»   » హెయిర్ కటింగ్ చేస్తూ, టీ, వెజిటెబుల్స్ అమ్ముతూ సినీ హీరోలు (ఫోటోలు)

హెయిర్ కటింగ్ చేస్తూ, టీ, వెజిటెబుల్స్ అమ్ముతూ సినీ హీరోలు (ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ రోడ్డుపై హెయిర్ కట్ చేస్తూ, మసాజ్ చేస్తూ కనిపించాడు. మరోబాలీవుడ్ యంగ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా కూరగాలు అమ్మాడు. సింగర్ మికా సింగ్ టీ అమ్ముతూ దర్శనం ఇచ్చాడు. మరో బాలీవుడ్ నటుడు రోనిత్ రాయ్ రోడ్డుపై కాస్మొటిక్స్ అమ్ముతూ దర్శనమిచ్చాడు. టీవీ యాక్టర్ రామ్ కపూర్ టాక్సీ డ్రైవర్‌గా మారారు.

వీరంతా ఇలా రోడ్డు ఎందుకు ఎక్కారో తెలుసా? సమాజంలో మార్పు తేవడంలో భాగంగా కలర్స్ ఛానల్ ప్రారంభించిన 'మిషన్ సప్నే' అనే టీవీ షోలో భాగంగా. ఇందులో భాగంగా 'జై హో' స్టార్ సల్మాన్ ఖాన్ రోడ్డెక్కి బార్బర్ అవతారం ఎత్తాడు. సల్మాన్‌తో సిద్ధార్థ్ మల్హోత్రా, రోనిత్ రాయ్, మికా సింగ్ కూడా రోడ్డెక్కారు.

'మిషన్ సప్నే' షోలో భాగంగా పలువురు సలబ్రిటీలు ఒకరోజు ఇలా రోడ్డుపైకి వచ్చి చాయ్ వాలా, కూరగాయలు అమ్మే వారిలా, నామ్ కీన్ అమ్మే వారిలా అవతారం ఎత్తి కష్టపడి సంపాదించబోతున్నారు. వీరంతా ఇలా సామాన్యులుగా మారి ఫండ్స్ కలెక్ట్స్ చేసి పేద వారికి సహాయం చేస్తారట. సేవా కార్యక్రమాలలో ఎప్పుడూ ముందు ఉండే సల్మాన్ ఖాన్ ఈ కాన్సెప్టుకు వెంటనే ఒకే చెప్పారు.

స్లైడ్ షోలో ఫోటోలు, మరిన్ని వివరాలు....

సల్మాన్ ఖాన్

సల్మాన్ ఖాన్


రోడ్డుపై బార్బర్ అవతారం ఎత్తిన సల్మాన్ ఖన్ ఇలా హెయిర్ కట్ చేస్తూ కనిపించారు.

అమ్మాయికి మసాజ్ చేస్తూ...

అమ్మాయికి మసాజ్ చేస్తూ...


రోడ్డు ప్రమాదంలో కాళ్లు కోల్పోయిన ఓ బార్బర్‌కు సల్మాన్ సహాయ పడ్డాడు. అందులో భాగంగా ఓ అమ్మాయికి మసాజ్ చేసారు.

సిద్ధార్థ మల్హోత్రా

సిద్ధార్థ మల్హోత్రా


కూరగాయలు అమ్ముతూ దర్శనం ఇచ్చిన యంగ్ హీరో సిద్ధార్థ మల్హోత్రా....

మికా సింగ్

మికా సింగ్


టీ అమ్ముతూ బాలీవుడ్ స్టార్ సింగర్ మికా సింగ్ ఇలా దర్శన మిచ్చారు.

రోనిత్ రాయ్

రోనిత్ రాయ్


బాలీవుడ్ నటుడు రోనిత్ రాయ్ ఇలా కాస్మొటిక్స్ అమ్ముతూ దర్శనమిచ్చారు. మిషన్ సప్నేలో భాగంగా ఇదంతా చేస్తున్నారు.

రామ్ కపూర్

రామ్ కపూర్


టీవీ నటుడు రామ్ కపూర్ మిషన్ సప్నే లో భాగంగా ఇలా టాక్సీ డ్రైవర్ అవతారం ఎత్తారు.

పంజాబ్‌లో...

పంజాబ్‌లో...


సింగర్ మికా సింగ్ టీ అమ్మే కార్యక్రమాన్ని పంజాబ్‌లో చేపట్టారు. ఆయన టీ ఎంతో రుచిగా కాచారని పలువురు ప్రశంసించారు.

వీధి విధి తిరుగుతూ...

వీధి విధి తిరుగుతూ...


నటుడు రోనిత్ రాయ్ వీధి వీధి తిరుగుతూ పలు వస్తువులు అమ్ముతుండటం అందరినీ ఆకర్షించింది.

English summary
Mission Sapne the new show on Colors has been launched to bring about changes in the society. Salman Khan, the Jai Ho superstar, will be seen cutting hair of people walking on the road as he turns barber for one day for the new show Mission Sapne. It's not just him who will shock the audiences, but even Siddharth Malhotra as he will be seen selling vegetables.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu