twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బాహుబలిని కొట్టేస్తాం అంటే నమ్మేసి: డిస్ట్రిబ్యూటర్లు నిండా మునిగారు, ట్యూబ్ లైట్ దారుణం

    బలమైన కథ లేకపోవటంతో సల్మాన్ స్టార్ ఇమేజ్, భారీ గ్రాఫిక్స్ కూడా ట్యూబ్ లైట్ సినిమాను కాపాడలేకపోయాయి.

    |

    భారీ అంచనాలతో వచ్చి బాక్సాఫీస్ముందు చీకటే నింపింది సల్మాన్ ట్యూబ్లైట్ 2011 నుండి వరుసగా రంజాన్ వేడుకకు సినిమాలను విడుదల చేస్తున్న సల్మాన్, తొలి వీకెండ్ గడిచేపాటికి రికార్డులు తిరగరాసే విధంగా కలెక్షన్స్ ను కొల్లగొట్టడం పారిపాటిగా మారింది. అయితే 2017 ఏడాది మాత్రం ఈ 'కండల వీరుడు' ఆశించిన ఫలితాన్ని అందిపుచ్చుకోలేక, భారీ డిజాస్టర్ ను మూటకట్టించుకున్నాడు.

    ట్యూబ్ లైట్ బ్రేక్

    ట్యూబ్ లైట్ బ్రేక్

    ట్యూబ్ లైట్ అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది. వరుస సక్సెస్ లతో ఫుల్ ఫాంలో ఉన్న సల్మాన్ జోరుకు ట్యూబ్ లైట్ బ్రేక్ వేసింది. బలమైన కథ లేకపోవటంతో సల్మాన్ స్టార్ ఇమేజ్, భారీ గ్రాఫిక్స్ కూడా సినిమాను కాపాడలేకపోయాయి. సోషల్ మీడియాలో ట్యూబ్ లైట్ పై పెద్ద ఎత్తున సెటైర్లు పడుతుంటే.. రివ్యూలు కూడా దారుణంగా వచ్చాయి.

    సల్మాన్ ఖాన్ ఐనా

    సల్మాన్ ఖాన్ ఐనా

    సరైన కధ, కధనాలు లేకపోతే సల్మాన్ ఖాన్ కైనా షేక్ ఇచ్చే రిజల్ట్ ను ఇస్తామని ఈ సందర్భంగా ప్రేక్షకులు మరోసారి రుజువు చేసారు. ఇప్పటికే షారుక్ కు వివిధ సందర్భాలలో ఇలాంటి అవాక్కయ్యే ఫలితాలను ఇచ్చిన ప్రేక్షకులు, ఈ సారి మరో సల్మాన్ ఖాన్ కు కూడా ఆ రుచి చూపించారు.

    బాహుబలి 2 రికార్డులతో

    బాహుబలి 2 రికార్డులతో

    ‘బాహుబలి 2' సాధించిన రికార్డులతో ‘ట్యూబ్ లైట్' కూడా ఆ దరిదాపులకు చేరుకుంటుందని బాలీవుడ్ వర్గాలు భావించగా, మిక్స్ డ్ టాక్ తో నడుస్తోన్న "దువ్వాడ జగన్నాధమ్" రేంజ్ కంటే కూడా తక్కువ స్థాయిలో ‘ట్యూబ్ లైట్' ఫలితం ఉండడం గమనార్హం.

    300-350 కోట్లు వసూలుచేస్తేనే

    300-350 కోట్లు వసూలుచేస్తేనే

    బాక్సాఫీస్‌ లెక్కల ప్రకారం మొదటి తొమ్మిదిరోజుల్లో ట్యూబ్‌లైట్‌ 107.32 కోట్లు వసూలు చేసింది. కానీ ఈ సినిమా కనీసం రూ. 300-350 కోట్లు వసూలుచేస్తేనే డిస్ట్రిబ్యూటర్లు లాభం వచ్చే పరిస్థితి ఉందని సినీ విశ్లేషకుడు గిరీష్‌ జోహార్‌ తెలిపారు. సల్మాన్‌ ఈద్‌ రిలీజ్‌ కావడంతో ఈ సినిమాను డిస్ట్రిబ్యూటర్లు భారీ ధరకు కొనుగోలు చేశారని ఆయన చెప్పారు.

    Recommended Video

    థియేట్రికల్‌ హక్కులు రూ. 132 కోట్లు

    థియేట్రికల్‌ హక్కులు రూ. 132 కోట్లు

    ట్యూబ్‌లైట్‌ థియేట్రికల్‌ హక్కులు రూ. 132 కోట్లకు అమ్ముడుపోయినట్టు తెలుస్తోంది. అలాగే ఈ సినిమా శాటిలైట్‌, మ్యూజిక్‌ హక్కులు వరుసగా రూ. 55 కోట్లు, రూ. 38 కోట్లకు అమ్ముడుపోయినట్టు సమాచారం. అయితే, సినిమా బాక్సాఫీస్‌ వద్ద బాగా ఆడకపోవడంతో ఈ ధరలను సవరించే అవకాశం ఉందని చెప్తున్నారు.

    బాక్సాఫీస్‌ లెక్కల ఆధారంగానే

    బాక్సాఫీస్‌ లెక్కల ఆధారంగానే

    సినిమా బాక్సాఫీస్‌ లెక్కల ఆధారంగానే ఈ హక్కుల ఒప్పందాలు కుదురుతుండటంతో సినిమాలు ప్లాప్‌ అయితే.. ధర తగ్గించుకునే వెసులుబాటును ఆయా వర్గాలు కోరుతున్నట్టు చెప్తున్నారు. మొత్తానికి ట్యూబ్‌లైట్‌ సినిమా బాక్సాఫీస్‌ వద్ద రూ. 125 కోట్లు వసూలు చేస్తే గొప్ప అని భావిస్తున్నారు.

    English summary
    Considering how Salman Khan's films perform during on Eid, distributors have paid a titanic sum for film's theatrical rights. Given film's average show at the box office, distributors will not be able to make the profit.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X