»   » సాయిరామ్‌ శంకర్‌ సినిమాలో అక్కినేని

సాయిరామ్‌ శంకర్‌ సినిమాలో అక్కినేని

Posted By:
Subscribe to Filmibeat Telugu

పూరీ జగన్నాధ్ తమ్ముడు సాయిరామ్‌ శంకర్‌ హీరోగా కమిట్ అయిన కొత్త చిత్రంలో అక్కినేని నాగేశ్వరరావు కీలకపాత్రలో కనిపించనున్నారు. చిరకాల విరామం తర్వాత ఆయన కెమెరా ముందుకు వస్తున్నారు. చుక్కల్లో చంద్రుడు, శ్రీరామదాసు చిత్రాల తర్వాత ఆయన తెరపై కనిపించింది లేదు. అయితే దర్శకుడు చెప్పిన కథలో తన పాత్ర వైవిద్యంతో కూడి ఉండటంతో ఈ పాత్రకు కమిట్ అయినట్లు తెలుస్తోంది. ఉగాదికి ప్రారంభమయ్యే ఈ చిత్రాన్ని ఫ్రెండ్లీ మూవీస్‌ పతాకంపై చంటి అడ్డాల ఈ సినిమాని నిర్మించబోతున్నారు.ఈ చిత్రం ద్వారా పూరి జగన్నాథ్‌ మరో శిష్యుడు అశోక్‌కుమార్‌ లాలమ్‌ దర్శకుడిగా పరిచయం కానున్నారు. అలాగే ఇంతకు ముందు సాయిరామ్ శంకర్ హీరోగ వచ్చిన 'బంపర్‌ ఆఫర్‌'కూడా పూరీ శిష్యుడే దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. అలాగే ఈ చిత్రంలో మరో హీరో కూడా నటిస్తారని తెలిసింది. ఇక ఈ చిత్రానికి కథ పృథ్విరాజ్‌ అందిస్తే మాటలు పరుచూరి బ్రదర్స్‌ రాస్తున్నారు. ఛాయాగ్రహణం సీనియర్ కెమెరామెన్ ఎస్‌.గోపాల్‌రెడ్డి అందిస్తూండగా సంగీతాన్ని చక్రి అందిస్తున్నారు. గతంలో పూరీ, చక్రిల కాంబినేషన్లో ఎన్నో మ్యూజికల్ హిట్స్ వచ్చిన సంగతి తెలిసిందే.

Please Wait while comments are loading...