»   » పెళ్లి చేసుకోకుండానే తండ్రి అవుతాడంట!

పెళ్లి చేసుకోకుండానే తండ్రి అవుతాడంట!

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: బాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ సల్మాన్ ఖాన్ వయసు 50కి చేరువైనా పెళ్లికి చేసుకోవడానికి ఆసక్తి చూపడం లేదు. పెళ్లికి ఆసక్తి లేక పోయినా తండ్రి కావాలనే కోరిక మాత్రం అతనిలో బలంగా ఉంది. తన తాజా సినిమా ‘బజ్రంగి భాయిజాన్' సినిమా ప్రమోషన్లో బిజీగా ఉన్న సల్మాన్‌కు ఎక్కడికి వెళ్లినా మీడియా నుండి పెళ్లికి సంబంధించిన ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

దీనిపై సల్మాన్ ఖాన్ స్పందిస్తూ తన పెళ్లి గురించే అందరూ ప్రశ్నిస్తున్నారు...కానీ తనను భరించగలిగే అమ్మాయి దొరకాలిగా అంటూ చమత్కరించాడు. ఇప్పటి వరకూ పెద్దలు కుదిర్చిన వివాహం అనుకున్నప్పటికీ.. ఇప్పుడు మనసు లవ్ మ్యారేజ్ వైపుకు మళ్లిందని అన్నాడు. అయితే ఇప్పుడే పెళ్లి చేసుకోవాలనపి లేదని, కానీ ఓ కొడుకు మాత్రం కావాలనిపిస్తోంది. అది కూడా తల్లి లేకుండానే అని అన్నాడు.

బజ్రింగి భాయి జాన్ సినిమాపై కొందరు మత వివాదం లేవనెత్తడంపై సల్మాన్ స్పందిస్తూ తమ కుటుంబానికి మతం పట్టింపులు లేవని, తన తండ్రి పటాన్, మహారాష్ట్ర హిందూ మహిళ అయిన తన తల్లితో పాటు క్యాథలిక్ అయిన హెలెన్ ను పెళ్లాడారని చెప్పుకొచ్చాడు.

Salman Khan about Bajrangi Bhaijaan Controversy

బాలీవుడ్లో సల్మాన్ ఖాన్ సినిమా వస్తుందంటే హడావుడి మామూలుగా ఉండదు. అభిమానులు ఆయన తాజా సినిమా ‘భజ్రంగి భాయిజాన్' సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇటీవల ఈ చిత్రం అపీషియల్ ట్రైలర్ విడుదల చేసారు. ఈ ట్రైలర్ అదిరిపోయింది. తర్వాత కరీనా కపూర్ నటించిన మేరా నామ్ మేరా స్పెషల్ సాంగుకు కూడా రెస్పాన్స్ అదిరిపోయింది. సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.

సల్మాన్ ఖాన్, కరీనా కపూర్, నవాజుద్దీస్ సిద్ధికీ ఈ చిత్రంలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. కబీర్ ఖాన్ దర్శకత్వం వహిస్తున్నారు. సల్మాన్ ఖాన్, రాక్ లైన్ వెంకటేష్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సల్మాన్ ఖాన్ అభిమానులు కోరుకునే అన్ని కమర్షియల్ అంశాలతో పూర్తి విందులా ఈ చిత్రం ఉండబోతోంది.

ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్... పవన్ కుమార్ చతర్వేది పాత్రలో హనుమంతుడి భక్తుడిగా కనిపించబోతున్నారు. అందరూ అతన్ని బజ్రింగి అని పిలుస్తుంటారు. చెవిటి మూగ అయిన పాకిస్థాన్ చిన్నారిని కలుస్తాడు. సినిమా ఆ చిన్నారి చుట్టూ తిరుగుతుంది. ఈ సినిమాకు కథ అందించింది ప్రముఖ రచయిత, దర్శకుడు రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్.

ఇటీవల ఈ సినిమాను పలువురు బాలీవుడ్ ప్రముఖుల కోసం ప్రత్యేకంగా ప్రదర్శించారు. సినిమా చూసిన అనంతరం కరణ్ జోహార్ స్పందిస్తూ...బజ్రింగి భాయిజాన్ సినిమా ప్రదర్శన ముగిసిన తర్వాత అందరి కళ్లు చెమ్మగిల్లాయి. ఎమోషన్ జర్నీ, సల్మాన్ ఖాన్ పెర్ఫార్మెన్స్ బావుంది అంటూ ట్వీట్ చేసారు.

English summary
Salman Khan about Bajrangi Bhaijaan Controversy.
Please Wait while comments are loading...