»   » సల్మాన్ ఖాన్ హీరోగా శ్రీనువైట్ల రెడీ

సల్మాన్ ఖాన్ హీరోగా శ్రీనువైట్ల రెడీ

Posted By:
Subscribe to Filmibeat Telugu

పోకిరీ హిందీ రీమేక్ వాంటెడ్ సల్మాన్ ఖాన్ కి మంచి కిక్కు ఇచ్చినట్లుంది. దాంతో ఆయన దృష్టి దక్షిణాది చిత్రాలపై పడింది. తాజాగా ఆయన శ్రీను వైట్ల రెడీ రీమేక్ వెర్షన్ లో నటించాలనుకుంటున్నట్లు వార్త. రామ్,జెనీలియా కాంబినేషన్లో వచ్చి సూపర్ హిట్టయిన రెడీ చిత్రం హిందీలోకి కూడా వెళ్ళబోతోందని సమాచారం. సల్మాన్ ఖాన్ హీరోగా ఈ చిత్రం ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అనీష్ బష్మీ అనే బాలీవుడ్ దర్శకుడు ఈ చిత్రం చేయటానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆయన ఈ చిత్రం రీమేక్ రైట్స్ కోసం ఎంక్వైరీ చేసారు. ఆయన మాట్లాడుతూ...ఈ ప్రాజెక్టు ను సల్మాన్ తో హిందీలో చేద్దామనుకుంటున్నాం. ఇంకా హీరోయిన్ ఎవరనేది ఫైనలైజ్ కాలేదు. అలాగే హిందీ ఆడియన్స్ కోసం కొన్ని మార్పులు చేయాల్సి ఉంటుంది అన్నారు. ఇక రెడీ చిత్రం తమిళంలో ధనుష్, జెనీలియా కాంబినేషన్లో ఉత్తమపుత్రిన్ పేరుతో రీమేక్ అయింది. మిత్రన్ జవహర్ ఈ చిత్రాన్ని డైరక్ట్ చేసారు. గజనీ చిత్రాన్ని అమీర్ ఖాన్ రీమేక్ చేసి హిట్టు కొట్టి సౌత్ ఇండియా కథలకు స్టార్ స్టేటస్ ఇచ్చారు. అలాగే అక్షర్ కుమార్ సైతం కమల్ హాసన్ బ్రహ్మచారి చిత్రాన్ని కంబర్క్ ఇష్క్ పేరుతో రీమేక్ చేసారు. ఇక ఇప్పడు రెడీ వంత వచ్చింది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu