»   » అంకుల్ అంటే చెంప పగులకొడుతా.. సల్మాన్ వార్నింగ్.. ఎవరికో తెలుసా!

అంకుల్ అంటే చెంప పగులకొడుతా.. సల్మాన్ వార్నింగ్.. ఎవరికో తెలుసా!

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ అందరూ ముద్దుగా పిలుచుకునే పేరు సల్లుభాయ్. అలా తప్పా మరోలా పిలిస్తే సల్మాన్‌కు చిర్రెత్తుకొస్తుందట. ఆ విషయంలో యంగ్ హీరో వరుణ్ ధావన్ పై సల్మాన్ సీరియస్ అయ్యారట. వరుణ్ పై సల్మాన్ ఎందుకు ఆగ్రహం వ్యక్తం చేశాడో తెలుసుకుంటే ఆశ్చర్యమేస్తుంది. 1997లో జుడ్వా చిత్రం బ్లాక్ బస్టర్ అయిన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈ ఘటన చోటుచేసుకొన్నది. అప్పుడు వరుణ్ ధావన్ వయస్సు ఏడేండ్లు.

అంకుల్ కాదు.. సల్లుభాయ్ పిలువని వార్నింగ్

అంకుల్ కాదు.. సల్లుభాయ్ పిలువని వార్నింగ్

జడ్వా విజయోత్సవ కార్యక్రమానికి నేను వెళ్లాను. అప్పుడు సల్మాన్ ను అంకుల్ అని పిలిచాను. అప్పుడు ఆయన అప్ సెట్ అయ్యారు. ఇంకోసారి అలా పిలుస్తే చెంపలు వాయిస్తా. మరోమారు అంకుల్ అని పిలువొద్దు. సల్లుభాయ్ అని పిలువు. నీవు డేవిడ్ ధావన్ కొడుకు అయినా లెక్క చేయను. ఇంకోసారి అంకుల్ అని పిలిస్తే థియేటర్ లోకి వెళ్లనివ్వను అని సల్మాన్ అన్నాడని ఇటీవల ముంబైలో జుడ్వా 2 ఒపెనింగ్ కార్యక్రమంలో వరుణ్ వెల్లడించారు.

హలో బ్రదర్ రీమేక్‌గా జుడ్వా

హలో బ్రదర్ రీమేక్‌గా జుడ్వా

తెలుగులో ఘనవిజయం సాధించిన హలో బ్రదర్ చిత్రాన్ని హిందీలో జుడ్వా పేరుతో రీమేక్ చేశారు. ఆ చిత్రం సల్మాన్ ఖాన్‌ను సూపర్ స్టార్ గా నిలబెట్టింది. జుడ్వాలోని పాటలు ఉత్తరాది ప్రేక్షకులనే కాకుండా దక్షిణాది ప్రేక్షకులను ఊర్రూతలూగించాయి. ఆ చిత్రానికి యంగ్ హీరో వరుణ్ ధావన్ తండ్రి డేవిడ్ ధావన్ దర్శకత్వం వహించారు.

సల్మాన్‌ను నిరాశపరచను..

సల్మాన్‌ను నిరాశపరచను..

సంచలన విజయాన్ని సాధించిన జుడ్వా చిత్రానికి సీక్వెల్‌గా జుడ్వా2 చిత్రం బాలీవుడ్ లో రూపొందుకొంటున్నది. ఈ చిత్రం ప్రారంభం కావడానికి ముందు తన తండ్రి ధావన్, సల్మాన్ తో మాట్లాడారు. మీ చిత్రానికి దీటుగా జుడ్వా2 తీస్తామని, మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నిరాశపరుచనని వరుణ్ వారికి మాట ఇచ్చారట.

సల్మాన్, డాడీ దీవెనలు తీసుకొన్నాను.

సల్మాన్, డాడీ దీవెనలు తీసుకొన్నాను.

‘జుడ్వా చిత్రం ప్రారంభానికి ముందు సల్మాన్, నిర్మాత సాజిద్ ఖాన్, డేవిడ్ ధావన్ ను కలిసి వారి దీవెనలు తీసుకొన్నాను. వారితో అన్ని విషయాలు చర్చించాను. వారిని నిరాశపరచుకుండా ఉండటానికి తగిన జాగ్రత్తలు తీసుకొంటున్నాను. జుడ్వా కంటే పెద్ద హిట్‌ను సాధించేందుకు కృషి చేస్తున్నాం' అని వరుణ్ ధావన్ తెలిపారు.

ప్రేక్షకుల మెప్పు పొందేందుకే ప్రయత్నిస్తాను

ప్రేక్షకుల మెప్పు పొందేందుకే ప్రయత్నిస్తాను

జుడ్వాలో సల్మాన్‌ నటనతో తనను పోల్చుకొంటారనే ఆందోళన లేనే లేదని వరుణ్ స్పష్టం చేశాడు. అసలు అలాంటి విషయం గురించి ఆలోచించడం లేదు. మీరే దాని గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు. నటుడిగా ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకొనే చిత్రాలు తీస్తాను. సినిమా హిట్ అయితే పెరిగే పారితోషికం గురించే ఆలోచిస్తాను. చివరకు ప్రేక్షకులు మెప్పు పొందేందుకే సినిమాలో నటిస్తాను అని వరుణ్ తెలిపారు.

తొలిసారి ద్విపాత్రాభినయం.. ఫస్ట్ లుక్ విడుదల

తొలిసారి ద్విపాత్రాభినయం.. ఫస్ట్ లుక్ విడుదల

ఇటీవల విడులైన జుడ్వా2 చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ప్రేక్షకులను ఆకట్టుకొంటున్నది. ఈ చిత్రాన్ని వరుణ్ తన ట్విట్టర్ ఖాతాలో అప్‌లోడ్ చేశాడు. జంటిల్మెన్ లుక్‌తో ఒక క్యారెక్టర్, టపోరి రాజాగా మరో మాస్ పాత్రలో వరుణ్ ద్విపాత్రాభినయం చేయనున్నారు. తొలిసారి వరుణ్ డబుల్ రోల్ చేయడం గమనార్హం.

స్పెషల్ రోల్స్‌లో సల్మాన్ ఖాన్, కరిష్మా కపూర్

స్పెషల్ రోల్స్‌లో సల్మాన్ ఖాన్, కరిష్మా కపూర్

జుడ్వా2లో సల్మాన్ ఖాన్, కరిష్మా కపూర్ కూడా తళుక్కున మెరువనున్నారు. ఈ చిత్రంలో వారు ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు. విడుదలకు ముందే సెన్సేషనల్ గా మారిన ఈ చిత్రాన్ని సాజిత్ నడియావాలా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో వరుణ్ ధావన్ జంటగా జాక్వలైన్ ఫెర్నాండేజ్, తాప్సీ పొన్ను నటిస్తున్నారు.

English summary
Varun Dhawan has been busy gearing up for this new challenge. He shared the first look of Judwaa 2 on Twitter. The corporate look shows Varun as a dapper Prem and the 'tapori' Raja is seen in casual avatar.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu