»   » నేను సూపర్ హీరోను కాను..సూపర్ హీరో మూవీ చేయడానికి...!

నేను సూపర్ హీరోను కాను..సూపర్ హీరో మూవీ చేయడానికి...!

Posted By:
Subscribe to Filmibeat Telugu

సల్మాన్ ఖాన్, కత్రినాలు గత జ్ఞాపకాలుగా మిగిలిపోయారని, వీరిద్దరు ఇప్పుడు కలిసి సినిమాలు కూడా చేయట్లేదని అందరు అనుకుంటున్నారు. అయితే ఇప్పుడు వీరిరువురు కలిసి సినిమా చేయటానికి అంగీకరించారు. న్యూయార్క్ సినిమాని తీసిన కబీర్ ఖాన్ తన తరవాతి సినిమాకి హీరో, హీరోయిన్లుగా సల్మాన్, కత్రినాలను ఎంపిక చేసుకున్నాడు. ముందు ఈ సినిమాకి దీపికా, ప్రియాంకల పేర్లు పరిశీలనలోకి వచ్చినా కబీర్ ఖాన్ తన ఫేవరేట్ హీరోయిన్ కత్రినాకే ఒటేసాడు. దీంతో సల్మాన్, కత్రినాలను మళ్ళీ తెరపై చూడాలన్న ప్రేక్షకుల అభిలాష నిజం కాబోతోంది.

అదెలాగంటే ఫిక్షన్ కథల్లో హీరోలందరూ విచిత్ర వేషధారణతో కనిపించేవారే. సూపర్ మ్యాన్ నుండి స్పైడర్ మ్యాన్ దాకా దుస్తుల్లో ఏదో ఒక వింతను చూపిస్తుంటారు. ఇప్పుడు వీరినే ఆదర్శంగా తీసుకొని హతిక్ రోషన్, షారుక్ ఖాన్ లాంటి హీరోలు సూపర్ హీరో పాత్రల్ని చేస్తూ జనాల మెప్పు కోసం తహతహలాడుతున్నారు. మరి ఈ మధ్యే సల్మాన్ ఖాన్ కూడా ఓ సూపర్ హీరో కథను ఓకే చేసినట్టు తెలిసింది.

'స్పైడర్ మాన్ లాగానో, సూపర్ మాన్ లాగానో నేను ఎర్రటి అండర్ వేర్ బయట వేసుకొని తిరగలేను. ఎందుకంటే నేను సల్-మాన్ కాబట్టి. ఎవరో మిగతా హీరోలు చేస్తున్నారని చేయమంటే ఎలా?నేను సల్ మాన్ లానే వుంటాను" అంటూ షారుఖ్ పై డైరెక్ట్ ఎటాక్ చేసిపారేశాడు సల్మాన్ ఖాన్...

English summary
Actor Salman Khan rubbishes all the reports about his playing a spy agent with super powers in Kabir Khan's next film. The actor informs the reporters that he is not fascinated by “super hero” films.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu