»   » తోడేళ్లతో ఫైట్ సీన్, భారీబడ్జెట్ తో , హాలీవుడ్ కాదు మనసినిమానే

తోడేళ్లతో ఫైట్ సీన్, భారీబడ్జెట్ తో , హాలీవుడ్ కాదు మనసినిమానే

Posted By:
Subscribe to Filmibeat Telugu

అడవిజంతువులతో పోరాటాలు ఎక్కువగా హాలీవుడ్ దర్శకులే చేస్తూంటారు. మనసినిమాల్లోనూ అప్పుడప్పుదూ ఇలాంటివి కనిపించినా అవి చాలా తక్కువ నిడివి కూడా కొద్దిసేపే ఈ మధ్యకాలం లో మళయాల సినిమా పులి మురుగన్ లో వచ్చిన పోరాటాలే హైలేట్ అనుకోవచ్చు. అయితే ఇప్పుదు మరో భీబత్సమైన పోరాటం కోసం సిద్దంగా ఉందండి. ఈ సారి పోరాటం తోడేళ్ళతో అవును ఈ రిస్కీ ఫైట్ కోరి మరీ చేస్తున్నాడట బాలీవుడ్ వీరుడు సల్మాన్...

త్వరలోనే సల్మాన్ అత్యంత ప్రమాదకరమైన తోడేళ్లతో పోరాట సన్నివేశాల్లో నటించబోతున్నాడు. వివరాల్లోకి వెళితే...సల్మాన్‌ఖాన్ ప్రస్తుతం టైగర్ జిందా హై చిత్రంలో నటిస్తున్నాడు 'ఆన్ ఇండియన్ ఏజెంట్..ఏ పాకిస్తాన్ స్పై..అగెనెస్ట్ ఏ కామన్ ఎనిమి' సబ్ టైటిల్ పెట్టారు. 2012లో భారీ విజయాన్ని సాధించిన ఏక్తా టైగర్ చిత్రానికి సీక్వెల్ ఇది. అలీఅబ్బాస్ జాఫర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కత్రినాకైఫ్ కథానాయికగా నటిస్తున్నది.

Salman Khan to fight a pack of wolves

ప్రస్తుతం ఆస్ట్రేలియాలో చిత్రీకరణ జరుగుతున్నది. ఈ సినిమాలో ఓ భారీ పోరాట ఘట్టాల్ని ప్రమాదకరమైన తోడేళ్లపై చిత్రీకరించబోతున్నారు. ఆస్ట్రేలియాలోని పర్వత శ్రేణుల్లో అత్యంత శీతల వాతావరణంలో ఈ యాక్షన్ ఎపిసోడ్స్‌ను తెరకెక్కించబోతున్నారు. హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ టామ్ స్ట్రూతర్స్ పర్యవేక్షణలో ఈ పోరాట సన్నివేశాల్ని చిత్రీకరించనున్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో తెరకెక్కిస్తున్న ఈ యాక్షన్ ఎపిసోడ్ రొమాంచితంగా వుంటుందని, ఇండియన్ స్క్రీన్‌పై ఇప్పటివరకు చూడని యాక్షన్ ఘట్టమిదని చిత్ర బృందం చెబుతున్నది. ఈ ఫైట్ కోసం భారీగా నే వెచ్చిస్తున్నట్టు సమాచారం . ఆదిత్యచోప్రా నిర్మిస్తున్న ఈ చిత్రం డిసెంబర్‌లో ప్రేక్షకులముందుకురానుంది.

English summary
Salman Khan is reportedly going to shoot an action scene for Tiger Zinda Hai where the actor will be seen fighting a pack of wolves in Austria.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu