»   » ఫోర్బ్స్ హైయెస్ట్ పెయిడ్ యాక్టర్స్: టాప్10లో అమితాబ్, సల్మాన్, అక్షయ్

ఫోర్బ్స్ హైయెస్ట్ పెయిడ్ యాక్టర్స్: టాప్10లో అమితాబ్, సల్మాన్, అక్షయ్

Subscribe to Filmibeat Telugu

న్యూయార్క్: ప్రపంచంలో అత్యధికంగా ఆర్జించే నటుల జాబితాను ఫోర్బ్స్‌ పత్రిక విడుదల చేసింది. ఈ ఏడాది జాబితాలో ముగ్గురు బాలీవుడ్‌ నటులు టాప్-10లో ఉండటం విశేషం. బాలీవుడ్‌ అగ్రనటులు అమితాబ్‌ బచ్చన్‌, సల్మాన్‌ఖాన్‌, అక్షయ్‌కుమార్‌లు ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు.

ఫోర్బ్స్‌ తొలిసారిగా నటుల ఆదాయం గురించి పట్టిక ప్రకటించింది. అమితాబ్‌బచ్చన్‌, సల్మాన్‌ఖాన్‌లు గత సంవత్సరం సినిమాల ద్వారా 33.5మిలియన్‌ డాలర్ల పారితోషికం తీసుకొని ఏడో స్థానంలో నిలిచారు.

Salman, Amitabh, Akshay Kumar in top 10 highest-paid actors list

తాజా జాబితాలో ఈ ముగ్గురు బాలీవుడ్ దిగ్గజ నటులు కొందరు హాలీవుడ్ నటులను మించిపోయి టాప్-10లో చోటు దక్కించుకోవడం గమనార్హం. ప్రముఖ హాలీవుడ్ నటులు డ్వేన్(ది రాక్) జాన్సన్, జానీ డెప్‌లను వీరు సంపాదనలో దాటేశారు.

అక్షయ్‌కుమార్‌ 32.5మిలియన్‌ డాలర్లతో తొమ్మిదో స్థానంలో నిలిచారు. బాలీవుడ్‌ బాద్షా షారూక్‌ఖాన్‌ 18వ స్థానంలోనూ, రణ్‌బీర్‌కపూర్‌లు 30వ స్థానంలో నిలిచారు. 80 మిలియన్‌ డాలర్ల ఆదాయంతో రాబర్ట్‌ డౌనీ జూనియర్‌ ఈ పట్టికలో ప్రథమ స్థానం దక్కించుకోగా, రెండో స్థానం జాకీ చాన్‌కి లభించింది.

English summary
Salman Khan, Amitabh Bachchan and Akshay Kumar are among the world's top ten highest-paid actors in Forbes first global list of actors.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu