»   » నా భర్త ఆరోగ్యంతో తిరిగివస్తారు.. సైరా భాను

నా భర్త ఆరోగ్యంతో తిరిగివస్తారు.. సైరా భాను

Posted By:
Subscribe to Filmibeat Telugu

అభిమానుల ఆశీర్వాదబలంతో నా భర్త ఆరోగ్యంతో తిరిగి వసాడు అని ప్రముఖ నటి సైరాభాను అన్నారు. బాలీవుడ్ దిగ్గజం దిలీప్ కుమార్ ఇటీవల తీవ్ర అస్వస్థతకు గురవ్వడంతో వెంటనే ముంబైలోని ప్రముఖ హాస్పిటల్‌కు తరలించారు. ప్రస్తుతం లీలావతి హాస్పిటల్‌లోని ఐసీయూలో ఆయనకు చికిత్సను అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో దిలీప్ కుమార్ భార్య సైరా భాను ఆయన ఆరోగ్యం గురించి మీడియాకు వివరించారు.

Saira Bhanu: Dilip Kumar will come with sound health

సైరాబాను మీడియాతో మాట్లాడుతూ.. దిలీప్ కుమార్.. కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. కోట్లాది మంది అభిమానుల ఆశీర్వాదంతో దిలీప్ కోలుకుంటారు అని అన్నారు. 'అందాజ్', 'మధుమతి', 'దేవదాస్', 'క్రాంతి' తదితర హిందీ చిత్రాల్లో నటించిన దిలీప్ కుమార్ కోట్లాది మంది అభిమానుల హృదయాల్లో చెరుగని ముద్ర వేశారు. సినీ రంగానికి చేసిన సేవలకు గుర్తింపుగా 2015లో కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషణ్ పురస్కారంతో దిలీప్‌ను సత్కరించింది.

Saira Bhanu: Dilip Kumar will come with sound health

ప్రస్తుతం దిలీప్ ఆరోగ్యం నిలకడగా ఉందని లీలావతి వైద్యులు వెల్లడించారు. గత కొద్దిరోజులుగా కిడ్నీ సంబంధిత వ్యాధితో, డీహైడ్రేషన్‌తో బాధపడుతున్నారని ఆయన అన్నారు.

English summary
Legendary Bollywood actor Dilip Kumar gave a scare to his fans after news of him being hospitalised broke out on Friday evening. He was admitted to the ICU at Lilavati hospital in Mumbai after suffering from a kidney ailment and dehydration. Wife of legendary actor Saira Bhanu hopes that Dileep will come with sound health.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu