For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  రామ్ చరణ్...వీధి పోరాటంపై 'సాక్షి' కథనం

  By Srikanya
  |
  Ram Charan Teja
  హైదరాబాద్ : రామ్ చరణ్‌పై బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైన సంగతి తెలిసిందే. ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఏర్పడ్డ చిన్న వివాదం కారణంగా సహనం కోల్పోయిన రామ్ చరణ్ ఇద్దరు వ్యక్తులపై దాడి చేయించారనే ఆరోపణల నేపథ్యంలో ఈ కేసు నమోదైంది. ఈ విషయమై 'సాక్షి' తెలుగు దినపత్రిక 'మెగా' పలుకుబడి...అంటూ ఓ కథనం ప్రచురించింది.

  ఆ కథనం...యధాతథంగా...

  "సినిమాలలో దుష్ట కార్యాలు చేసే విలన్ ను హీరో ఎదుర్కొని విజయం సాధిస్తే అభిమనులు తమ అబిమాన హీరోను నెత్తిన పెట్టుకుని జేజేలు పలుకుతారు. ఆ అమాయక అభిమానులు, సినిమాలలో మాదిరే హీరోలు బయిట కూడా అలాంటి ప్రవర్తన కలిగి ఉంటారని పిచ్చి భ్రమల్లో ఉంటారు.

  వారి నమ్మకాలు వమ్ము అయిన సందర్భాలు ఇటీవల కాలంలో ఎన్నో వున్నాయి. హీరోలు వెండితెర మీదే కాకుండా నిజ జీవితంలోనూ మోతాదుకు మించి నటించేస్తూంటారు. అంతేకాకుండా తమ పలుకుబడి ఏ పాటిదో అవకాసం దొరికినప్పుడల్లా చూపించేస్తూంటారు. తాజగా మెగా స్టార్ ,కేంద్ర మంత్రి చిరంజీవి తనయుడు, హీరో రామ్ చరణ్ తెర బయిట హీరోయిజాన్ని ప్రదర్శించే ప్రయత్నం చేసాడు. సిగ్నల్ వద్ద తమ కారుకు దారి ఇవ్వలేదనే కోపంతో ఇద్దరు యువకులపై దాడి చేసాడు.

  అంతటితో ఆగని ఈ హీరోగారు తమ వ్యక్తిగత సిబ్బందిని పిలిపించి మరీ కొట్టించాడు. రామ్ చరణ్ చేతిలో దెబ్బలు తిన్న బాధితులు బంజారా హిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసి,నాటకీయ పరిణామాల్లో ఉపసంహరించుకున్నారు. హైదరాబాద్ కొండాపూర్ కు చెందిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ఫణీష్, ఉప్పల్ కి చెందిన సాప్ట్ వేర్ ఇంజినీర్ కళ్యాణ్ ఆదివారం మధ్యాహ్నం బంజారాహిల్స్ రోడ్డు నం.1 లోని తాజ్ కృష్ణా వైపు నుంచి పంజాగుట్ట వైపు కారులో వెళ్తున్నారు.

  జీవీకే మాల్ వద్ద సిగ్నల్ పడటంతో కారు ఆపారు. అదే సమయంలో రామ్ చరణ్ కారులో వస్తూ వీరి వెనక కారు ఆగాడు. తాను వెళ్లటానికి దారి ఇవ్వాసని,కారుని అడ్డు తొలిగించమంటూ గట్టిగా హారన్ కొట్టడమే కాకుండా దుర్భాషలాడాడు. అనంతరం తన కారుని ముందుకు తీసుకొచ్చి ఫణీష్ కారుకు అడ్డంగా ఆపాడు.

  తన భద్రతా సిబ్బందికి ఫోన్ చేసి పది నిముషాల్లో అక్కడ ఉండాలని ఆదేశించాడు. ఆదేశాలు ఇవ్వడమే ఆలస్యం క్షణాల్లో అక్కడ ప్రత్యక్షం అయిన భద్రతా సిబ్బంది కారులో కూర్చున్న ఫణీష్ ను,కళ్యాణ్ ను బయిటకు లాగి,దాడి చేసాడు. కారు దిగి వచ్చిన రామ్ చరణ్ కూడా వారిద్దరిపై చేయి చేసుకున్నాడు.

  నేనెవరో తెలుసా అంటూ ఊగిపోయాడు. తమ తప్పేమీ లేదని ఆ యుకులు బతిమిలాడినా వినిపించుకోలేదు. రామ్ చరణ్ తో పాటు భద్రతా సిబ్బంది దాదాపు పావు గంట పాటు నడిరోడ్డుపై రచ్చ రచ్చ చేశాడు. మరోసారి కారుకు అడ్డమొస్తే నరికేస్తామని మరీ హిచ్చరించాడు. తమ దారిన వెళ్ళిపోతామంటూ భాధితులు వేడుకుంటున్నా వినిపించజుకోకుండా పిడిగుద్దులతో విరుచుకు పడ్డాడు. అనంతరం వారి బారీ నుంచి తప్పించుకున్న భాధితులు బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. తమపై రామ్ చరణ్ దాడి చేశాని మీడియాతో వాపోయారు.

  అయితే తెర వెనక ఏం జరిగిందో తెలీదు కానీ కేసు పెట్టలేదు. ముందు రామ్ చరణే కొట్టాడు. అతను మాపై రెచ్చిపోయాడని ఆవేశంగా చెప్పిన బాథితులు పోలీస్ స్టేషన్ లో రెండు గంటలు కూర్చోగానే స్క్రిప్టు మార్చజేసారు. సంఘటన జరిగిన వెంటనే రామ్ చరణ్ పై చిందులేసిన బాధిత బాబులు స్టేషన్ నుంచితిరిగి వెళ్లేటప్పుడు జరిగిన ఘటనను లైట్ గా తీసుకోవాలంటూ మీడియాకు గీతోపదేశం చేయటం విశేషం.

  గతంలో చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మిత నివాసంలో పెట్టెల కొద్ది నోట్లు కట్టలు దొరికినా ఆ సంఘటనపై ఎలాంటి చర్యలు తీసుకోని విషయం తెలిసిందే. పవర్ ఉంటే ఎలాంటి కేసులు అయినా మాఫీ అయిపోతాయన్న భావన సర్వత్రా వ్యాపించి ఉన్న రోజులవి. తాజాగా ఈ ఘటనతో మెగా ఫ్యామిలీ పలుకుబడి ఏ పాటిదో మరోసారి రుజువైంది."

  English summary
  Telugu Daily Sakshi published on Ramchran's Man Handled matter. Ram Charan Teja allegedly got manhandled two people for not making way for him at a traffic signal in the city on Sunday. A case has been registered against the Magadheera actor at the Banjara Hills police station.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X