విట్టర్ ద్వారా తెలియజేసింది. ''హర్ ఘర్ కుచ్ కహెథా హై'' అనే సీరియల్‌లో సైనా నటిస్తోంది. సీరియల్‌లో ఆమెతో పాటు బాలీవుడ్ కమెడియన్ వినయ్ పాఠక్ కూడా నటిస్తున్నారు. షూటింగ్ సందర్భంగా తీసిన కొన్ని ఫోటోలను కూడా సైనా ట్విట్టర్లో పోస్ట్ చేసింది.

English summary
"Met actress Kajol mam. I m a huge fan for her" Saina Nehwal Tweeted.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu