»   » రేస్ 3 ట్రైలర్‌పై విమర్శలు.. ప్రభాస్ 'సాహో'ని కాపీ చేశారు, ఆ ఇద్దరూ అలాగే!

రేస్ 3 ట్రైలర్‌పై విమర్శలు.. ప్రభాస్ 'సాహో'ని కాపీ చేశారు, ఆ ఇద్దరూ అలాగే!

Subscribe to Filmibeat Telugu
Race 3 Trailer Has Similarities With Saaho Trailer??

కండల వీరుడు సల్మాన్ ఖాన్ నటించిన రేస్ 3 చిత్ర ట్రైలర్ ఇటీవల విడుదలైంది. యాక్షన్ ప్రియులకు ఈ ట్రైలర్ నచ్చుతోంది కానీ కామన్ ఆడియన్స్ కి మాత్రం నచ్చడం లేదు. బాలీవుడ్ యాక్షన్ చిత్రాలలో కనిపించిన సన్నివేశాలే రేస్ 3 ట్రైలర్ లో కూడా కనిపిస్తున్నాయని పెదవి విరుస్తున్నారు. సల్మాన్ ఖాన్, జాక్వెలిన్ ఫెర్నాండేజ్, అనిల్ కపూర్ ప్రధాన పాత్రల్లో నటించారు. రేస్ 3 ట్రైలర్ పై ఇప్పటికే విమర్శలు వస్తున్న తరుణంలో కొన్ని స్టంట్స్ కాపీ చేసారంటూ విమర్శలు వినిపిస్తున్నాయి.

 రేస్ 3 ట్రైలర్ విడుదల

రేస్ 3 ట్రైలర్ విడుదల

సల్లూభాయ్ నుంచి వస్తున్న మరో యాక్షన్ ఎంటర్ టైనర్ రేస్ 3. ఇటీవల సల్మాన్ ఖాన్ టైగర్ జిందహై చిత్రంతో అలరించిన సంగతి తెలిసిందే. జూన్ 15 న విడుదల కాబోతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి.

 సాహో స్టంట్ కాపీ

సాహో స్టంట్ కాపీ

రేస్ 3 ట్రైలర్ లో సల్మాన్ ఖాన్, జాక్వలిన్ పెర్నాండెజ్ శిఖరం నుంచి దూకే సన్నివేశం ఉంటుంది. ఆ స్టంట్ ను ప్రభాస్ సాహూ చిత్రం నుంచి కాపీ చేసారని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.

ఆ ఇద్దరూ వాళ్లేనా

సాహో చిత్ర టీజర్ గత ఏడాది విడుదల చేసారు. టీజర్ చివర్లో ఎత్తైన భవనం నుంచి మాస్క్ ధరించి ఉన్న ఇద్దరు వ్యక్తులు దూకే స్టంట్ ఉంటుంది. ఆ ఇద్దరూ ప్రభాస్, శ్రద్ధా కపూర్ అయి ఉంటారని అంటున్నారు. అదే స్టంట్ రేస్ 3 లో కనిపించడంతో గత చిత్రాల యాక్షన్ సన్నివేశాలల్ని కాపీ చేసి రేస్ 3 తెరకెక్కించారని విమర్శలు ఎక్కువవుతున్నాయి.

2019 లో సాహో

2019 లో సాహో

ప్రభాస్, శ్రద్దా కపూర్ జంటగా నటిస్తున్నా ఈ భారీ బడ్జెట్ యాక్షన్ ఎంటర్ టైనర్ చిత్రం 2018 లోనే విడుదల కావలసింది. కానీ షూటింగ్ ఆలస్యం జరుగుతుండడంతో 2019 లో విడుదల చేయనున్నారు

English summary
Salman Khan copied Prabhas's Saaho stunt. Race 3 trailer gets trolling
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X