»   » చింపాంజీతో పోలుస్తూ పవన్ పై 'సాక్షి' వ్యంగ్యం

చింపాంజీతో పోలుస్తూ పవన్ పై 'సాక్షి' వ్యంగ్యం

By Srikanya
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  హైదరాబాద్ : అందరూ ఊహిస్తున్నట్లుగానే పవన్ కళ్యాణ్ పై 'సాక్షి' పత్రిక ఓ రేంజిలో విరుచుకుపడుతోంది. వారు సీమాంధ్ర ప్రచార కర్తలకు స్పెషల్ అవార్డులు.... అనే ఆర్టికల్ ప్రచురించింది. అందులో నారా లోకేష్ ని, చంద్రబాబు నాయుడుని, కుతూహలమ్మని, పవన్ కళ్యాణ్ ని వెటకారం చేసారు. అయితే కేవలం నవ్వుకోవటానికి మాత్రమే అని ముక్తాయింపు ఇచ్చారు. పవన్ కళ్యాణ్ కి ఛాతీ బాదుడు అవార్డుని ప్రధానం చేసారు. దాని గురించి ఈ క్రింద విధంగా రాసారు. యధాతథంగా...

  ఛాతీబాదుడు అవార్డు - ఇదో ప్రత్యేక అవార్డు. ప్రసంగిస్తూ బల్ల గుద్దడమే మనకు తెలుసు. ఛాతీ బాదుకోవడం అనే ప్రత్యేక లక్షణాన్ని ప్రదర్శించిన పవన్ కళ్యాణ్ కోసమే ఈ అవార్డు. (ఛాతీ బాదుడు చింపాంజీలే చేస్తాయని ఇన్నాళ్లూ అనుకునేవాళ్లం.)

  ఈ విషయం వదిలేస్తే... ఎన్టీయే కూటమి తరుపున విస్తృతంగా ప్రచారం చేసిన పవన్ తను మద్ధతు ఇచ్చిన కూటమికి ఎంతవరకూ ఉపయోగపడ్డారు..ఎంతవరకూ ఆయన ప్రభావం ఉండనుంది అనేది అంతటా చర్చ నడుస్తోంది. ఈసారి కనుక పవన్ కళ్యాణ్ ప్రభావం పెద్దగా లేపోతే...వచ్చే ఎలక్షన్స్ లో పవన్ పార్టీ ఉండకపోవచ్చును అనే ఊహాగానాలు సైతం ఈ సమయంలో వినిపిస్తున్నాయి. పవన్ ఈ సారి తన ప్రభావం చూపగలిగితే ఖచ్చితంగా జనసేన పార్టీ ని అంతా సీరియస్ గా తీసుకుంటారనేది నిజం. పవన్ పవర్ పనిచేసి విజయం సాధిస్తే సరే, లేకపోతే ఇప్పటికే పవన్ కళ్యాణ్ పై నిప్పులు చెరుగుతోన్న మీడియావర్గం ఈ సారి మరింత విరుచుకుపడటం ఖాయం...ఎండగడుతూ కథనాలు ప్రసారం చేసినా ఆశ్చర్యం లేదు. అందుకే ఆయన అభిమానులు సైతం తమ హీరో సినిమా విడుదల అయ్యాక రిజల్ట్ కోసం ఆత్రుతగా ఎదురుచూసినట్లు చాలా ఆసక్తిగా ఎలక్షన్ రిజల్ట్ వైపు చూస్తున్నారు.

  Sakshi attack on Pawan Kalyan and TDP

  ఇక పవన్‌కల్యాణ్‌ సరాసరి కొత్త సినిమా సెట్‌లోకి అడుగుపెట్టబోతున్నారు. 'ఓ మై గాడ్‌' రీమేక్‌ సినిమా కోసం ఆయన కాల్‌షీట్లు కేటాయించినట్టు సమాచారం. మే నెలాఖరున షూటింగ్ మొదలవుతుంది. దీనికోసం హైదరాబాద్‌లో ప్రత్యేకంగా ఓ సెట్‌ని తీర్చిదిద్దుతున్నారు. అందులోనే ఎక్కువ భాగం సన్నివేశాల్ని చిత్రీకరిస్తారు. ఆ సెట్ ఓ మార్కెట్ సెట్. కథలో ఎక్కువ భాగం మార్కెట్ లో జరుగుతుంది కాబట్టి ఆ మార్కెట్ నే బాగా డిజైన్ చేస్తున్నారు.

  ఈ చిత్రంలో పవన్‌తో పాటు వెంకటేష్‌ కూడా నటిస్తారు. హిందీలో అక్షయ్‌కుమార్‌, పరేష్‌ రావల్‌ నటించిన 'ఓ మైగాడ్‌' విజయవంతమైంది. అదే చిత్రాన్ని ఇక్కడ పవన్‌, వెంకటేష్‌లపై తీస్తున్నారు. అక్కడ అక్షయ్‌ పోషించిన పాత్రలో పవన్‌, పరేష్‌ రావల్‌ పాత్రలో వెంకటేష్‌ నటిస్తారు. ఈ చిత్రానికి డాలీ దర్శకత్వం వహించబోతున్నారు. రాధికా ఆప్టే హీరోయిన్ గా ఎంపికైనట్టు సమాచారం. తొలుత నయనతారని అనుకొన్నారు కానీ... ఆ ఛాన్స్‌ రాధిక చేజిక్కించుకొన్నట్టు తెలిసింది. వెంకటేష్ సరసన ఆమె చేయనుంది.

  బాలీవుడ్‌లో ఘన విజయం సాధించిన చిత్రం 'ఓ మై గాడ్‌'. 'మేన్‌ హూ స్యూడ్‌ గాడ్‌' అనే ఆంగ్ల చిత్రం ఆధారంగా తెరకెక్కిన చిత్రమిది. ఈ రెండు చిత్రాల్ని స్ఫూర్తిగా తీసుకొని.. సురేష్‌ ప్రొడక్షన్స్‌ సంస్థ తెలుగులో ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. కృష్ణుడు పాత్రకు ఎక్కువ సీన్స్ ఉండవు కాబట్టి గబ్బర్ సింగ్ 2 తో పాటు ఈ చిత్రమూ చేస్తాడని చెప్తున్నారు. వెంకటేష్ స్వయంగా పవన్ ని అడిగాడని అందుకే పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇఛ్చాడని అంటున్నారు.


  'ఓ మై గాడ్‌'కథ ఏమిటంటే... పరేష్ రావెల్ ఓ నాస్తికుడు. అతనికి పురాతన వస్తువులు అమ్మే షాప్ ఉంటుంది. ఓరోజు అతని వ్యాపారం భూకంపం దెబ్బకు నాశనమైపోతుంది. దాంతో అతను ఇన్సూరెన్స్ వారిని ఆశ్రయిస్తారు. అయితే వాళ్లు చేతులెత్తేసి... అది భగవంతుడు పని కాబట్టి తమకేం సభందం లేదని చెప్తారు. దాంతో కోపం తెచ్చుకున్న అతను భగవంతుడుపై కేసు వేస్తాడు. అప్పుడు భగవంతుడు వచ్చి ఏం చేస్తాడు అనేది మిగతా కథ. పరేష్‌ రావల్‌ ప్రధాన పాత్రలో నటిస్తూ నిర్మించిన చిత్రం 'ఓ మై గాడ్‌'. అక్షయ్‌ కుమార్‌ కూడా ఓ కీలక పాత్రలో నటించి నిర్మాణంలో భాగస్వామిగా వ్యవహరించారు. ఉమేష్‌ శుక్లా దర్శకత్వం వహించారు. 'కంజి విరుద్ధ్‌ కంజి' నాటకం ఈ చిత్రానికి ఆధారం.

  English summary
  
 
 
 Saakshi is obviously feeling lot more irritated on Pawan Kalyan. Pawan Kalyan has put his film assignments aside and campaign for the NDA alliance. All in all, Pawan Kalyan is making great impact on political arena in Andhra Pradesh. If the NDA front comes in power, he will become even more 'powerful' star. If not that is the hot topic.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more