»   » నేను మాట్లాడటం ఎక్కువ మంచిది కాదు: సల్మాన్ బాగానే హర్టైనట్టున్నాడు

నేను మాట్లాడటం ఎక్కువ మంచిది కాదు: సల్మాన్ బాగానే హర్టైనట్టున్నాడు

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాలీవుడ్‌ కండల వీరుడు సల్లూభాయ్‌ కి నోరు అదుపులో పెట్టుకోవటం అన్న విసయం లో మంచి క్లారిటీ నే వచ్చినట్టుంది. సల్మాన్ తన కొత్త సినిమా సుల్తాన్ ప్రమోషన్ లో భాగంగా ముంబైలో విలేకరులతో మాట్లాడుతూ నోరు జారాడు.. సుల్తాన్ సినిమా కోసం చాలా కండలు పెంచానని..

మల్లయోధుని పాత్రలో దాదాపు నా కంటే ఎక్కువ బరువున్న 120 కిలోల వస్తాదులను ఎత్తిపడేయడం లాంటి కష్టాలు పడ్డానని చెప్పారు. షూటింగ్ అయిపోయాక తన పరిస్థితి రేప్ కు గురైన అమ్మాయిలా ఉందంటూ మాట తూలి దేశ వ్యాప్త కాంట్రవర్సికీ తెరతీశాడు.

sallu

కానీ అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. అమ్మాయిలను కించపరిచేలా వ్యాఖ్యలు ఉన్నాయంటూ దీనిపై మహిళా సంఘాలు మండిపడ్డాయి. దీనిపై స్పందించిన ఢిల్లీ మహిళా కమిషన్ సభ్యులు సల్మాన్ ను వివరణ ఇవ్వాలంటూ నోటీసులు జారీ చేశారు. దీంతో వివాదం దేశవ్యాప్తం అయ్యింది.

షూటింగ్ సమయంలో అలసిపోవడానికి అమ్మాయి రేప్ కు కించపరిచేలా వ్యాఖ్యలు ఉన్నాయని మహిళా సంఘాలు సల్మాన్ పై దుమ్మెత్తిపోస్తున్నాయి.. హీరో అయినంత మాత్రాన నోటికొచ్చినట్లు మాట్లాడొచ్చనుకుంటే కుదరదని మహిళా సంఘాలు ఫైర్ అయ్యాయి.

సల్మాన్ ఖాన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ఆయన తండ్రి సలీం ఖాన్ స్పందించారు. సల్మాన్ ఖాన్ అలా మాట్లాడి ఉంటే అది కచ్చితంగా తప్పేనని వివరణ ఇచ్చుకున్నారు. సుల్తాన్ షూటింగ్ ఎంత కష్టంగా వున్నదో సరదాగా రేప్ బాధితురాలు పరిస్థితితో ఉదాహరణగా జోడించి వుండవచ్చునని తెలిపారు.

కానీ అలా షూటింగ్‌లో తాను పడిన శ్రమను అత్యాచార బాధితురాలితో పోల్చడం తప్పేనని.. సల్మాన్ ఖాన్ కుటుంబసభ్యులు, అభిమానుల తరపున తాను క్షమాపణలు చెబుతున్నట్లు సలీం వెల్లడించారు. అయినా తప్పు తప్పే కదా...

ఇక ఈ వివాదం తర్వాత సల్మాన్‌ మీడియాతో కూడా ఎక్కువగా మాట్లాడటం లేదు. ప్రస్తుతం సల్లూభాయ్‌ "ఐఫా" అవార్డుల కోలాహలం లో స్పెయిన్‌లో ఉన్నాడు. అక్కడి మీడియాతో సమావేశం కావడానికి సల్మాన్ స్టేజ్‌పైకి వెళ్లగానే ఏం మాట్లాడతాడో అన్న ఆతృతతో తారలతో సహా అభిమానుల ఆసక్తిగా చూశారు.

అయితే ఈ కండల సుల్తాన్ మాత్రం వారి ఆశల మీద నీళ్ళు చల్లుతూ స్టేజ్‌పైకి రాగానే.. "నేను తక్కువ సమయంలో ముగించేస్తాను. నేనెంత తక్కువ మాట్లాడితే అంత మంచిది" అని చెప్పి నాలుగు ముక్కలు మాట్లాడి ప్రసంగం ముగించేశాడు.

అంతే మరి తాను ఎంత గొప్పవాడైనా మాట్లాడేటప్పుడు ఒక సెలబ్రిటీగా తన కనీస విచక్షణ మర్చి పోతే ఇలాంటి అనుభవాలే ఎదురవుతాయి మరి. ఇకనైనా సల్మాన్ కాస్త "తక్కువ" మాట్లాడుతూ తన పరువు నిలబెట్టుకుంటాడేమో చూద్దాం...

English summary
Am not going to be talk much..and Its not Good for me.. says Salman khan at iifa Award Function 2016 at Madrid.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu