twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హెల్త్ చెకప్ కోసం అమెరికాకి ఆ మాస్ హీరో

    By Srikanya
    |

    బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఆ మధ్యన ట్రైజెమినల్ న్యూరాల్జియా వ్యాధిన బారిన పడిన సంగతి తెలిసిందే. అప్పట్లో అమెరికా వెళ్లి సర్జరీ చేయించుకున్న ఆయన మళ్ళీ రీసెంట్ గా అక్కడకి చెకప్ కోసం వెళ్ళుతున్నారు. ప్రస్తుతం ఏక్ ధా టైగర్ షూటింగ్ లో బిజీగా క్యూబా లో ఉన్న ఆయన అటునుంచి అటే మెడికల్ చెకప్ కి వెళ్ళుతున్నారు. మళ్లీ ఆ కంప్లైంట్ కి చెందిన సింప్టమ్స్ కొన్ని కనపడటంతో వైద్యుల సూచన కోసం వెళ్ళుతున్నట్లు సమాచారం. అప్పట్లో దాదాపు ఐదు గంటల పాటు వైద్యులు శస్త్ర చికిత్స నిర్వహించారు. 15 రోజుల పాటు విశ్రాంతి అవసరమని సూచించారు. సల్మాన్ ఖాన్ బిజీ షెడ్యూల్ వల్లనే ఈ పరిస్థితి వచ్చింది.

    విరామం లేకుండా శ్రమిస్తున్నందు వల్లనే ఆరోగ్యం పాడైందని, ఆ పనులు కాస్త తగ్గించు కోవాలని వైద్యులు సూచించారు. వందమందిలో ఏ ఒక్కరికో వచ్చే ఈ వింత వ్యాధి సల్మాన్ ను నాలుగేళ్లుగా వేధిస్తోంది. వైద్య పరిభాషలో ఈ జబ్బును సూసైడల్ డిజార్డర్ లేదా ట్రైజీనియల్ న్యూరాల్జియా అని వ్యవహరిస్తారు. వెన్నుపూస లో మెదడుకు చెందిన నరాలు పట్టేయడం వల్ల ఈ వ్యాధి వస్తుంది. తలలో ఉన్నట్లుండి చాలా తీవ్రంగా మొదలయ్యే నొప్పి క్షణాలపాటు వుండి మాయమవుతుంది. ఒక్కోసారి మళ్లీ అంతే తీవ్రంగా విరుచుకుపడుతుంటుంది. ఎలక్ట్రిక్ షాక్ తగిలినట్లు నరాలు జివ్వుమనేంతగా వేధించే నొప్పి నెమ్మది నెమ్మదిగా ముఖానికీ విస్తరిస్తుంది.

    English summary
    Salman Khan, who is currently shooting with Katrina Kaif for ‘Ek Tha Tiger’ in Cuba, is reportedly planning to go straight to the US from there for a medical check-up.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X