»   » ధూం-4 లో అమితాబ్ పాత్రేమిటి? అసలు సల్మాన్ హీరోనా..,విలనా..??

ధూం-4 లో అమితాబ్ పాత్రేమిటి? అసలు సల్మాన్ హీరోనా..,విలనా..??

Posted By:
Subscribe to Filmibeat Telugu

"ధూమ్" ఈ పేరు విన‌గానే..జూ...మ్మంటూ బైక్ దూసుకు పోయే సౌండ్ చెవులలో తిరుగుతుంది. కుర్రాళ్ళంతా ఇందులో ఉన్న ముఖ్య పాత్రల్లా ఫీలైపోతూ బైక్ మీదెక్కి కూర్చుంటారు. ఆ రేంజ్ లో సంచల‌నాలు న‌మోదు చేసిన సిరిస్ ఇది. ఇప్ప‌టికే ఈ సిరీస్ లో మూడు సినిమాలొచ్చి ఇండియన్ సినిమా కి ఒక జోష్ ని పెంచాయి. ఇప్పుడు ధూమ్ 4 కి కూడా రంగం సిద్ధ‌మైపోయింది. ఈ సినిమా గురించి ప్రేక్ష‌కులు ఎన్నో రోజుల‌నుంచి వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమా కూడా చాలా కాలం నుంచి జ‌నాన్ని ఊరిస్తోంది.

బాలీవుడ్ కండ‌ల‌వీరుడు సల్మాన్ ఖాన్ తో లేటెస్ట్ సినిమా తీయాల‌ని యాష్ రాజ్ ఫిల్మ్స్ ప్ర‌య‌త్నిస్తోంది. ఇప్పుడీ విష‌యం అఫీషియ‌ల్ గా అనౌన్స్ అయిపోనుంది. క్రేజీ దొంగ‌త‌నాలు చేసే ప్ర‌తినాయ‌కుని గా స‌ల్మాన్ ఖాన్ న‌టిస్తుండ‌గా, ఈ సినిమా కి మ‌రో స్పెష‌ల్ అట్రాక్ష‌న్ కూడా జోడ‌యింది. ఇప్ప‌టివరుకూ ధూమ్ సిరీస్ లో అభిషేక్ బ‌చ్చ‌న్ మాత్ర‌మే కామ‌న్ క‌థానాయ‌కుడిగా క‌నిపించాడు. ఇప్పుడీ క్యార‌క్ట‌ర్ ను మార్చాల‌ని యాష్ రాజ్ సంస్థ నిర్ణ‌యించుకుంది. ధూమ్ 4 లో ఆ పాత్ర‌ను ర‌ణ‌వీర్ సింగ్ చేయ‌నున్నాడు. అంటే స‌ల్మాన్ తో పోటీ ప‌డి ప‌ట్టుకోబోయే పోలీస్ పాత్ర‌ను ర‌ణ‌వీర్ సింగ్ కు అప్ప‌గించార‌న్న‌మాట‌.

Salman Khan In Dhoom 4 As Villain

అయితే అతనితో పాటు, అతనికి అసిస్టెంట్‌గా కనిపిస్తూ వచ్చిన ఉదయ్‌ చోప్రా ని కూడా కొత్త సినిమాలో తప్పించేసారు.విలన్ గా కనిపించే హీరోకి జోడీగా ఇప్పటివరకు మూడు సినిమాల్లో వరుసగా ఇషా డియోల్‌, ఐశ్వర్యా రాయ్‌, కట్రీనా కైఫ్‌ నటించగా, ఇప్పుడు ఈ కొత్త విలన్ సల్మాన్ కి జోడీగా ఎవరు నటిస్తారనే విషయం ఇంకా ఓ కొలిక్కి రాలేదు.

ఇక ఈ సినిమాకు మరో ఎట్రాక్షన్ అమితాబ్‌ బచ్చన్. అయితే సినిమా లో ఆయన పాత్రేమిటన్నది ఇంకా ఖచ్చితంగా ఎవరికీ తెలియకుండా ఉంది. చాలా కాలం తర్వాత మరో హీరోతో కలిసి సల్మాన్ నటించబోతున్నాడు."ధూమ్‌ రీలోడెడ్‌: ద చేజ్‌ కంటిన్యూస్‌" పేరుతో రూపొందే ఈ సినిమాని కూడా విజయ్‌కృష్ణ ఆచార్య డైరెక్ట్‌ చేయనున్నాడు.అయితే ఈ సినిమా సెట్స్ మీదికి వెళ్లటానికి ఇంకో సంవత్సరం టైముంది లెండి.

English summary
Hrithik Roshan and Amitabh Bachchan to be a part of Dhoom 4
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu