»   » "సైరాత్" హీరోయిన్ బడి బాట:అభిమానుల వల్ల మొదటిరోజే స్కూల్ ఎగ్గొట్టింది

"సైరాత్" హీరోయిన్ బడి బాట:అభిమానుల వల్ల మొదటిరోజే స్కూల్ ఎగ్గొట్టింది

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఇండియన్ సక్సెస్ ఫుల్ మూవీ ఆఫ్ ది యియర్ "సైరత్‌" లో ఆర్చిగా లీడ్ రోల్ పోషించి దేశవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది నటి రింకు రాజ్‌గురు. ఈ సినిమాలో ఆ పాత్రను పోషించింది రింకూ రాజ్‌గురు.సినిమా చేసే నాటికి ఈ అమ్మాయి వయసు 15 ఏళ్ళే అప్పుడు తొమ్మిదో తరగతిలో ఉందీ అమ్మాయి.

ఈ అమ్మడు ప్రస్తుతం పాఠశాలకు తిరిగివెళ్తొంది. తొమ్మిది తరగతి చదువుతున్న సమయంలో ఈ సినిమాలో నటించిన ఆ బాలిక వేసవి సెలవులను పూర్తి చేసుకొని పదో తరగతిలో చేరింది. సెలవుల్లో సినిమా విడుదలై ఘన విజయం సాధించే సరికి అమ్మడి పేరు దేశ వ్యాప్తంగా మారుమోగుతుంది. దీంతో తను పాఠశాలకువస్తున్న విషయం తెలుసుకున్న అభిమానులు పాఠశాల ముందు హడావిడి చేశారంట. దాంతో పాపం మొదటి రోజే స్కూల్ ఎగ్గొట్టాల్సి వచ్చింది. మరి ఇక సంవత్సరమంతా ఎలా వేగుతుందో ఏమో..

"Sairat" actor Rinku Rajguru failed to make it to the school on the first day of the new academic year.

మరాఠీలో కేవలం రూ.4 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కి దాదాపు రూ. 85 కోట్ల కలెక్షన్లు వసూలు చేసిన సినిమా సైరాత్. నాగ్‌రాజ్ మంజులే అనే దర్శకుడు తెరకెక్కించిన ఈ సినిమా ఇప్పుడు బాలీవుడ్‌లో సైతం టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది. ఉన్నత వర్గానికి చెందిన ఓ అమ్మాయి చేపలు పట్టి జీవనం సాగించే ఓ పేద కుటుంబానికి చెందిన అబ్బాయిని ప్రేమిస్తుంది.

sairat

పెద్దలు పెళ్లికి వ్యతిరేకించడంతో అమ్మాయి తన ప్రేమను గెలిపించుకోవడానికి సమాజాన్ని ఎదిరిస్తుంది. పరువు హత్యల నేపథ్యంలో అమ్మాయి, అబ్బాయిని చంపేస్తారు. ఈ నిజ జీవితకథ ఆధారంగా దర్శకుడు నాగ్‌రాజ్‌ మంజులే ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

ఈ సినిమాకి దక్కిన పాజిటివ్ టాక్ చూసి సౌత్ ఇండియన్ ఫిలింమేకర్స్ కూడా ఈ చిత్రం రీమేక్‌పై కన్నేశారు. భారీ బడ్జెట్ చిత్రాల నిర్మాత రాక్‌లైన్ వెంకటేష్ సైరాత్ సినిమాని తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో రీమేక్ చేసేందుకు రైట్స్ దక్కించుకున్నట్టు తెలుస్తోంది.

English summary
"Sairat" actor Rinku Rajguru, who has become a household name in Maharashtra after the grand success of the movie, failed to make it to the school on the first day of the new academic year.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu